News July 6, 2024

9న సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ రైలు

image

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈ నెల 9న మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం కానుంది. అయోధ్య, కాశీ, గయ, ప్రయాగరాజ్ తదితర పుణ్యక్షేత్రాలను కలిపేలా ఈ రైలు నడవనుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు. స్లీపర్ టికెట్ ధర రూ.15,510, కంఫర్ట్ కేటగిరీ ధర రూ.31,500గా నిర్ణయించారు.

News July 6, 2024

నిమ్స్ అడిషినల్ ప్రొఫెసర్ ఆత్మహత్య!

image

TG: నిమ్స్ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్ ఆత్మహత్య చేసుకున్నారు. HYDలోని బేగంపేటలోని తన నివాసంలో అధిక మోతాదులో మత్తుమందు తీసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాచీకర్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్తీషియా డిపార్ట్‌మెంట్‌లో అడిషినల్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

గ్రామంలో ‘పంచాయితీ’ తీర్చిన గేదె

image

ఇద్దరు వ్యక్తుల పంచాయితీని గేదె సులువుగా తీర్చేసిన ఘటన UPలోని ప్రతాప్‌గఢ్‌‌లో జరిగింది. నందలాల్‌కు చెందిన గేదె తప్పిపోగా, దాన్ని హనుమాన్ అనే వ్యక్తి తన ఇంట్లో కట్టేసి తిరిగిచ్చేందుకు నిరాకరించాడు. ఈ వివాదంపై పోలీసులు పంచాయితీ చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఇరువురూ రోడ్డుకు చెరో వైపు వెళ్లాలని, గేదె ఎవరిని అనుసరిస్తే వారికే సొంతమని SHO చెప్పారు. అది యజమాని నందలాల్‌కు వైపే వెళ్లడంతో కేసు క్లోజైంది.

News July 6, 2024

జగనన్న మెగా లేఅవుట్‌పై విచారణ: చంద్రబాబు

image

AP: YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్‌పై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఇక్కడ 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని MLC రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం స్థలాలు మంజూరు చేసి, ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తిచేయలేదని తెలిపారు. రూ.84.70 కోట్ల బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు నిలిపినట్లు MLC పేర్కొనగా, సీఎం విచారణకు ఆదేశించారు.

News July 6, 2024

అనంత్-రాధికల పెళ్లి వేడుక.. హాట్‌స్టార్‌లో లైవ్

image

పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహం ఈనెల 12న జరగనుంది. ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను హాట్‌స్టార్ దక్కించుకుంది. జులై 12న ‘శుభ్ వివాహ్‌’తో వేడుక ప్రారంభం కానుంది. 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్‌తో కార్యక్రమాలు ముగియనున్నాయి. ఈ సంబరాలను హాట్‌స్టార్‌లో లైవ్‌లో వీక్షించొచ్చని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే సంగీత్ కార్యక్రమం గ్రాండ్‌గా ముగిసింది.

News July 6, 2024

గూగుల్‌ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ‘ఓలా మ్యాప్స్’

image

గూగుల్‌ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ‘ఓలా మ్యాప్స్’ తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ CEO భావిశ్ అగర్వాల్ ప్రకటించారు. గతంలో మ్యాప్స్ కోసం ఏడాదికి ₹100కోట్లు వెచ్చించేవాళ్లమని, ఇక నుంచి ఆ ఖర్చు ఉండదని చెప్పుకొచ్చారు. ఓలా యాప్ యూజర్లు వెంటనే యాప్ అప్డేట్ చేసుకోవాలని కోరారు. ఈ మ్యాప్స్‌లో స్ట్రీట్ వ్యూ, ఇండోర్ ఇమేజ్‌లు, 3D మ్యాప్‌లు, డ్రోన్ మ్యాప్‌లు మొదలైన ఫీచర్స్ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

News July 6, 2024

చెస్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన గ్రాండ్‌ మాస్టర్

image

బంగ్లాదేశ్‌కు చెందిన టాప్-ర్యాంక్ చెస్ గ్రాండ్‌ మాస్టర్ జియావుర్ రహ్మాన్ (50) మృతి చెందారు. తోటి గ్రాండ్‌మాస్టర్ ఇనాముల్ హుస్సేన్‌తో జరిగిన ఛాంపియన్‌షిప్ గేమ్ 12వ రౌండ్‌లో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. ఢాకాలోని ఓ ఆసుపత్రికి రహ్మాన్‌ను తరలించగా వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. 2022లో ఇండియాలో జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్‌లో బంగ్లాదేశ్‌కు ఆయన ప్రాతినిధ్యం వహించారు.

News July 6, 2024

వీల్ బ్రేక్.. రైలును నిలిపివేసిన సిబ్బంది

image

TG: హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ వీల్ బ్రేక్ కావడంతో సిబ్బంది రైలును మిర్యాలగూడలో నిలిపివేశారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

వారికి పరిహారం సరికాదు.. మద్రాస్ హైకోర్టులో పిల్

image

తమిళనాడులో కల్తీసారా ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలైంది. వారేమీ స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక కార్యకర్తలు కాదని గౌస్ తన పిల్‌లో పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన వారి కుటుంబాలకే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. కల్తీసారా తాగి మరణించిన ఘటనలో ఇవ్వడం సరికాదని తెలిపారు. దీనిపై కోర్టు విచారణను 2వారాలకు వాయిదా వేసింది.

News July 6, 2024

చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు $76 మిలియన్లు

image

కెనడాలోని ఓ చర్చి నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో చిన్నారులపై ప్రీస్ట్‌లు, ఇతర చర్చి అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 1940 నుంచి కొనసాగుతున్న ఈ దురాగతం 2020లో వెలుగులోకి వచ్చింది. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కుంభకోణంగా నిలిచింది. ఈ కేసును విచారించిన కోర్టు 292 మంది బాధితులకు $76 మిలియన్లు పరిహారం చెల్లించాలని ఇటీవల ఆదేశించింది. ఒక్కొక్కరు $40వేలు-$6లక్షల మధ్య అందుకోనున్నారు.