News July 6, 2024

కాంగ్రెస్‌లోకి 8మంది MLCలు.. మండలి ఇలా!

image

TG: ఇప్పటివరకు 8మంది BRS MLCలు కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దామోదర్(MBNR), మహేందర్‌రెడ్డి(RR) హస్తం కండువా కప్పుకున్నారు. నిన్న <<13567787>>ఆరుగురు<<>> MLCలు చేరారు. తొలుత కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి ఒక్కరే ఉండగా తర్వాత బల్మూరి, మహేశ్, మల్లన్న MLCగా గెలిచారు. దీంతో పార్టీ బలం 12కి చేరింది. 40 సీట్లలో BRSకు 21, MIM 2, BJP 1, PRTU 1, ఇండిపెండెంట్ ఒకరున్నారు. గవర్నర్ కోటా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.

News July 6, 2024

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే..

image

అమర్‌నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 19న అమర్‌నాథ్ యాత్ర ముగియనుంది. కాగా ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర బీజేపీ నేతల్ని అమిత్ షా ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం 90 స్థానాల్లో పార్టీ పోటీ చేయనుంది. కాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 5 స్థానాల్లో 2 చోట్లే (జమ్మూ, ఉదంపూర్‌) BJP పోటీకి దిగింది. 2 స్థానాల్లో నెగ్గింది.

News July 6, 2024

హాథ్రస్ విషాదం.. లొంగిపోయిన ప్రధాన నిందితుడు

image

యూపీ హాథ్రస్ <<13555518>>ఘటన<<>>లో ప్రధాన నిందితుడు, ఈవెంట్ ఆర్గనైజర్ మధుకర్ ఢిల్లీ పోలీసులకు లొంగిపోయినట్లు ఆయన తరఫు లాయర్ వెల్లడించారు. ఈ తొక్కిసలాటలో మధుకర్ పేరును చేర్చుతూ UPలోని సికిందర్ రావు పోలీస్ స్టేషన్లో FIR నమోదైంది. ఘటన తర్వాత మధుకర్ కనిపించకుండాపోగా తాజాగా లొంగిపోయారు. అంతకుముందు ఇదే కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News July 6, 2024

చంద్రబాబుపై కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించాలి: హైకోర్టులో పిల్

image

AP: CM చంద్రబాబు, మంత్రులు, నేతలపై నమోదైన కేసులను CBI, EDకి అప్పగించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి IRR, స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్ స్కామ్‌లపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగే అవకాశాలు లేవని జర్నలిస్ట్ బాలగంగాధర తిలక్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అప్పటి DGP హరీశ్ CID ఆఫీస్‌ను లాక్ చేశారన్నారు. మొత్తంగా 114 మందిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది.

News July 6, 2024

11న IIIT జనరల్ కౌన్సెలింగ్ జాబితా విడుదల

image

AP: RGUKT పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో జనరల్ కౌన్సెలింగ్‌కు ఎంపిక చేసిన విద్యార్థుల తుది జాబితా ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు ప్రత్యేక కేటగిరీలకు చెందిన దరఖాస్తుల పరిశీలన పూర్తైంది. నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లకు ఎంపికైన విద్యార్థులు జులై 22, 23 తేదీల్లో, ఒంగోలులో ఈ నెల 24, 25న, శ్రీకాకుళంలో 26, 27 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి.

News July 6, 2024

హార్దిక్‌ కూడా మనిషేనని మర్చిపోయాం: కృనాల్‌

image

తన సోదరుడు హార్దిక్‌ కూడా భావోద్వేగాలు కలిగిన మనిషేనని అందరం మర్చిపోయామని కృనాల్ పాండ్య అన్నారు. T20WC విజేత జట్టులో సభ్యుడు కావడంపై కృనాల్ సంతోషం వ్యక్తం చేశారు. రోహిత్‌ స్థానంలో MI కెప్టెన్‌ అయినప్పుడు హార్దిక్‌ను అందరూ ఎగతాళి చేయడంతో పాటు ఎన్నో మాటలు అన్నారని గుర్తు చేసుకున్నారు. గత 6 నెలలు అతడికి కష్టంగా గడిచాయని, ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్ పూర్తి అర్హుడని కృనాల్ అభిప్రాయపడ్డారు.

News July 6, 2024

రూ.40వేల కోట్ల రుణానికి ప్రభుత్వం కసరత్తు

image

TG: రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాల అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రుణమాఫీకి రూ.31వేల కోట్లు, రైతుభరోసా(ఎకరానికి రూ.7500)కు రూ.5వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.1500 కోట్లు అవసరం అవుతాయి. బాండ్లు, ప్రభుత్వ భూముల తాకట్టు, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేని ద్వారా ఎంత వరకూ వస్తాయనేది స్పష్టత వస్తే, మిగతాది సమీకరించనుంది.

News July 6, 2024

రూ.2లక్షల రుణమాఫీపై BIG UPDATE

image

TG: ఆగస్టు నుంచి రుణమాఫీ అమలు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత రూ.50వేలు, ఆ తర్వాత రూ.లక్ష, ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణం చెల్లించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 లక్షల మంది రైతుల్లో 70శాతం మందికిపైగా రూ.లక్షలోపే రుణం ఉన్నట్లు అంచనా వేస్తోంది. అటు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించనుంది.

News July 6, 2024

రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి

image

AP: అన్నమయ్య జిల్లా రామాపురం(మ) కొండవాండ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అటు చిత్తూరు జిల్లా పెద్దపంజాణి(మ) బసవరాజు వద్ద అనంతపురం నుంచి తమిళనాడు వెళ్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. 10 మందికి గాయాలయ్యాయి.

News July 6, 2024

16.2 కోట్లకు చేరిన డీమ్యాట్ ఖాతాలు

image

స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది జూన్ చివరకు ఈ అకౌంట్ల సంఖ్య 16.2 కోట్లకు చేరింది. జూన్‌ నెలలో కొత్తగా 42.4లక్షల మంది ఖాతాలు తెరిచారు. గతేడాది జూన్‌‌లో నమోదైన అకౌంట్లతో పోలిస్తే 34.66% పెరుగుదల ఉంది. స్టాక్ మార్కెట్లలో జోరు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు ఇందుకు దోహదపడినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.