News July 6, 2025

‘లక్కీ భాస్కర్’కు సీక్వెల్ ఉంది: డైరెక్టర్

image

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ధనుష్‌తో తాను తీసిన ‘సార్’ సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని తెలిపారు. గత ఏడాది OCTలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ ₹100crకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం వెంకీ తమిళ హీరో సూర్యతో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు.

News July 6, 2025

ప్రేమజంట ఆత్మహత్య!

image

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

జులై 13 నుంచి వెబ్ ఆప్షన్లు

image

AP: EAPCET, ఫార్మసీ కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదును ఈ నెల 13 నుంచి నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి జరగాల్సి ఉండగా, 13వ తేదీకి మార్చారు. ఇంజినీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు రావడానికి ఆలస్యం కారణంగానే వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.

News July 6, 2025

NFDBని అమరావతికి తరలించండి: చంద్రబాబు

image

AP: HYDలో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(NFDB)ను అమరావతికి తరలించాలని CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ‘గతంలో దేశ మత్స్య రంగంలో AP పాత్ర గుర్తించి ఈ బోర్డును HYDలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయినా ఆక్వా ఉత్పత్తుల్లో APదే కీలక వాటా. రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోంది. సుదీర్ఘ తీరం, రొయ్యల పరిశ్రమ ఉన్న APలో దీని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి’ అని వివరించారు.

News July 6, 2025

148 ఏళ్లలో తొలిసారి.. చరిత్ర సృష్టించాడు

image

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పరుగుల వరద పారించిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ <<16956685>>రికార్డుల<<>> మోత మోగించారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో 250 ప్లస్, 150 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌‌గా ఆయన ఖ్యాతి గడించారు. గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, శతకం బాదిన తొలి ప్లేయర్‌గానూ అతడు రికార్డులకెక్కారు.

News July 6, 2025

రెండ్రోజుల్లో శ్రీశైలం గేట్లు ఓపెన్!

image

AP: శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 1.88 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 878 అడుగుల నీరు ఉంది. దీంతో 8, 9 తేదీల్లో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది.

News July 6, 2025

‘అన్నదాత సుఖీభవ’ అనర్హులకు అలర్ట్

image

AP: ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హత సాధించని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మొదటి దశ పరిశీలన, రెండోదశ ధ్రువీకరణలో అర్హత సాధించలేకపోయిన రైతుల రికార్డులను కంప్లైంట్ మాడ్యూల్‌లో పొందుపరిచారు. అనర్హులుగా ఉన్న రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందు రైతు సేవాకేంద్రంలోని సిబ్బందిని కలవాలని అధికారులు తెలిపారు. ఈనెల 10లోపు ఫిర్యాదుల స్వీకరణ ముగించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ సూచించారు.

News July 6, 2025

బిర్యానీ అంటే.. అదో ఎమోషన్!

image

‘వరల్డ్ బిర్యానీ డే’ ఒకటుందని తెలుసా? జులైలో తొలి ఆదివారాన్ని బిర్యానీ డేగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమందికి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. ఇది పర్షియా నుంచి ఉద్భవించిందని, మొఘలులు భారత్‌కు తెచ్చారని నమ్ముతారు. ఇందులో హైదరాబాదీ బిర్యానీ, లక్నో, కోల్‌కతా అంటూ చాలానే రకాలున్నాయి. వీటికి అదనంగా ఫ్రై పీస్, ఉలవచారు అంటూ మనోళ్లు చాలానే కనిపెట్టారు. మరి.. మీకే బిర్యానీ ఇష్టం? COMMENT చేయండి.

News July 6, 2025

31 నుంచి సికింద్రాబాద్‌లో అగ్నివీర్ ర్యాలీ

image

TG: ఈనెల 31 నుంచి సికింద్రాబాద్‌ AOC సెంటర్‌లోని జోగిందర్ స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ(జీడీ), టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈవెంట్లు SEP 14 వరకు కొనసాగుతాయి. అటు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు AOC సెంటర్ హెడ్‌క్వార్టర్‌ను లేదా <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించాలి.

News July 6, 2025

బౌద్ధమత గురువు దలైలామా 90వ జన్మదినం

image

బౌద్ధమత అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా నేడు 90వ జన్మదినం జరుపుకుంటున్నారు. టిబెట్‌లోని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన టెన్జింగ్ గ్యాట్సో కేవలం ఐదేళ్ల వయసులోనే 14వ దలైలామా అయ్యారు. చైనా ఆక్రమణ తర్వాత 1959లో ఇండియాకి నిర్వాసితుడిగా వచ్చారు. తన సందేశాలతో 1989లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ‘మనసు ప్రశాంతంగా ఉంటే, ప్రపంచమూ ప్రశాంతంగా ఉంటుంది’ అన్న ఆయన మాటలు ఇప్పుడు అన్ని దేశాలకు అవసరం.