India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు చేసిన అటాక్స్‌లో 200 మందికి పైగా చిన్నారులు మరణించారని, 1,100 మంది పిల్లలు గాయపడ్డారని UNICEF వెల్లడించింది. 2 నెలలుగా రోజుకు ముగ్గురు చొప్పున చిన్నారులు మృత్యువాత పడుతున్నట్లు తెలిపింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా రాకెట్లు ప్రయోగించగా, ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడుల్లో మొత్తం 3,510 మంది పౌరులు చనిపోయారు.
తెలంగాణలో టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు నవంబర్ 20వ తేదీతో ముగియనుంది. ఇప్పటివరకు 1.50లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. అయితే దరఖాస్తు గడువును పొడిగించాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు కోరుతున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్ చేస్తారు.. టెట్‌కు దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <
ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ సర్వెంట్లు RSS కార్యకలాపాల్లో పాల్గొనకుండా తిరిగి నిషేధం విధించాలని రాష్ట్రపతిని మాజీ బ్యూరోక్రాట్లు కోరారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా వివక్ష లేని, నిష్పాక్షిక పాలనా వ్యవస్థను నిర్వహించేందుకు సివిల్ సర్వీసెస్‌లో రాజకీయ తటస్థ వైఖరిని కాపాడాలని పేర్కొన్నారు. రాజకీయ సంస్థలతో వీరి అనుబంధం పౌర సేవల్లో నిష్పక్షపాతానికి ప్రమాదమంటూ లేఖ రాశారు.
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రం దక్షిణ ప్రాంతంలోని కరీంగంజ్ జిల్లా పేరును ‘శ్రీభూమి’గా మారుస్తున్నట్లు క్యాబినెట్ భేటీలో ప్రకటించారు. 100ఏళ్ల క్రితం కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ కరీంగంజ్ ప్రాంతాన్ని శ్రీభూమిగా అభివర్ణించారని, ఆయన గౌరవార్థం ఈ పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష, ఆశయాలను ప్రతిబింబిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
ఆస్కార్ విజేత AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది ప్రకటించారు. ‘వారి బంధం చాలాకాలంగా ఒడిదుడుకులతో సాగుతోంది. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని సైరా తీసుకున్నారు. తమ మధ్య ఏర్పడిన అగాథం ఇక పోదని ఇద్దరూ భావిస్తున్నారు. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని బాను కోరుతున్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు.
G20 సమ్మిట్‌లో బ్రెజిల్, చిలీ దేశాధ్యక్షులు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా, గాబ్రియల్ బోరిక్‌లతో PM మోదీ సమావేశమయ్యారు. బ్రెజిల్‌తో విద్యుత్, జీవ ఇంధనం, రక్షణ, వ్యవసాయ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ కృతనిశ్చయంతో ఉందని మోదీ చెప్పారు. ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ, స్పేస్ తదితర రంగాల్లో చిలీతో సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. చిలీలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరగడం ఆనందంగా ఉందన్నారు.
అయ్యప్ప మాలధారణలో దర్గాకు వెళ్లడమేంటంటూ నటుడు రామ్ చరణ్‌పై నెట్టింట పలువురు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు ఆయన భార్య ఉపాసన ట్విటర్‌లో జవాబిచ్చారు. ‘విశ్వాసం అనేది అందర్నీ కలిపి ఉంచేదే తప్ప విడదీసేది కాదు. భారతీయులు అన్ని దారులూ దేవుడి వద్దకే అని భావించి గౌరవిస్తారు. మన బలం ఐక్యతలోనే ఉంది. రామ్ చరణ్ తన ధర్మాన్ని ఆచరిస్తూనే ఇతర మతాల్ని గౌరవిస్తారు’ అని స్పష్టం చేశారు.
AP: యాదవ, గౌడ, మాల, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు వాటికి సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున 60 మంది సభ్యులను నియమించింది. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం కల్పించింది.
రేపటి నుంచి Bank Niftyలో వీక్లీ డెరివేటివ్స్ కనిపించవు. ఈ ఇండెక్స్ Volatilityపై అవగాహన లేని రిటైల్ ట్రేడర్లు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీంతో ఇక నుంచి ఒక ఇండెక్స్‌లోనే వీక్లీ డెరివేటివ్‌లకు అవకాశం ఇవ్వాలని ఎక్స్‌ఛేంజ్‌లను SEBI ఆదేశించింది. దీంతో Nifty వీక్లీ F&Oను అలాగే ఉంచి Bank Nifty వీక్లీ ఆప్షన్స్‌ను తొలగించాలని NSE నిర్ణయించింది. ఈ ఇండెక్స్‌లో Monthly Derivatives మాత్రమే ఉంటాయి.
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా 370 రైళ్లకు అదనంగా 1,000 జనరల్ బోగీలను చేర్చనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల రోజుకు అదనంగా లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని తెలిపింది. వచ్చే రెండేళ్లలో 10వేలకు పైగా కొత్త నాన్ ఏసీ జనరల్ కోచ్‌లను ప్రవేశపెడతామంది. ఇందులో 4వేల స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.