News July 7, 2024

మేం ముస్లింలకు వ్యతిరేకం కాదు: ఎంపీ లక్ష్మణ్

image

TG: తాము ఓటు బ్యాంకు రాజకీయాలకే వ్యతిరేకం తప్ప ముస్లింలకు కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మైనారిటీల హక్కుల్ని కాంగ్రెస్ కాలరాస్తోందని ఆరోపించారు. ‘మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు.

News July 7, 2024

కొడాలి నానిపై కేసు నమోదు

image

AP: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడలో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి ఆయనతో పాటు ఏపీ బెవరేజస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, కృ‌ష్ణా జిల్లా మాజీ జేసీ మాధవీలత కారణమయ్యారంటూ దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2011లో పబ్లిక్ టెండర్‌ ద్వారా లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి అనుచరులు తమపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

News July 7, 2024

హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం

image

హిమాచల్ ప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ధర్మశాల, పాలాంపూర్‌ ప్రాంతాల్లో ఏకంగా 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్, మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 150 రోడ్లను అధికారులు మూసేశారు. పర్యాటకులు ప్రస్తుతానికి రాష్ట్రానికి రావొద్దని సూచించారు. అత్యవసర సహాయక చర్యల బలగాలను కేంద్రం సిద్ధంగా ఉంచింది.

News July 7, 2024

టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆత్మహత్య

image

TG: టాలీవుడ్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న స్వప్న వర్మ(33) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. ఆమె ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టంకు తరలించారు. రాజమండ్రికి చెందిన మృతురాలు 3ఏళ్ల క్రితం నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది.

News July 7, 2024

భారత్ గర్వం తగ్గింది.. ఇలా జరగాల్సిందే: థరూర్

image

జింబాబ్వే చేతిలో భారత్ ఓటమిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ హర్షం వ్యక్తం చేయడం వివాదాస్పదంగా మారింది. భారత్ గర్వాన్ని జింబాబ్వే దించిందంటూ ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ‘టీ20 WC సంబురాలు ఇంకా ఆగకముందే పసికూన జింబాబ్వే చేతిలో ఓటమిపాలయ్యాం. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే బీసీసీఐకు ఇలా జరగాల్సిందే. జింబాబ్వే.. బాగా ఆడావు’ అని ట్వీట్ చేశారు. దీంతో భారత ఫ్యాన్స్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News July 7, 2024

నార్త్ అమెరికాలో ప్రభాస్ ‘కల్కి’ ప్రభంజనం

image

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898ఏడీ’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. విడుదలైన 9రోజులకే 800కోట్ల గ్రాస్ దాటిన ఈ మూవీ నార్త్ అమెరికాలో మరింతగా దూసుకెళ్తోంది. అక్కడ 15మిలియన్ డాలర్ల మార్కును దాటేసి, ఇంత వేగంగా ఆ మార్కును అందుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచింది. అక్కడి మొత్తం వసూళ్లలో బాహుబలి2 అగ్రస్థానంలో ఉండగా.. లాంగ్‌రన్‌లో కల్కి దాటేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు.

News July 7, 2024

అందుకే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్

image

జింబాబ్వేపై ఘోర ఓటమి అనంతరం టీం ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుకు గల కారణాలను వివరించారు. ‘బౌలింగ్ చాలా బాగా చేశాం. కానీ ఫీల్డింగ్, బ్యాటింగ్ పరంగా తేలిపోయాం. జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలామంది ఐపీఎల్ తర్వాత పెద్దగా ఆడింది లేదు. అది కూడా ఓ కారణం. ఓడిన విధానం నిరాశను కలిగించింది. చాలా మెరుగుపడాలి’ అని తెలిపారు. 5 మ్యాచుల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడే జరగనుంది.

News July 7, 2024

ఉక్రెయిన్‌లో లక్షకు పైగా ఇళ్లు అంధకారంలోకి

image

విద్యుత్‌ సరఫరాను లక్ష్యంగా చేసుకుని రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా సరిహద్దులోని సుమీ ప్రాంతం తీవ్ర అంధకారంలో కూరుకుపోయింది. లక్షకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ శాఖ తెలిపింది. అటు డొనెట్స్క్‌ ప్రాంతంలో యుద్ధం భీకరంగా జరుగుతోంది. రష్యా దాడిలో 11మంది పౌరులు చనిపోగా 43మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

News July 7, 2024

5-10 ఏళ్లలో ₹2.5లక్షల కోట్లకు జెప్టో ఆదాయం: CEO

image

2023 FYలో ₹2,000కోట్లుగా ఉన్న జెప్టో ఆదాయం ఏడాదిలోనే 5 రెట్లు పెరిగిందని ఆ కంపెనీ CEO ఆదిత్ పలిచా తెలిపారు. సరిగా వ్యాపారం చేస్తే ఇప్పుడున్న ₹10వేల కోట్ల ఆదాయాన్ని రాబోయే 5-10 ఏళ్లలో ₹2.5లక్షల కోట్లకు చేర్చగలమని పేర్కొన్నారు. ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలో ప్రస్తుతం టాప్‌లో ఉన్న డీమార్ట్‌ను తాము 18-24 నెలల్లో అధిగమించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో JIIF ఫౌండేషన్ డే ప్రొగ్రామ్‌లో ఆయన మాట్లాడారు.

News July 7, 2024

కుటుంబ సభ్యులతో WC విజేతల సెలబ్రేషన్స్

image

టీ20 వరల్డ్ కప్ విజయాన్ని టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ ఇళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీవర్మకు, జస్ప్రీత్ బుమ్రా తన తల్లి దల్జీత్ కౌర్‌కు, కుల్దీప్ యాదవ్ తన తల్లి ఉషా యాదవ్‌కు గోల్డ్ మెడల్స్ వేసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.