India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ‘వన మహోత్సవం’లో భాగంగా ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. వన మహోత్సవం కోసం 14,355 నర్సరీల్లో 20 కోట్ల మొక్కలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ, రేపు YSR కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న ఆయన రాత్రికి అక్కడ బస చేస్తారు. రేపు ఉదయం 7.30 గంటలకు పులివెందుల నుంచి బయల్దేరి ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత YSR జయంతి సందర్భంగా ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుస్తారు.
TG: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు యాజమాన్యాలు ఇవాళ సెలవును ప్రకటించాయి. ‘మొహర్రం సెలవు’ అంటూ పేరెంట్స్ ఫోన్లకు మెసేజులు పంపించాయి. రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పబ్లిక్ హాలిడే ఆదివారం రోజే ఉంది. అటు పలు స్కూళ్లు మాత్రం ఇవాళ సెలవు లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపాయి. దీంతో కొందరిలో గందరగోళం నెలకొంది. మరి మీకు సెలవు మెసేజ్ వచ్చిందా? కామెంట్.
TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలు ఇవాళ మ.3 గంటలకు విడుదల కానున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,398 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌పై హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి.
TG: పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. అటు రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నిన్న పలు జిల్లాల్లో వర్షాలు పడిన సంగతి తెలిసిందే.
ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. కానీ, డార్క్ చాక్లెట్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
*రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
*యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి
*జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గుతుంది
*జీర్ణక్రియ మెరుగవుతుంది
*వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
*మూడ్ బూస్టర్గా పనిచేస్తుంది
ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో భారత పేసర్ ఆకాశ్ దీప్ పేరు మారుమోగుతోంది. బుమ్రా లేకపోతే ఇంగ్లండ్ చేతిలో 2వ టెస్టులోనూ మనకు ఓటమి తప్పదనుకున్నారంతా. కానీ, ఆకాశ్ 10 వికెట్లు తీసి భారత్‌కు మరుపురాని విజయాన్ని కట్టబెట్టారు. బుమ్రాను మరిపించారు. ఈ ఘనతను క్యాన్సర్‌తో పోరాడుతున్న తన సోదరికి అంకితమిచ్చి హృదయాలు గెలిచారు. గబ్బాలో గతంలో ఆకాశ్ గురించి స్మిత్ ఎందుకు పొగిడారో ఈ మ్యాచ్‌తో అందరికీ అర్థమైంది.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ దంపతుల కుమార్తెకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేరు పెట్టారు. HYD వచ్చి మరీ వారి పాపకు మిరా అని నామకరణం చేశారు. కాగా ‘మిరా అంటే ప్రేమ, శాంతి. ఆమిర్ సర్ మీతో ప్రయాణం ప్రత్యేకం. మా పాపకు అద్భుతమైన పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు’ అని విశాల్ SMలో పోస్ట్ చేశారు. 2021 ఏప్రిల్ 22న వీరు వివాహం చేసుకోగా వారికి ఈ ఏప్రిల్ 22న పాప పుట్టింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు 50 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. 21 వేల మంది ఆఫీసర్ల విభాగంలో కాగా, మిగిలినవి క్లర్కులు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ నియామకాల్లో కేవలం SBI ఒక్కటే 20 వేల మందిని నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది.
రెస్పాన్సిబుల్ AIకోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని PM మోదీ తెలిపారు. వచ్చే ఏడాది భారత్‌లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’ నిర్వహిస్తామన్నారు. ‘వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో భారత్ AIని సమగ్రంగా ఉపయోగిస్తోంది. ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. డిజిటల్ కంటెంట్ ప్రామాణికతను ధృవీకరించే గ్లోబల్ స్టాండర్డ్స్ తేవాలి. కంటెంట్ మూలం తెలిస్తే.. పారదర్శకత ఉండి, దుర్వినియోగాన్ని కట్టడి చేయొచ్చు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.