News July 3, 2024

ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి

image

TG: రాష్ట్రంలో చిన్నారులపై వీధి కుక్కల దాడి <<13554509>>ఘటనలు<<>> తరచూ జరుగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయట్లేదని, సరైన ఆహారం లేక మనుషులపై దాడి చేస్తున్నాయని ఓ పిల్ దాఖలైంది.

News July 3, 2024

ఆగస్టులో నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష?

image

నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో నీట్-పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నిర్వహించిన భేటీలో ఆరోగ్యశాఖ, సైబర్ సెల్, ఇతర అధికారులు, ప్రతినిధులు పరీక్ష సన్నద్ధతపై చర్చించారు. కాగా పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఎగ్జామ్ నిర్వహించే 2గంటల ముందు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News July 3, 2024

రేపటి నుంచి సదరం స్లాట్ బుకింగ్

image

AP: వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఇందుకోసం మీసేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

News July 3, 2024

రేపు స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపు

image

నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్‌లో పాల్గొని, తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు తెలియజేయాలని కోరాయి.

News July 3, 2024

అసైన్డ్ భూముల చట్టం రద్దు చేయాలని వినతి

image

AP: అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చంటూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కోరింది. ఈ మేరకు సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌‌కు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు వినతిపత్రం అందజేశారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు భూమి లేని వారికే భూపంపిణీ చేయాలన్నారు.

News July 3, 2024

ఇసుక విధానం అమలుపై కీలక సమావేశం

image

AP: నూతన ఇసుక పాలసీపై అధికారులతో CM చంద్రబాబు కూలంకషంగా చర్చించారు. వర్షాకాలం కావడంతో నదుల్లో వరదొస్తే తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. కాగా ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే ఆన్‌లైన్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందిస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నట్లు సమాచారం.

News July 3, 2024

18,526 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

image

AP: కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరకు పట్టుకున్న 15,396 టన్నుల(రూ.43.43 కోట్ల) రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనం. కాగా కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ మాఫియా అవినీతికి పాల్పడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీటిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News July 3, 2024

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ గడువు పెంపు?

image

TG: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి <<13542740>>కమిషన్ <<>>గడువుని జులై 31 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంధనశాఖతో పాటు ట్రాన్స్ కో, జెన్ కో ముఖ్యకార్యదర్శిగా రొనాల్డ్ రాస్ ఇటీవల నియమితులయ్యారు. ఆయన శాఖపై అధ్యయనం చేస్తున్న క్రమంలోనే కమిషన్ గడువు(జూన్ 30) ముగిసింది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో గడువును మరో నెల రోజులు పెంచినట్లు సమాచారం.

News July 3, 2024

భారత భావి కెప్టెన్ అతడేనా?

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో నూతన సారథి అవసరం ఏర్పడింది. ప్రస్తుతం భారత్‌కు కెప్టెన్‌గా ఎవరుంటారనే చర్చ నడుస్తోంది. కాగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ నుంచి నలుగురు టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్నారు. హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.

News July 3, 2024

వెంకటేశ్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు

image

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం రేపు జరగనుంది. వెంకీ మామ, డైరెక్టర్ అనిల్ కలిసి ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.