News July 3, 2024

టీషర్ట్‌, టోన్డ్ జీన్స్‌తో కాలేజీకి రావొద్దు!

image

టీషర్ట్‌, టోన్డ్ జీన్స్‌ కాలేజీకి రావొద్దని ముంబైలోని చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ విద్యార్థులకు హుకుం జారీ చేసింది. విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో వస్తే అనుమతించమని స్పష్టం చేసింది. గతనెలలో ఇదే సొసైటీ కళాశాల ప్రాంగణంలో హిజాబ్‌, బుర్ఖా, నకాబ్‌, టోపీలపై నిషేధం విధించింది. దానిపై పలువురు విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. నిషేధాన్ని హైకోర్టు సైతం సమర్థించింది.

News July 3, 2024

DSC అభ్యర్థులకు BIG ALERT

image

AP: ఎన్నికలకు ముందు ప్రకటించిన DSCకి దరఖాస్తు చేసిన వారు మెగా DSCకి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి లోకేశ్ వెల్లడించారు. మెగా DSC, TETకు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. వయోపరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.

News July 3, 2024

రోహిత్‌కి బాల్ విసిరేద్దామనుకున్నా: సూర్య

image

T20WC ఫైనల్‌లో తాను అందుకున్నది క్లీన్ క్యాచ్‌ అని సూర్య కుమార్ స్పష్టం చేశారు. ‘సాధారణంగా రోహిత్ భాయ్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేయరు. కానీ అప్పుడు చేశారు. మిల్లర్ క్యాచ్ రోహిత్ తీసుకుంటారేమోనని ఒక్క క్షణం ఆయన వైపు చూశా. ఆయనా నా వైపు చూశారు. నేను పరిగెత్తుకెళ్లి క్యాచ్ అందుకున్నా. రోహిత్ నాకు దగ్గర్లో ఉంటే బంతిని అతడికి విసిరేద్దామనుకున్నా. కానీ సమీపంలో లేక నేనే మళ్లీ అందుకున్నా’ అని SKY చెప్పారు.

News July 3, 2024

TDP ఆఫీసుపై దాడి.. పోలీసుల అదుపులో నిందితులు

image

AP: మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో మంగళవారం అర్ధరాత్రి పలువురిని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలను రెండు, మూడు రోజులుగా సేకరించారు. CC కెమెరాల ద్వారా దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. ఇందులో గుంటూరుకి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసుల గాలింపు చర్యలతో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

News July 3, 2024

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్!

image

TG: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రేపు లేదా ఎల్లుండి కొత్త మంత్రుల ప్రకటనతో పాటు శాఖల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది.

News July 3, 2024

రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి?

image

TG: రైతు భరోసా(రైతుబంధు) ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు.. మరింత మంది సలహాలు స్వీకరించనున్నారు. ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు. 5 ఎకరాలు, 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.

News July 3, 2024

ఇవాళ హాల్‌టికెట్లు విడుదల

image

TG: ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పీజీ ఎంట్రన్స్ టెస్ట్ హాల్‌టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. 8 వర్సిటీల్లోని 45 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలకు 73,566 మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 15 వరకు పరీక్షలు జరగనున్నాయి. అటు ఇతర పరీక్షల కారణంగా ఈ నెల 7న జరగాల్సిన ఎంఈడీ పరీక్షను 16వ తేదీకి వాయిదా వేశారు. cpget.tsche.ac.in వెబ్‌సైటు నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు.

News July 3, 2024

టెస్లాతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు

image

AP: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టెస్లాతో పాటు మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం గురించి వివరిస్తున్నారు. 2019కి ముందు వివిధ సంస్థలతో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయి? మిగతా వాటి పరిస్థితి ఏంటన్న దాన్ని విశ్లేషిస్తున్నారు.

News July 3, 2024

తొక్కిసలాటలు.. విషాదాలు

image

2024: హాథ్రస్(UP)-116 మంది మృతి
2023: ఇండోర్(MP)-36 మంది మృతి
2022: వైష్ణోదేవీ ఆలయం(J&K)-12 మంది మృతి
2014: పట్నా(బిహార్)-32 మంది మృతి
2013: దతియాలో(MP)-115 మంది మృతి
2011: ఇడుక్కి(KL)-104 మంది అయ్యప్ప భక్తులు మృతి
2008: చాముండా దేవీ ఆలయం(RS)-250 మంది మృతి
2008: నైనా దేవీ కోవెల(HP)-162 మంది మృతి
2005: మంధర్‌దేవీ ఆలయం(MH)-340 మంది మృతి

News July 3, 2024

క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన తుర్కియే, నెదర్లాండ్స్

image

యూరో ఛాంపియన్ షిప్‌లో తుర్కియే, నెదర్లాండ్స్ క్వార్టర్స్ దూసుకెళ్లాయి. నిన్న రొమేనియాతో జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం నెదర్లాండ్స్ ప్లేయర్ల డామినేషనే కొనసాగింది. మరో మ్యాచులో ఆస్ట్రియాపై తుర్కియే 2-1తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ప్లేయర్ మెరిహ్ డెమిరల్ రెండు గోల్స్ చేయడం గమనార్హం. ఈ నెల 5 నుంచి 7 వరకు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచులు జరగనున్నాయి.