News November 20, 2024

డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

TG: ఉస్మానియా వర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 23వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. వచ్చే నెలలో పరీక్షలు జరగనుండగా, ఎగ్జామ్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు వర్సిటీ <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించాలని సూచించారు.

News November 20, 2024

గత పాలకులు తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టలేదు: పవన్

image

AP: ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని డిప్యూటీ CM పవన్ అన్నారు. గత ప్రభుత్వం గ్రామానికి రూ.4లక్షల ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అంది ఉండేదన్నారు. వారి నిర్లక్ష్యంతో రంగు మారిన నీరు పైపుల ద్వారా వెళ్లిందని, గుడివాడలో ఈ సమస్య తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించామన్నారు. గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత టైంలోగా మార్చాలని ఆదేశించారు.

News November 20, 2024

ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు భారత్

image

ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ-2024లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు చేరింది. రాజ్‌గిర్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్‌లో జపాన్‌పై 2-0 తేడాతో విజయం సాధించింది. భారత ప్లేయర్లలో నవ్‌నీత్ కౌర్, లాల్‌రెమ్సియామి చెరో గోల్ సాధించారు. బుధవారం జరిగే ఫైనల్ మ్యాచులో చైనాతో భారత జట్టు తలపడనుంది. సా.4.45కు ప్రారంభం కానున్న ఈ మ్యాచును సోనీ స్పోర్ట్స్ టీవీ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.

News November 20, 2024

ప్రపంచాన్ని అంతం చేయగల ‘Dead Hand’?

image

రష్యాలో పుతిన్ సహా అగ్రనాయకత్వాన్ని పాశ్చాత్య దేశాలు అంతం చేస్తే? అది మొత్తం ప్రపంచానికే ప్రమాదం. ఎందుకంటే రష్యా వద్ద ‘డెడ్ హ్యాండ్’(పెరీమీటర్) అనే వ్యవస్థ ఉంది. మొత్తం బలగాలన్నీ తుడిచిపెట్టుకుపోయినా, అక్కడి అధికారి ఎవరైనా ఒక్కరు యాక్టివేట్ చేస్తే చాలు. రష్యా వద్ద ఉన్న అణ్వాయుధాలు మొత్తం శత్రుదేశాల మీదకు లాంచ్ అవుతాయి. తామే పోయేలా ఉంటే అందరూ పోవాలన్న సూత్రంతో సోవియట్ కాలంలో దీన్ని రూపొందించారు.

News November 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 20, 2024

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1969: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

News November 20, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: నవంబర్ 20, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5:08
సూర్యోదయం: ఉదయం 6:24
దుహర్: మధ్యాహ్నం 12:02
అసర్: సాయంత్రం 4:04
మఘ్రిబ్: సాయంత్రం 5:40
ఇష: రాత్రి 6.55
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 20, 2024

శుభ ముహూర్తం

image

తేది: నవంబర్ 20, బుధవారం
పంచమి: సా.4.49 గంటలకు
పునర్వసు: మ.2.50 గంటలకు
వర్జ్యం: రా.11.05-రా.12.24 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.11.30-మ.12.15 గంటల వరకు
రాహుకాలం: మ.12.00-మ.1.30 గంటల వరకు

News November 20, 2024

TODAY HEADLINES

image

✒ రష్యాపై తొలిసారి US మిస్సైల్స్‌తో ఉక్రెయిన్ దాడి
✒ ‘మణిపుర్’పై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి INC వినతి
✒ AP: రాష్ట్ర రోడ్లపైనా టోల్ యోచన: CBN
✒ AP: రూ.85,000cr పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
✒ AP: ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు: రజిని
✒ TG: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ GOను కొట్టేసిన హైకోర్టు
✒ TG: KCR తాగుబోతుల సంఘం అధ్యక్షుడు: రేవంత్
✒ TG: చేవలేనోనికి బూతులెక్కువ.. CMపై హరీశ్ ఫైర్