News July 9, 2024

ముంబైలో రెడ్ అలెర్ట్.. స్కూళ్లు మూసివేత

image

ముంబైను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుండటంతో వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 మిమీ వర్షపాతం రావడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయి చెరువుల్ని తలపిస్తున్నాయి. జనజీనవం అస్తవ్యస్తమైంది. 50వరకు విమానాల్ని రద్దు చేశారు. రైళ్ల రాకపోకలూ స్తంభించాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

News July 9, 2024

16 రకాల కీటకాలను తినేందుకు సింగపూర్‌లో ఆమోదం

image

మిడతలు, గొల్లభామలు సహా 16 రకాల కీటకాలను ఆహారంగా తీసుకునేందుకు సింగపూర్ తమ ప్రజలకు అనుమతినిచ్చింది. వాటి దిగుమతులపై నియంత్రణ ఉండదని, ఆదేశాలు విడుదలైన క్షణం నుంచే వాటిని తినొచ్చని తెలిపింది. దీంతో అక్కడి హోటళ్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. చైనా, వియత్నాం, థాయ్‌ల్యాండ్ వంటి దేశాల నుంచి కీటకాల దిగుమతుల్ని ప్రారంభించాయి. కీటకాల్లో పలు రకాలైన ప్రొటీన్లు, ఖనిజాలు ఉంటాయంటున్నారు అక్కడి ప్రజలు.

News July 9, 2024

అథ్లెట్లు చేసే అతి పెద్ద తప్పు అదే: బింద్రా

image

ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో షూటింగ్ దిగ్గజం అభివన్ బింద్రా భారత క్రీడాకారులకు కీలక సూచనలు చేశారు. ‘మేం ఆడుతున్నప్పుడు పరిస్థితులు వేరు. కానీ నేటి తరం అథ్లెట్లు పిరికివాళ్లు కాదు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. అయితే, సాధారణంగా అథ్లెట్లు చేసే పెద్ద తప్పు గతం, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడమే. ఆడుతున్నప్పుడు ప్రస్తుతాన్నే వారు ద‌ృష్టిలో పెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు.

News July 9, 2024

నాటకాలు ఇక ఆపండి: జో బైడెన్ ఆగ్రహం

image

తన అధ్యక్ష అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతలే విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఇక నాటకాలు ఆపాలని ఓ లేఖలో తేల్చిచెప్పారు. ‘మరో 119 రోజుల్లో ఎన్నికలున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీలో స్పష్టత కొరవడటం మనకే నష్టం. అందరం ఏకతాటిపైకి వచ్చి ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది. నన్ను తప్పించాలన్న వాదనలతో విసిగిపోయాను’ అని పేర్కొన్నారు.

News July 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 9, 2024

జులై 9: చరిత్రలో ఈరోజు

image

1875: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపన
1926: దివంగత మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య జననం
1927: దివంగత నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జననం
1930: దివంగత దర్శకుడు కె. బాలచందర్ జననం
1949: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావం
1958: ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జననం
1966: గాయకుడు ఉన్నికృష్ణన్ జననం
1969: ‘పులి’ భారత జాతీయ జంతువుగా ప్రకటన
1969: మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు జననం

News July 9, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 09, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:27 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:48 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 9, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 09, మంగళవారం
చవితి: పూర్తిగా
ఆశ్లేష: ఉదయం 07.51 గంటలకు
వర్జ్యం: రాత్రి 08.50-10.34 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 08.09-09.01 గంటల వరకు
తిరిగి రాత్రి 10.57-11.41 గంటల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.00- 4.30 గంటల వరకు

News July 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 9, 2024

TODAY HEADLINES

image

* 2029లో షర్మిల ఏపీ సీఎం అవుతారు: రేవంత్
* DSC పరీక్షలు యథాతథం: TG విద్యాశాఖ
* అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఏపీ టెట్ పరీక్షలు
* ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?
* రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు: నాదెండ్ల
* నీట్-యూజీ పేపర్ లీకైన మాట వాస్తవమే: సుప్రీంకోర్టు
* J&Kలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు జవాన్లు మృతి
* రష్యాలో ప్రధాని పర్యటన.. పుతిన్‌తో భేటీ