News July 8, 2024

ED, CBI కేసులు ఉంటే చేర్చుకోం: సంజయ్

image

TG: ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలు BJPలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అలాగే ED, CBI కేసులు ఉన్న నేతలను చేర్చుకునేది లేదన్నారు. MP కేకేతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల MLAలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. రాజీనామా చేయిస్తే వచ్చే ఉపఎన్నికల్లో అన్ని సీట్లను BJP కైవసం చేసుకుంటుందన్నారు.

News July 8, 2024

అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను: మంచు మనోజ్

image

పిల్లలపై <<13581564>>అసభ్యకర<<>> కామెంట్స్ చేసిన ఓ యూట్యూబర్‌పై మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. ‘అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను’ అని వార్నింగ్ ఇచ్చారు. చిన్నపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతోపాటు అసహ్యమేస్తోందన్నారు. చైల్డ్ సేఫ్టీపై ఏడాది క్రితం ఓ వ్యక్తిని ఇన్‌స్టాలో సంప్రదించానని, అప్పుడు స్పందించని అతడు ఇప్పుడు పిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడన్నారు.

News July 8, 2024

టీం ఇండియా ఫ్యూచర్ వీరిదేనా..?

image

నిన్న జింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. రికార్డుల కోసం చూడకుండా దూకుడుగా ఆడారంటూ శర్మపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మున్ముందు భారత ఓపెనర్లుగా అభిషేక్, జైస్వాల్‌ ఉంటే బాగుంటుందంటూ నెట్టింట అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ దూకుడైన ఆటగాళ్లే కావడంతో కలిసి ఆడితే భారత్‌ పవర్ ప్లే స్కోరు పరుగులు పెడుతుందని టీం ఇండియా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

News July 8, 2024

భార్యాభర్తలకూ బదిలీ తప్పదు!

image

TG: ఒకేచోట నాలుగేళ్ల నుంచి పని చేస్తున్నవారిలో భార్యాభర్తలున్నా బదిలీ తప్పదని ఆర్థికశాఖ స్పష్టతనిచ్చింది. వారికి దగ్గరి ప్రాంతాల్లో పోస్టింగులు ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు 2018లో అమలైన విధానమే వర్తిస్తుందని తెలిపింది. ‘స్పౌజ్’ నిబంధన కింద దంపతుల్లో ఒకరు నగరంలో మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తుంటే.. నగరంలో పని చేసే వారినే గ్రామీణ ప్రాంతాలకు మార్చవచ్చని నిబంధనల్లో ఉంది.

News July 8, 2024

అతి త్వరలో గేమ్ ఛేంజర్ అప్డేట్స్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో చెర్రీ పార్ట్ షూటింగ్ పూర్తైనట్లు నిర్మాణ సంస్థ SVC ప్రకటించింది. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు మెగా పవర్ ప్యాక్డ్ జర్నీ అంటూ చరణ్ ఫొటోను పంచుకుంది. ‘మార్పు కోసం ఆడే ఆట’ అని ట్వీట్ చేసింది. అతి త్వరలోనే సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

News July 8, 2024

ఇంటర్‌‌లో చేరేందుకు చివరి అవకాశం

image

AP: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ప్రస్తుతం ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నెల 31 తుది గడువని బోర్డు కార్యదర్శి నిధిమీనా తెలిపారు. అయితే ఇదే ఆఖరి విడతని, మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేశారు.

News July 8, 2024

మహిళలకు యూనిట్ల మంజూరు ఇలా..

image

TG:పాడి పశువుల యూనిట్లు ప్రతి జిల్లాలో 500 మంది మహిళలకు ఇస్తారు. రూ.90 వేల రుణ సాయం. *నాటు కోళ్ల పెంపకానికి జిల్లాకు 2 వేల మంది ఎంపిక. రూ.15 వేల చొప్పున రుణ సాయం. *కోళ్ల ఫారాలు మండలానికో యూనిట్. రుణసాయం రూ.2.91 లక్షలు.
*పాల విక్రయ కేంద్రాలు మండలానికి ఒకటి చొప్పున మంజూరు. రుణ సాయం రూ.1.90 లక్షలు.
*సంచార చేపల విక్రయ కేంద్రాలు మండలానికి ఒకటి చొప్పున యూనిట్‌కు రూ.10 లక్షలు. 60 శాతం సబ్సిడీ ఉంటుంది.

News July 8, 2024

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం అందజేయనుంది. జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

News July 8, 2024

వర్షాకాలం.. గరంగరం అల్లం ఛాయ్‌తో ఆరోగ్యం!

image

సాధారణ టీకి బదులు రోజుకోసారి అల్లం ఛాయ్‌ తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వర్షాకాలంలో దగ్గు, జలుబు బారిన పడినవారు అల్లం ఛాయ్ తాగితే ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని హానికరమైన ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతాయి. తద్వారా రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. అల్లం టీ తరచూ తాగితే జలుబు, దగ్గు, జ్వరం వంటివి దరి చేరవట.

News July 8, 2024

YSR రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు

image

AP: కూటమి ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేస్తోంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ‘రైతు సేవా కేంద్రాలు’గా మారుస్తూ వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్బీకే లోగోతో పాటు మాజీ సీఎం జగన్ చిత్రంతో ఉన్న బోర్డులు తక్షణం తొలగించాలని పేర్కొంది.