News July 5, 2024

BREAKING: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి

image

TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ వికాస్‌రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.

News July 5, 2024

చంద్రబాబు, రేవంత్ భేటీ.. ముహూర్తం ఫిక్స్

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్‌లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనుంది.

News July 5, 2024

మా పిల్లలకు కోహ్లీ, రోహిత్ గురించి చెప్తాం: ఫ్యాన్స్

image

టీ20 వరల్డ్ కప్-2024 గెలవడంలో కీలకంగా వ్యవహరించి T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ చరిత్రలో నిలిచిపోతారని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ‘క్రికెట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మా తండ్రులు సచిన్, గంగూలీ గురించి చెప్పేవారు. మేము మా పిల్లలకు లెజెండ్స్ రోహిత్, కోహ్లీల గురించి చెప్తాం’ అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వీరి రిటైర్మెంట్‌తో ఓ శకం ముగిసిందంటున్నారు. మీరేమంటారు?

News July 5, 2024

చిన్ననాటి కోచ్‌తో కోహ్లీ.. ఫొటోలు వైరల్

image

ముంబైలో టీ20 వరల్డ్‌కప్ సెలబ్రేషన్స్ తర్వాత విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను రాజ్‌కుమార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘విరాట్.. నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ నుంచి ఇంత గొప్ప సక్సెస్ సాధించే వరకూ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు ఇలాగే విజయవంతంగా కొనసాగాలి’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

News July 5, 2024

అసలు కథ అంతా సీక్వెల్‌లోనే: నాగ్ అశ్విన్

image

‘కల్కి 2898ఏడీ’ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. అశ్వత్థామ, కర్ణుడు, సుప్రీం యాస్కిన్ పాత్రలకు ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే, ఈ పాత్రల అసలు కథంతా సీక్వెల్‌లోనే ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ‘ఆ ముగ్గురి మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలక పాత్ర పోషించనుంది. సీక్వెల్‌కు సంబంధించి నెల రోజులు షూట్ చేశాం. బాగా వచ్చింది. ఇంకా తీయాల్సి ఉంది. వీటిలో భారీ యాక్షన్ సీక్వెన్సులుంటాయి’ అని పేర్కొన్నారు.

News July 5, 2024

కవిత జుడీషియల్ రిమాండ్‌ పొడిగింపు

image

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో ఈనెల 18 వరకు రిమాండ్‌ను పొడిగించింది.

News July 5, 2024

రోహిత్ శర్మకు ‘స్వీట్ హోమ్’ వెల్‌కమ్

image

టీ20 వరల్డ్ కప్‌తో స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తన ఇంట్లో స్వీట్ వెల్‌కమ్ లభించింది. ఇంటి నిండా పూలు చల్లి ఆయనను కుటుంబసభ్యులు ఆహ్వానించారు. రోహిత్‌ను హత్తుకుని తమ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నిన్న ముంబైలో జరిగిన ఓపెన్ టాప్ బస్ పరేడ్ అనంతరం రోహిత్ నేరుగా తన నివాసానికి వెళ్లారు.

News July 5, 2024

విక్టరీ పరేడ్‌లో తప్పిపోయిన పిల్లలు!

image

‘విక్టరీ పరేడ్’లో పాల్గొనేందుకు ముంబైలోని మెరైన్ డ్రైవ్‌కు లక్షల మంది హాజరయ్యారు. T20WC ట్రోఫీతో భారత జట్టు ప్రయాణిస్తోన్న బస్సు తమవద్దకు రాగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి తప్పిపోయారు. దాదాపు డజను మంది తప్పిపోయిన పిల్లలు మెరైన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు సురక్షితంగా వారి పేరెంట్స్ వద్దకు చేరినట్లు సమాచారం.

News July 5, 2024

వారు ఏపీకి గర్వకారణం: CM చంద్రబాబు

image

AP: రాష్ట్రానికి చెందిన దండి జ్యోతికశ్రీ, యర్రాజి జ్యోతి ఫ్రాన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొననుండటం ఏపీకి గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఆణిముత్యాలు క్రీడా జగత్తులో ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

News July 5, 2024

లావణ్య ఫిర్యాదుపై స్పందించిన హీరో రాజ్‌ తరుణ్

image

ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న <<13569817>>ఆరోపణల్లో<<>> నిజం లేదని హీరో రాజ్ తరుణ్ తెలిపారు. ‘లావణ్యతో రిలేషన్‌లో ఉన్నమాట వాస్తవమే. కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోంది. వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకే దూరం పెట్టాను. ఆమెకు నా డబ్బు కావాలి. అందుకే ఈ డ్రామా. లావణ్య నన్ను చాలా టార్చర్ పెట్టింది. కన్నతండ్రిని కూడా మోసం చేసింది’ అని మీడియాతో చెప్పారు.