News July 9, 2024

2026 నాటికి ‘భోగాపురం’ పూర్తి చేస్తాం: రామ్మోహన్ నాయుడు

image

AP: 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దీని నిర్మాణంపై చంద్రబాబు, పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ‘విమానాశ్రయం పనులను గత ప్రభుత్వం జాప్యం చేసింది. మొత్తం 2,700 ఎకరాల్లో 500 ఎకరాలు కుదించేందుకు యత్నించింది. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నాం. దేశంలోనే నంబర్‌వన్ ఎయిర్‌పోర్ట్‌గా తీర్చిదిద్దుతాం’ అని ఆయన పేర్కొన్నారు.

News July 9, 2024

యాక్షన్ థ్రిల్లర్ ‘రాయన్’కు ‘A’ సర్టిఫికెట్

image

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తోన్న ‘రాయన్’ చిత్రం నుంచి సెన్సార్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా 2.25 గంటల నిడివితో ఉండనుండగా సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ అందించింది. భారీ యాక్షన్ సీన్స్ ఉండడంతో A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 26న రిలీజ్ కానున్న ‘రాయన్’ మూవీలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

News July 9, 2024

చట్నీలో ఎలుక ఘటనపై మంత్రి సీరియస్

image

TG: సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంటీన్‌లో చట్నీలో ఎలుక వచ్చిన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆయన ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీ క్యాంటీన్లలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

News July 9, 2024

ట్రెక్కింగ్‌కు వెళ్లి అదృశ్యం.. 22 ఏళ్లకు మృతదేహం లభ్యం

image

22 ఏళ్ల క్రితం ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ పర్వతారోహకుడి మృతదేహం ఇటీవల బయటపడింది. 2002లో అమెరికాకు చెందిన విలియం స్టాంప్‌ఫ్ల్.. పెరూలోని హుస్కరన్ పర్వతాన్ని ఎక్కే క్రమంలో అదృశ్యమయ్యారు. పోలీసులు ఎంత గాలించినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. తాజాగా వాతావరణ మార్పుల వల్ల మంచు కరిగి ఆయన మృతదేహం లభ్యమైంది. మంచు దట్టంగా పేరుకుపోవడంతో విలియం ఒంటిపైన ఉన్న దుస్తులు, బూట్లు, పాస్‌పోర్ట్ ఏమాత్రం చెక్కుచెదరలేదు.

News July 9, 2024

హాథ్రస్ తొక్కిసలాటకు కారణమిదే!

image

హాథ్రస్ తొక్కిసలాటకు ఈవెంట్ ఆర్గనైజర్ల నిర్వహణ వైఫల్యమే కారణమని సిట్ తెలిపింది. ‘సత్సంగ్ నిర్వాహకులు అనుమతులు తీసుకున్నా షరతులు పాటించలేదు. ఈ కార్యక్రమానికి ప్రజలను భారీగా ఆహ్వానించి వారికి కనీస ఏర్పాట్లు చేయలేదు. రద్దీ ఎక్కువైనప్పుడు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు కూడా పెట్టలేదు. ప్రమాదం జరగ్గానే నిర్వాహకులు పారిపోయారు. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని కూడా కొట్టిపారేయలేం’ అని సిట్ తన నివేదికలో పేర్కొంది.

News July 9, 2024

ఉచిత ఇసుక పాలసీ సంతోషకరం: పురందీశ్వరి

image

AP: గత ప్రభుత్వం చేసిన ఇసుక దోపిడీ ముసుగు తొలగించామని BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చెప్పారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై CBI విచారణ జరిపించాలని ఇప్పటికే CM చంద్రబాబును కోరామని తెలిపారు. ప్రజలకు మేలు చేసేలా ఉచిత ఇసుక పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకురావడం సంతోషకరమని, దీన్ని పారదర్శకంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ రాజమండ్రిలో ఇసుక ర్యాంప్‌‌ను మంత్రి దుర్గేశ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.

News July 9, 2024

రూ.5.4 లక్షల కోట్లతో SLBC రుణ ప్రణాళిక

image

AP: 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు SLBC తెలిపింది. ఇందులో రూ.3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. డెయిరీ, ఫిషరీస్, ఫౌల్ట్రీ, యాంత్రీకరణ, మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించింది.

News July 9, 2024

ఉచిత ఇసుక దుమారం.. ముంచేదెవరినో?

image

AP: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన <<13589572>>ఉచిత<<>> ఇసుక విధానంపై దుమారం చెలరేగుతోంది. తమ హయాంలోనే తక్కువ ధరకు ఇసుక ఇచ్చామంటూ <<13593990>>YCP<<>>, కాదు మేమే తగ్గించామని <<13593700>>కూటమి<<>> శ్రేణులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. ఆధారాలతో పోస్టులు చేస్తున్నాయి. ఇసుక ఫ్రీ అని చెప్పి ఈ ధరలేంటని YCP ప్రశ్నిస్తోంది. అవి తవ్వకం, రవాణా ఛార్జీలని కూటమి నేతలు చెబుతున్నారు. ఓవరాల్‌గా ఉచిత ఇసుక విధానంపై మీ కామెంట్?

News July 9, 2024

అంబానీ ఇంటి పెళ్లి.. మెనూలో ఇవి కూడా?

image

పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం ఈనెల 12న జరగనుంది. వీరి పెళ్లి భోజనాలకు సంబంధించిన కొంత మెనూ బయటకొచ్చింది. కాశీ చాట్ భండార్, టిక్కీ, టమాటా చాట్, పాలక్ చాట్, చనా కచోరి, దహీ పూరి, బనారస్ చాట్, ఫలూదా వంటివి సిద్ధం చేస్తున్నారు. వీటిని అతిథులకు నీతా అంబానీ స్వయంగా వడ్డించనున్నారట. కాగా ప్రీవెడ్డింగ్ వేడుకల్లో 2,500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు.

News July 9, 2024

ప్రభుత్వాన్ని కదిలించిన WAY2NEWS కథనం

image

AP:పలుమార్లు అధికారులను కలిసినా రైతుకు దక్కని పరిష్కారం ఒక్క Way2News కథనంతో సాధ్యమైంది. రైతు పొలంలో విద్యుత్ తీగలు వేలాడటంపై ‘<<13593535>>అన్నదాత ప్రాణాలంటే అంత అలుసా<<>>’ శీర్షికతో Way2News కథనం ప్రచురించింది. ఇది తన దృష్టికి రావడంతో అధికారులను అప్రమత్తం చేసి మంత్రి గొట్టిపాటి రవి 3 గంటల్లో పొలంలో స్తంభాలు వేయించారు. ప్రాణాలు అరచేతిన పెట్టుకుని సాగు చేసే రైతన్న సంతోషంతో Way2news, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.