News October 2, 2024

నితీశ్ కుమార్ ఫిట్‌గా లేరు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ సీఎం నితీశ్ శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా లేరని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో BJP తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నితీశ్‌కు ఆసరా ఇస్తోందని దుయ్య‌బట్టారు. ప్ర‌జా జీవితం నుంచి త‌ర‌చుగా ఆయ‌న గౌర్హాజ‌రు, భూ స‌ర్వే, వ‌ర‌ద‌లు, స్మార్ట్ మీట‌ర్ల బిగింపు వంటి కీల‌క విష‌యాల‌పై మౌనాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకొని నితీశ్ ఆరోగ్యాన్ని అంచ‌నా వేస్తున్నట్టు పేర్కొన్నారు.

News October 2, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 2, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:24 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:04 గంటలకు
ఇష: రాత్రి 7.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 2, 2024

ఇజ్రాయెల్‌లో టెర్రర్ ఎటాక్.. ఆరుగురు మృతి

image

ఇజ్రాయెల్‌లో ఇరాన్ క్షిపణి దాడులకు ముందు టెర్రర్ ఎటాక్ జరిగింది. టెల్ అవీవ్‌లో జరిగిన ఈ దాడిలో ఆరుగురు చనిపోగా, 12 మందికి గాయాలైనట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు.

News October 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 2, 2024

అక్టోబర్ 2: చరిత్రలో ఈరోజు

image

1852: రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విలియం రామ్సే జననం
1869: మహాత్మా గాంధీ జననం
1904: భారత రెండవ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి జననం
1906: చిత్రకారుడు రాజా రవివర్మ మరణం
* గాంధీ జయంతి
* అంతర్జాతీయ అహింసా దినోత్సవం

News October 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 2, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 2, బుధవారం
అమావాస్య: రా.12.19 గంటలకు
ఉత్తర: మ.12.22 గంటలకు
వర్జ్యం: రా.9.53 నుంచి రా.11.41 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.11.32 నుంచి మ.12.20 గంటల వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి మ.1.30 వరకు

News October 2, 2024

TODAY HEADLINES

image

* ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్స్ దాడి
* రాష్ట్రాలకు కేంద్ర వరద సాయం విడుదల
* AP:వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం: చంద్రబాబు
* AP:కాలినడకన తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్
* AP:రాష్ట్రంలో మూతపడిన మద్యం దుకాణాలు
* రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
* TG:హైదరాబాద్‌లో డీజే వినియోగంపై నిషేధం
* TG:ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
* సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఆపరేషన్
* BANపై భారత్ సంచలన విజయం

News October 2, 2024

ఇరాన్ క్షిపణులను డిఫెండ్ చేయాలని బైడెన్ ఆదేశం

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ <<14246742>>దాడి<<>> నేపథ్యంలో అక్కడి పరిస్థితులను యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు సహాయం చేయాలని, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను కాల్చివేయాలని బైడెన్ US మిలిటరీని ఆదేశించారు. కాగా ప్రతీకార దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది.

News October 2, 2024

కలల్ని రీప్లే చేసే పరికరం.. కనిపెట్టిన పరిశోధకులు

image

ఒక్కోసారి చాలా మంచి కల వస్తుంటుంది. మెలకువ వచ్చేస్తే అయ్యో చక్కటి కల డిస్టర్బ్ అయిందే అంటూ ఫీల్ అవుతుంటాం. ఇకపై అలా ఫీల్ కానక్కర్లేదు. మన మనసులో నడిచే కలను ఒడిసిపట్టి దాన్ని తిరిగి రీప్లే చేసే పరికరాన్ని బ్రెయిన్ ఇమేజింగ్, AI సాంకేతికతల సాయంతో జపాన్‌ పరిశోధకులు రూపొందించారు. పరిశోధనలో పాల్గొన్నవారు చెప్పిన కలలకు, పరికరం గుర్తించిన సమాచారానికి 60శాతం కచ్చితత్వం వచ్చిందని వారు తెలిపారు.