News July 6, 2024

గోవా వెళ్లే వారికి తీపి కబురు

image

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా)కు కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (17039/17040)ను ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైలు బుధ, శుక్రవారాల్లో SEC నుంచి.. గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్ తదితర స్టేషన్లలో ఆగుతుంది.

News July 6, 2024

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు భారీ జరిమానా

image

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ.1.31 కోట్ల జరిమానా విధించింది. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కస్టమర్ల చిరునామాలకు సంబంధించిన రికార్డులు భద్రపరచడంలో PNB విఫలమైందని ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు పనితీరుపై 2022 మార్చి 30న తనిఖీలు నిర్వహించగా ఆదేశాలు పాటించని బ్యాంకులకు నోటిసులు జారీ చేసింది. అయితే వాటి వివరణతో సంతృప్తి చెందకపోవడంతో ఫైన్ వేసింది.

News July 6, 2024

విషాదం.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడి మృతి

image

TG: భద్రాద్రి కొత్తగూడెం(D) చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న 13 ఏళ్ల హరికృష్ణ(13) గుండెపోటుతో మరణించాడు. పాఠశాలలోనే ఛాతీలో నొప్పి రావడంతో సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా బాలుడికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News July 6, 2024

పాపం.. నీళ్లు పట్టుకున్నాడని కూలీని కొట్టి చంపారు

image

TG: మెదక్ జిల్లా టేక్మాల్(M) పరిధిలోని బోడగట్టుకు చెందిన సాయిలు(35) భార్య, పిల్లలతో HYDలో ఉంటూ కూలిపని చేస్తున్నారు. అడ్డా మీద దాహం వేయడంతో ఓ టీ స్టాల్‌కి వెళ్లి బాటిల్‌లో నీరు పట్టుకున్నారు. ‘దాహం వేస్తే తాగు. కానీ బాటిల్లో ఎందుకు నింపుకున్నావు’ అని టీ స్టాల్‌లోని సతీశ్ అనగా గొడవ మొదలైంది. సతీశ్ స్నేహితులు వచ్చి సాయిలును తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 6, 2024

కాంగ్రెస్, బీజేపీ సంబంధం మళ్లీ బయటపడింది: BRS

image

TG: CM రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత అమిత్ షాపై పాతబస్తీలో నమోదైన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసును ఉపసంహరించుకున్నారని BRS ట్వీట్ చేసింది. దీని ద్వారా కాంగ్రెస్, BJP మధ్య ఉన్న అక్రమ సంబంధం మళ్లీ బయటపడిందని పేర్కొంది. ‘మొన్న సింగరేణి బొగ్గు గనుల వేలంకు BJPకి మద్దతు తెలపడం. ఇప్పుడు కేసు కొట్టివేయడం.. ఇలా కాంగ్రెస్, BJP పరస్పర సహకారంతో ప్రజలను మోసం చేస్తున్నాయి’ అని ఆరోపించింది.

News July 6, 2024

ALERT: HDFC నుంచి ఈ మెసేజ్ వచ్చిందా?

image

బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ HDFC సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు యూజర్లకు మెసేజ్‌లు పంపుతోంది. ఈనెల 13వ తేదీన ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సిస్టమ్ అప్‌గ్రేడ్ జరగనుంది. ఈ సమయంలో ATM & DEBIT CARDS మాత్రమే పనిచేస్తాయి. మూడున్నర గంటలు (9:30AM – 12:45PM) UPI పనిచేయదు. నెట్ & మొబైల్ బ్యాంకింగ్ సేవలు పాక్షికంగా అందుబాటులో ఉంటాయి.

News July 6, 2024

మోదీ అయోధ్య నుంచే పోటీ చేద్దామనుకున్నారు.. కానీ: రాహుల్

image

తనకు నేరుగా దేవుడితో కనెక్షన్ ఉందని చెప్పే మోదీ.. అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన ‘మోదీ అయోధ్య నుంచే పోటీ చేద్దామనుకున్నారు. కానీ ఓడిపోతారని సర్వేలు చెప్పాయి. తన రాజకీయ జీవితం అయోధ్యలో ముగుస్తుందనే భయంతో మోదీ పోటీ చేయలేదు’ అని ఎద్దేవా చేశారు. కాగా ఎల్లుండి తాను మణిపుర్‌ వెళ్లనున్నట్లు రాహుల్ తెలిపారు.

News July 6, 2024

పులివెందుల చరిత్రలో ఇలాంటి సంప్రదాయం లేదు: జగన్

image

AP: రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. నిన్న కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన జగన్.. వైసీపీకి ఓటేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పులివెందుల చరిత్రలో ఇలాంటి సంప్రదాయం లేదని, శిశుపాలుడి పాపాల మాదిరిగా బాబు పాపాలు పండుతున్నాయని జగన్ విమర్శించారు.

News July 6, 2024

‘కల్కి’ వసూళ్ల ప్రభంజనం

image

బాక్సాఫీస్ వద్ద ‘కల్కి’ మూవీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ‘బాక్సాఫీస్ ఆన్ ఫైర్’ అని పేర్కొంది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్లు నటించిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది.

News July 6, 2024

వాట్సాప్‌లో త్వరలోనే మరో ఫీచర్!

image

వాట్సాప్ తన యూజర్ల కోసం మరో ఫీచర్ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దాదాపు అందరు యూజర్లకు ‘మెటా AI’ని అందుబాటులోకి తెచ్చింది. అది ప్రస్తుతం యూజర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ AI జనరేటెడ్ ఫొటోలను అందిస్తోంది. అయితే త్వరలోనే మన ఫొటోలకు రిప్లై ఇవ్వడంతో పాటు వాటిని ఎడిట్ చేయనుంది. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.