News May 7, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 26, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.38 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.53 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.35 గంటలకు
✒ ఇష: రాత్రి 7.51 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 7, 2025

శుభ సమయం(26-04-2025) శనివారం

image

✒ తిథి: బహుళ త్రయోదశి ఉ.6.11 వరకు
✒ నక్షత్రం: రేవతి తె.జా.3.47 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేదు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: మ.3.33-సా.5.03 వరకు
✒ అమృత ఘడియలు: రా.12.32-2.02 వరకు

News May 7, 2025

ఈనాటి ముఖ్యాంశాలు

image

* మోదీజీ POKను హిందూస్థాన్‌లో కలిపేయండి: సీఎం రేవంత్
* రాయలసీమ అభివృద్ధిపై PMతో చంద్రబాబు ప్రత్యేక చర్చ
* మంత్రుల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేస్తున్నారు: KTR
* పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. అమిత్ షా
* అవును.. ఉగ్రవాదుల్ని పెంచి పోషించాం: పాక్ రక్షణ మంత్రి
* కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ
* ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్(84) కన్నుమూత
* ఐపీఎల్‌లో CSKపై SRH విజయం

News May 7, 2025

చెపాక్‌లో చెన్నైకి చెక్ పెట్టిన SRH

image

చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి SRH అదరగొట్టింది. చెపాక్ స్టేడియంలో CSKపై తొలిసారి గెలిచింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అభిషేక్ 0, హెడ్ 19, ఇషాన్ 44, క్లాసెన్ 7, అనికేత్ 19, కమిందు 32*, నితీశ్ 19* రన్స్ చేశారు. నూర్ అహ్మద్ 2, ఖలీల్, కాంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను ఆరెంజ్ ఆర్మీ సజీవంగా ఉంచుకోగా, చెన్నై దాదాపుగా ఔటైంది.

News May 7, 2025

IND vs PAK: ముస్లిం దేశాలు ఎటు వైపు?

image

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వేళ యుద్ధం జరిగితే ముస్లిం దేశాలు ఎవరికి మద్దతిస్తాయనే చర్చ జరుగుతోంది. ముస్లింలు ఎక్కువగా ఉండే సౌదీ అరేబియా కచ్చితంగా భారత్ వైపే నిలుస్తుంది. UAE, ఇండోనేషియా, ఈజిప్టు కూడా భారత్‌కు నమ్మకమైన దేశాలు. బంగ్లాదేశ్, టర్కీ, ఖతర్ మాత్రం తటస్థంగా ఉండొచ్చు. ఇక అఫ్గానిస్థాన్ మాత్రం పాక్‌కు మద్దతు తెలిపే ఛాన్సే లేదు.

News May 7, 2025

పహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం!

image

పహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైసరన్ లోయకు టూరిస్టులను గుర్రాలపై తీసుకెళ్లే అయాజ్ అహ్మద్ అనే వ్యక్తిని జమ్మూకశ్మీర్‌లోని గందర్బాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఓ మహిళా టూరిస్టును మతం గురించి ఆరా తీసినట్లు పోలీసులకు తెలియడంతో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు, ఇతను టూరిస్టుల రాక గురించి ఉగ్రవాదులకు సమాచారం చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.

News May 7, 2025

కశ్మీర్‌లో శాంతిని ఉగ్రవాదులు సహించలేకపోయారు: రజినీకాంత్

image

పహల్గామ్ ఉగ్రదాడిని సూపర్ స్టార్ రజినీకాంత్ ఖండించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొనడాన్ని శత్రువులు చూసి సహించలేకపోయారని వ్యాఖ్యానించారు. అందుకే ఉగ్రవాదులు ఇలాంటి దాడికి ఒడిగట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఉగ్రదాడి కారకులకు గుణపాఠం చెప్పాలని కోరారు.

News May 7, 2025

అరుదైన మైలురాయికి చేరుకున్న ధోనీ

image

IPL: SRHతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో CSK కెప్టెన్ ధోనీ అరుదైన మైలురాయికి చేరుకున్నారు. టీ20ల్లో 400 మ్యాచులు ఆడిన నాలుగో భారత క్రికెట‌ర్‌గా నిలిచారు. ఈ లిస్టులో ధోనీ కంటే ముందు రోహిత్(456), దినేశ్ కార్తీక్(412), కోహ్లీ(408) ఉన్నారు. ధోనీ తన టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 7572 పరుగులు చేయగా, అందులో 28 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 84*.

News May 7, 2025

టీడీపీ జెండా అంటే అంత చిన్న చూపా?: వర్మ

image

AP: రాష్ట్రంలో ఇంకా వైసీపీ అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా <<16215262>>పోలీస్<<>> అధికారి ఉన్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్నచూపా అని నిలదీశారు. అయినా క్రమశిక్షణతో భరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ పవన్ పిఠాపురం పర్యటనలో వర్మ ఎస్పీ బిందు మాధవ్ వద్ద అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఉద్దేశించే వర్మ ట్వీట్ చేసినట్లు సమాచారం.

News May 7, 2025

ప్రభాస్ నార్మల్ యాక్టర్: మంచు విష్ణు

image

స్టార్ హీరో ప్రభాస్ తన దృష్టిలో నార్మల్ యాక్టర్ అని, లెజెండ్ కాదని నటుడు మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేశారు. అతను లెజెండ్ కావడానికి టైం పడుతుందన్నారు. ఇదే సమయంలో మోహన్‌లాల్ లెజెండరీ యాక్టర్ అని, కాలం ఆయనకు ఆ హోదా తెచ్చిందన్నారు. రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు ఆయన్ను తప్పకుండా లెజెండ్‌ను చేస్తాయనే నమ్మకం తనకుందని విష్ణు చెప్పారు. ‘కన్నప్ప’లో ప్రభాస్, విష్ణు నటించిన విషయం తెలిసిందే.