News July 6, 2024

వాట్సాప్‌లో త్వరలోనే మరో ఫీచర్!

image

వాట్సాప్ తన యూజర్ల కోసం మరో ఫీచర్ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దాదాపు అందరు యూజర్లకు ‘మెటా AI’ని అందుబాటులోకి తెచ్చింది. అది ప్రస్తుతం యూజర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ AI జనరేటెడ్ ఫొటోలను అందిస్తోంది. అయితే త్వరలోనే మన ఫొటోలకు రిప్లై ఇవ్వడంతో పాటు వాటిని ఎడిట్ చేయనుంది. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

News July 6, 2024

దూకుడుగా ‘ఆపరేషన్ ఆకర్ష్‌’.. కాంగ్రెస్‌లోకి మరో నలుగురు ఎమ్మెల్యేలు?

image

TG: ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్‌’లో దూకుడు పెంచింది. దీంతో ఆ పార్టీలోకి BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా గద్వాల MLA హస్తం కండువా కప్పుకున్నారు. ఇక BRSకు చెందిన మరో 4 ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వారెవరనేది ఆసక్తిగా మారింది. మరోవైపు వెళ్లేవారితో పార్టీకి నష్టమేమీ లేదంటున్న KCR.. వలసలు ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

News July 6, 2024

టీటీడీ, పోర్టుల్లో తెలంగాణ వాటా కోరడం ఆందోళనకరం: బొత్స

image

AP: ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విభజన సమస్యల పరిష్కారానికి జరగనున్న సమావేశంలో ఏపీ పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న <<13573822>>వార్తలు<<>> రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సీఎంల భేటీని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుంది’ అని ట్వీట్ చేశారు.

News July 6, 2024

హీరో రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు.. స్పందించిన పోలీసులు

image

TG: హీరో రాజ్‌తరుణ్ తనను మోసం చేశారని లావణ్య చేసిన ఫిర్యాదుపై నార్సింగి పోలీసులు స్పందించారు. ‘4 పేజీలతో హీరో రాజ్‌తరుణ్ సహా మరికొందరిపై ఆమె ఫిర్యాదు చేశారు. సరైన ఫార్మాట్‌లో కంప్లైంట్ లేదు. తేదీలు, సమయం, ప్లేస్ వివరాలు ఇవ్వలేదు. ఫోన్ కాల్స్, నోటీసులకు ఆమె స్పందించడం లేదు’ అని వెల్లడించారు. అటు సాయంత్రం వరకు వేచి చూసి దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పోలీసులు పరిగణించే ఛాన్సుంది.

News July 6, 2024

ఆ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి: నిరంజన్ రెడ్డి

image

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ నేతలకు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు మీడియాతో పేర్కొన్నారు. దీనిపై ఆయన స్పందించాలని కోరారు. ఆరు గ్యారంటీల ఊసెత్తకుండా ఇలాగే పాలన కొనసాగితే ప్రజలు ఉపేక్షించరని దుయ్యబట్టారు.

News July 6, 2024

‘జై హనుమాన్’ రిలీజ్ అప్పుడే: నిర్మాత

image

ప్రశాంత్ వర్మ, తేజా సజ్జ కాంబినేషన్లో తెరకెక్కిన ‘హనుమాన్’ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్’ మూవీ రిలీజ్‌కు రెండేళ్ల సమయం పట్టవచ్చని నిర్మాత చైతన్య రెడ్డి అన్నారు. వచ్చే ఏడాదే ఈ సినిమాను విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించడంతో తాజాగా నిర్మాత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా వీరి నిర్మాణంలో తెరకెక్కిన ‘డార్లింగ్’ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది.

News July 6, 2024

ప్రభుత్వ సలహాదారుగా కేకే

image

TG: కే.కేశవరావును రాష్ట్ర సలహాదారుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ ఎఫైర్స్‌కు (ప్రజాసంబంధాల)కు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తారని, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కేకే కాంగ్రెస్‌లో చేరారు.

News July 6, 2024

అమరావతి-హైదరాబాద్ మధ్య కొత్త హైవే?

image

హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రస్తుతం 270.7KM పొడవైన 4 లైన్ల హైవేను 6 లైన్లకు విస్తరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇదే సమయంలో అమరావతి-HYD మధ్య దూరం తగ్గించేలా కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని AP ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది సాకారమైతే అమరావతి-HYD మధ్య 60-70KM వరకూ దూరం తగ్గుతుంది. 201-220KM పొడవైన ఈ హైవేను APలోని చందర్లపాడు, నేరేడుచర్ల, తిప్పర్తి మీదుగా నిర్మించాలని సూచించింది.

News July 6, 2024

100 అడుగుల ధోనీ కటౌట్

image

అభిమాన ప్లేయర్ల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫ్యాన్స్ వెనకడుగు వేయట్లేదు. రేపు మాజీ క్రికెటర్ ధోనీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏపీలోని నందిగామలో ఫ్యాన్స్ 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని ఐదేళ్లు గడుస్తున్నా ఆయనపై అభిమానం ఏ మాత్రం తగ్గలేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News July 6, 2024

మసూద్ గెలుపుతో టెన్షన్స్ తగ్గుతాయా?

image

ఇజ్రాయెల్‌పై పోరులో హమాస్‌కు మద్దతు, USతో సంబంధాలు క్షీణించిన వేళ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో <<13575769>>మసూద్<<>> పెజెష్కియన్ గెలుపొందడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వంలో ఇస్లామిస్ట్ వాదుల మెజార్టీ, సుప్రీంలీడర్‌గా ఆయతొల్లా ఖోమైనీ ఉండటం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ మసూద్ పాలన సాగించాలి. సంస్కరణవాది అయిన మసూద్ హిజాబ్‌పై చట్టాల సడలింపు సహా అంతర్జాతీయ పాలసీల్లో మార్పు తెస్తారని ఆయన మద్దతుదారులు ఆశిస్తున్నారు.