News July 6, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి

News July 6, 2025

టెస్టు చరిత్రలో తొలిసారి

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.

News July 6, 2025

పట్టు బిగించిన భారత్.. మరో 7 వికెట్లు తీస్తే..

image

ENGతో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రాలే(0), డకెట్(25), రూట్(6) ఔటయ్యారు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే రేపు ఒక్కరోజే 536 రన్స్ చేయాలి. మరో 7 వికెట్లు తీస్తే టీమ్ ఇండియా గెలుస్తుంది. కాగా రెండో ఇన్నింగ్సులో భారత కెప్టెన్ గిల్ (161) సెంచరీతో మెరిశారు.

News July 6, 2025

ఊపిరి పీల్చుకున్న జపాన్

image

‘జపాన్ బాబా వాంగా’ <<16947282>>ర్యొ టట్సుకి<<>> జోస్యం చెప్పినట్లుగా ఇవాళ (జులై 5) జపాన్‌లో ఎలాంటి ప్రళయం సంభవించలేదు. అక్కడ 6వ తేదీ రావడంతో ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేశంలో చిన్న భూకంపాలు తప్ప ఎలాంటి సునామీ రాలేదు. దీంతో టట్సుకి భవిష్యవాణి నిరాధారమైందని అక్కడి మేధావులు, సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. కాగా ర్యొ టట్సుకి జోస్యంతో జపాన్‌లో ప్రళయం వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.

News July 6, 2025

ఆ సమయంలో 9 రోజులు అన్నం ముట్టను: హీరోయిన్

image

తాను ఏడాదికి రెండు సార్లు ఉపవాసం ఉంటానని హీరోయిన్ నర్గీస్ ఫక్రీ తెలిపారు. ఆ సమయంలో 9 రోజులపాటు ఏమీ తిననని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఉపవాసం చేసినన్ని రోజులు నీళ్లు తాగే బతుకుతా. ఫాస్టింగ్ అయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కానీ ముఖంలో కాస్త గ్లో ఉంటుంది. ఉపవాసం అయిపోయాక హై ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటా’ అని చెప్పుకొచ్చారు. కాగా నర్గీస్ ఇటీవల విడుదలైన ‘హౌస్‌ఫుల్ 5‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

News July 5, 2025

54 ఏళ్ల తర్వాత..

image

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నారు. 54 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. 1971లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా గిల్ తొమ్మిదో ప్లేయర్ కావడం గమనార్హం. అటు ఒకే టెస్టులో రెండు శతకాలు చేసిన 3వ భారత కెప్టెన్ అతడు. ఇక WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్(9) తర్వాతి స్థానంలో గిల్(8) ఉన్నారు.

News July 5, 2025

దారుణం: కత్తితో పొడిచి.. తాళి కట్టి.. సెల్ఫీ దిగి

image

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతికి తాళి కట్టాడు. మైసూర్‌కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు. ఇవాళ ఆమెను కత్తితో పొడిచాడు. యువతి స్పృహ తప్పి కిందపడిపోగానే మెడలో తాళి కట్టాడు. ఆపై సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. తర్వాత అతడే ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో పారిపోయాడు. పూర్ణిమ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.

News July 5, 2025

వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం

image

AP: 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లి జలాశయానికి నీటిని విడుదల చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో 419 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రానున్న రోజుల్లో కురిసే వర్షాలతో అవి మరింత పెరుగుతాయన్నారు.

News July 5, 2025

ఒక టెస్టులో అత్యధిక పరుగులు వీరివే

image

* గ్రాహం గూచ్(ENG)- 456(333, 123)
* శుభ్‌మన్ గిల్(IND)-430(269, 161)
* మార్క్ టేలర్(AUS)-426(334, 92)
* సంగక్కర(SL)-424(319, 105)
* బ్రియన్ లారా(WI)-400(ఒకే ఇన్నింగ్సు)
* గ్రెగ్ చాపెల్(AUS)-380(247, 133)
* హేడెన్(AUS)-380(ఒకే ఇన్నింగ్సు)
* సందమ్(ENG)-375(325, 50)

News July 5, 2025

భారత్ డిక్లేర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 427/6 వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ గిల్ డిక్లేర్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ 607 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ (161), రాహుల్ (55), పంత్ (65) జడేజా (69*) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మరికాసేపట్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.