News July 7, 2025

ఆరోగ్యం రొట్టె స్వీకరించిన లోకేశ్.. ఎందుకంటే?

image

AP: నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ ఆరోగ్యం రొట్టెను స్వీకరించారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలనే దాన్ని తీసుకున్నానని, ఆయన ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా సంతోషంగా ఉండాలని కూటమి ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. రొట్టెల పండుగ కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు లోకేశ్ వెల్లడించారు.

News July 7, 2025

వార్-2 జర్నీలో ఎంతో నేర్చుకున్నా: Jr.NTR

image

బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ‘వార్-2’పై యంగ్ టైగర్ NTR అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ పూర్తైందని తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘హృతిక్ సర్‌తో సెట్‌లో ఉంటే ఎప్పుడూ బ్లాస్టే. ఆయన ఎనర్జీ చాలా ఇష్టం. వార్-2 జర్నీలో ఎంతో నేర్చుకున్నా. ఆడియన్స్‌కు డైరెక్టర్ అయాన్ పెద్ద సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌ సిద్ధం చేశారు. టీమ్‌కు థాంక్స్. AUG 14న ఈ ఫీల్‌ను మీరు ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.

News July 7, 2025

స్మార్ట్ కార్డులుంటేనే సచివాలయంలోకి ఎంట్రీ!

image

AP: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఎంట్రీకి స్మార్ట్ కార్డు సిస్టమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి ఉద్యోగికి క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డు అందజేస్తారు. మెయిన్ గేట్ వద్ద వాహనాల నంబర్‌ను స్కాన్ చేసి అనుమతించనున్నారు. ఇందుకోసం టోల్గేట్ తరహా టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వివరాలు, వాహనాల నంబర్ల సేకరణ ప్రారంభమైంది.

News July 7, 2025

వచ్చే ఏడాది ‘పంచాయత్’ ఐదో సీజన్

image

కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ ఐదో సీజన్‌ను అనౌన్స్ చేసింది. ఈ సీజన్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్‌ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీ భాషలో రూపొందిన ఈ సిరీస్ నాలుగు పార్టులు ఇతర భాషల ప్రేక్షకులనూ మెప్పించాయి. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ను తెలుగులో ‘సివరపల్లి’ పేరిట రీమేక్ చేసి ఈ ఏడాది జనవరిలో తొలి సీజన్‌ను రిలీజ్ చేశారు.

News July 7, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. గుంటూరు, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో చిన్నపాటి జల్లులు పడేందుకు ఛాన్స్ ఉందని వివరించింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మీ ప్రాంతంలో వాన పడిందా? కామెంట్ చేయండి.

News July 7, 2025

ఆర్కిటెక్చర్‌ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేదు?: షర్మిల

image

AP: YSR ఆర్కిటెక్చర్ & ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని APCC చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ‘కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతుల కోసం స్టూడెంట్స్ ఏడాదిగా పోరాటం చేస్తున్నారు. జగన్, అవినాశ్‌ అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. గత ప్రభుత్వ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి సర్కార్‌కు లేదా? సర్టిఫికెట్లు లేకుంటే విద్యార్థుల జీవితాలేమవ్వాలి?’ అని మండిపడ్డారు.

News July 7, 2025

SMలో విమర్శలతో డిజైన్ మార్చేశారు!

image

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా APR నెలలో బిహార్ ప్రభుత్వం రూ.40 లక్షల వ్యయంతో బిహార్ షరీఫ్‌లో ‘క్లాక్ టవర్’ నిర్మించిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర <<16018209>>విమర్శలు<<>> రావడంతో ఈ డ్యామేజీని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సదరు టవర్‌ను కూల్చేసింది. దాని స్థానంలోనే సరికొత్త మోడల్ క్లాక్ టవర్‌ను నిర్మిస్తోంది. ఈ భయమేదో ముందే ఉంటే ప్రజాధనం వృథా అవ్వకపోయేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

News July 7, 2025

ఈ నెల 14-16 వరకు సీఎం ఢిల్లీ పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 14-16వరకు ఢిల్లీలో పర్యటించనున్నారు. 14న సాయంత్రం ఆయన హస్తినకు బయల్దేరనున్నారు. కేంద్ర హోం, ఆర్థిక, జలశక్తి శాఖల మంత్రులను సీఎం కలవనున్నారు. ఇతర శాఖల మంత్రులనూ కలుస్తారని సమాచారం.

News July 7, 2025

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న సీఎం?

image

AP: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ఇవాళ 880 అడుగులకు నీరు చేరింది. దీంతో రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా డ్యామ్ గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. నదీ జలాలకు చీరసారెను ఆయన సమర్పించనున్నట్లు తెలిసింది. సీఎం పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News July 7, 2025

గ్రూప్-1పై తీర్పు రిజర్వ్

image

TG: గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. మెయిన్స్ జవాబు పత్రాలను పున:మూల్యాంకనం చేయాలని, లేదంటే మళ్లీ పరీక్షలు పెట్టాలని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై గతంలో జడ్జి జస్టిస్ రాజేశ్వరరావు స్టే విధించారు. దీన్ని సవాలు చేస్తూ ఎంపికైన అభ్యర్థులు పిటిషన్లు వేశారు. ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.