News July 10, 2024

‘టీ విత్ డిప్యూటీ సీఎం’ చేపట్టాలి: పవన్ కళ్యాణ్

image

APలోని జూ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ‘పర్యాటకులను ఆకర్షించేలా జూలు ఉండాలి. అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి పెట్టాలి. కొత్త జూ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు చేయాలి. జూల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాముల్ని చేయాలి. ఇందుకోసం టీ విత్ డిప్యూటీ CM కార్యక్రమం చేపట్టాలి’ అని జూ పార్క్‌ల అభివృద్ధిపై రివ్యూలో ఆయన అన్నారు.

News July 10, 2024

TTD మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ

image

AP: టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవలే ఆయన ఉద్యోగ విరమణ చేశారు. మరోవైపు ఐఅండ్‌పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. టీటీడీలో వీరిద్దరూ భారీ అవినీతికి పాల్పడ్డట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం వీరిద్దరిపై విజిలెన్స్ విచారణ చేయాలని నిర్ణయించింది.

News July 10, 2024

నీతా అంబానీ నెక్లెస్ ధర.. అక్షరాలా రూ.500 కోట్లు

image

కుమారుడు అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో నీతా అంబానీ ధరించిన డైమండ్ నెక్లెస్ హాట్ టాపిక్‌గా మారింది. పచ్చలు, వజ్రాలు పొదిగిన దాని విలువ అక్షరాలా రూ.500 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌లలో ఒకటి. ఇక నీతా వేసుకున్న బాజుబ్యాండ్ విలువ కూడా రూ.200 కోట్ల పైమాటే. మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీన్ని ధరించేవారు. రూబీలు, వజ్రాలు, స్పినెల్స్‌తో పచ్చికకామ్ పద్ధతిలో దీన్ని రూపొందించారు.

News July 10, 2024

ఏపీలో పెట్టుబడులకు విన్ ఫాస్ట్ ఆసక్తి

image

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మంచి పేరున్న విన్‌ఫాస్ట్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. రూ.4వేల కోట్లకుపైగా పెట్టుబడులతో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ తయారీ ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమని సీఎం చంద్రబాబుతో ఇవాళ జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇందుకోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లు లేదా కృష్ణపట్నం ప్రాంతాలను సంస్థ పరిశీలిస్తోంది. రాయితీలపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి.

News July 10, 2024

బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

image

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌తో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బ్యాడ్మింటన్ ఆడారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వీరిద్దరూ రాకెట్లు పట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రేపు రాష్ట్రపతి భవన్‌లో మహిళా పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో రాష్ట్రపతి ముఖాముఖి కానున్నారు. ఈ కార్యక్రమంలో సైనా నెహ్వాల్ ప్రసంగించనున్నారు.

News July 10, 2024

ఆ దాడికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి: జగన్

image

AP: వైజాగ్ డెక్కన్ క్రానికల్ ఆఫీస్‌పై <<13603493>>దాడిని<<>> మాజీ CM జగన్ ఖండించారు. ‘TDPకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే మీడియాను అణచివేసేందుకు ఇదో ప్రయత్నం. కొత్త ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నానాటికీ గాడి తప్పుతోంది. దీనికి సీఎం బాధ్యత వహించాలి’ అని జగన్ Xలో డిమాండ్ చేశారు. DCతో YCPనే కథనం రాయించిందని మంత్రి <<13604009>>లోకేశ్<<>> ఆరోపించారు.

News July 10, 2024

డెక్కన్ క్రానికల్‌ది ఫేక్ న్యూస్: లోకేశ్

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై డెక్కన్ <<13603493>>క్రానికల్<<>> అసత్య వార్తలు ప్రచురితం చేసిందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఆ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకే వైసీపీ ఈ పెయిడ్ ఆర్టికల్‌ను రాయించిందని మండిపడ్డారు. రాష్ట్ర విధ్వంసమే లక్ష్యంగా బ్లూ మీడియా విషపు రాతలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

News July 10, 2024

గ్రూప్-2 డిసెంబర్‌లో నిర్వహించాలని అభ్యర్థుల డిమాండ్

image

తెలంగాణలో గ్రూప్-2,3 <<13602917>>పోస్టులు<<>> పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. HYD సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈ అంశాలపై సమావేశమై చర్చించారు. ‘గ్రూప్-2, 3కి ఒకే రకమైన సిలబస్ ఉన్నందున షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో గ్రూప్-3, ఆ తర్వాత గ్రూప్-2 నిర్వహించాలి. DSC, గ్రూప్-2 మధ్య కేవలం ఒక్క రోజు వ్యవధే ఉంది. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.

News July 10, 2024

పద్మశ్రీ గ్రహీతలకు రూ.25 లక్షల చెక్కు

image

TG: పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందించారు. పద్మశ్రీ గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్‌ సీఎం చేతులమీదుగా చెక్కులు అందుకున్నారు.

News July 10, 2024

BREAKING: భారత్ విజయం

image

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ జయకేతనం ఎగురవేసింది. 183 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వేను 159/6కే కట్టడి చేసి 23 పరుగుల తేడాతో గెలిచింది. ఆ జట్టులో మయర్స్ హాఫ్ సెంచరీ(65*)తో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో సుందర్ 3, అవేశ్ 2, ఖలీల్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ 5 టీ20ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది.