News October 2, 2024

దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్ మోగించిన ఇజ్రాయెల్

image

ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ మిలిటరీ ప్ర‌క‌టించింది. పౌరులు బాంబు షెల్టర్‌లకు దగ్గరగా ఉండాలని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్‌లు మోగించింది. జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఈ సైరన్లు మోగించినట్లు పేర్కొంది. ఫోన్లు, TVల ద్వారా ప్ర‌క‌ట‌నలు జారీ చేసింది.

News October 2, 2024

రైతులకు శుభవార్త

image

తెలంగాణలో పామాయిల్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పామాయిల్ గెలల ధరను రూ.17,043కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో రైతులకు దసరా పండుగ ముందే వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పామాయిల్ రైతులకు అధిక ధరలు అందించి రాష్ట్రంలో సాగు లాభసాటి చేసి, అన్నదాతలను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తుమ్మల వెల్లడించారు.

News October 2, 2024

కష్టాలుంటాయ్.. సిద్ధంగా ఉండండి: జిన్‌పింగ్

image

మున్ముందు పరిస్థితి కఠినంగా ఉంటుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమ దేశ ప్రజల్ని హెచ్చరించారు. చైనా జాతీయ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘మన దారి చాలా అస్తవ్యస్తంగా ఉండనుంది. కష్టాలుంటాయి. పరీక్షలుంటాయి. ఆటుపోట్లు వస్తాయి. ఎన్ని కష్టాలొచ్చినా అందరం ఐకమత్యంగా, కలిసికట్టుగా ముందుకు సాగితే మన ప్రగతిని ఆపలేవు’ అని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా చైనా ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

News October 2, 2024

ఇదేనా సబ్ కా సాథ్ సబ్ కా వికాస్?: హరీశ్

image

TG: కేంద్రం ప్రకటించిన వరద సాయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏపీకి కేటాయించిన దానితో పోలిస్తే సగం కంటే తక్కువ నిధులే ఇచ్చారని ఆగ్రహించారు. బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఒరిగిందేంటని నిలదీశారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. ఇదేనా సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని ప్రశ్నించారు.

News October 2, 2024

ఇజ్రాయెల్‌కు సాయం చేయ‌డానికి సిద్ధం: బైడెన్‌

image

ఇరాన్ దాడుల నుంచి ర‌క్ష‌ణాత్మ‌క ప్ర‌తిదాడి విష‌యంలో ఇజ్రాయెల్‌కు ఆమెరికా సాయం చేయ‌డానికి సిద్ధంగా ఉంద‌ని అధ్య‌క్షుడు జో బైడెన్ తెలిపారు. ఇరాన్ దాడుల‌పై నేష‌న‌ల్ సెక్యూరిటీ టీంతో చ‌ర్చించిన‌ట్టు వెల్ల‌డించారు. అలాగే ఈ దాడుల నుంచి రక్షణ పొందడానికి ఇజ్రాయెల్‌కు చేయాల్సిన సాయం, ఈ ప్రాంతంలోని అమెరికన్ సిబ్బందిని రక్షించడానికి యూఎస్ సంసిద్ధ‌త‌పై చ‌ర్చించిన‌ట్టు పేర్కొన్నారు.

News October 2, 2024

భారత పౌరులు అప్రమత్తంగా ఉండండి

image

ఇజ్రాయెల్‌‌పై ఇరాన్ క్షిపణి దాడులు, కీల‌క న‌గ‌ర‌మైన టెల్ ఆవీవ్‌లో సామూహిక కాల్పుల ఘ‌ట‌నల నేపథ్యంలో అక్కడి భారత పౌరులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఎంబసీ కోరింది. భార‌త పౌరులు జాగ్ర‌త‌గా ఉండాలని, స్థానిక అధికారులు సూచించిన విధంగా భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని సూచించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో 24×7 ఎంబ‌సీ హెల్ప్‌లైన్‌ను సంప్ర‌దించాల‌ని కోరింది.

News October 2, 2024

అణు యుద్ధం మొదలు కానుందా?

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగింది. దీంతో అటు ఇరాన్, ఇటు అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. ఒక వేళ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదిరితే న్యూక్లియర్ వార్ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా, హౌతీలతో ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ కూడా యుద్ధంలోకి ఎంటరైంది. యుద్ధం ఇలాగే కొనసాగితే మిడిల్ ఈస్ట్ రగిలిపోయే ఛాన్స్ ఉంది.

News October 2, 2024

నీరజ్‌ చోప్రాకు గుడ్ బై చెప్పిన కోచ్

image

జావెలిన్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో ఆయన కోచ్ క్లాస్ బార్టోనీఎట్జ్ బంధం ముగిసింది. 75 ఏళ్ల క్లాస్ ఇకపై తన కుటుంబంతో గడిపేందుకు స్వదేశం జర్మనీకి పయనమయ్యారు. ఆయన గతంలోనే వెళ్లిపోదామనుకున్నప్పటికీ రిక్వెస్ట్ చేసి ఆపామని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈసారి మాత్రం వెళ్లడానికే నిర్ణయించుకున్నారన్నారు. నీరజ్ 2సార్లు ఒలింపిక్ మెడల్ గెలవడం వెనుక క్లాస్ కీలక పాత్ర పోషించారు.

News October 2, 2024

శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ మూసేయాలని ఆదేశం

image

HYD మాదాపూర్‌లోని శ్రీచైతన్య కాలేజీ హాస్టల్‌పై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై మండిపడింది. ఈ హాస్టల్ తక్షణమే మూసివేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేసింది. కాగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద కాలేజీని <<14239343>>సందర్శించిన <<>>24 గంటల్లోనే బాలల హక్కుల కమిషన్ చర్యలు తీసుకోవడం గమనార్హం.

News October 2, 2024

BREAKING: సిద్దరామయ్యకు ఈడీ నోటీసులు

image

ముడా స్కాంలో ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 3న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఖరీదైన భూములను తన భార్య పార్వతికి సిద్దరామయ్య కేటాయించారనేది ఆరోపణ. దీనిపై ED కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆ భూములు తిరిగి ఇచ్చేస్తామని పార్వతి ప్రకటించారు.