News July 2, 2024

రూ.2వేల నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: RBI

image

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.2000 నోట్లలో 97.87శాతం వరకు బ్యాకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. 2024 జూన్ 28 నాటికి రూ.7851 కోట్ల విలువైన నోట్లు మాత్రం ప్రజల వద్దే ఉండిపోయాయంది. కాగా 2016 నవంబరులో ఈ నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న రూ.2వేల నోట్లను కేంద్రం ఉపసంహరించుకుంది.

News July 2, 2024

దేశ ప్రజల ఐక్యత భేష్: మోహన్ భగవత్

image

భారత్‌లో అంతర్గగతంగా విభేదాలున్నప్పటికీ ప్రజలంతా కలిసికట్టుగానే ఉన్నారని ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. శత్రుదేశాలపై మనపై దాడికి యత్నించినప్పుడు వారిలో ఆ ఐక్యత స్పష్టంగా కనిపిస్తుందని కొనియాడారు. భారత సైనికుడు అబ్దుల్ హమీద్ జీవితం ఆధారంగా రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాతృభూమిపై ప్రజలు ఎనలేని ప్రేమ, అభిమానం చూపుతున్నారని చెప్పుకొచ్చారు.

News July 2, 2024

‘కులగురు’గా వీసీ పదవి పేరు మార్పు

image

రాష్ట్రంలోని యూనివర్సిటీల ‘వైస్ ఛాన్స్‌లర్’ పదవి పేరును ‘కులగురు’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మన సంస్కృతి సంప్రదాయాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తుందని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ‘కులపతి అనే పదం అప్పుడప్పుడు ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆ స్థానంలో ఉన్న జీవిత భాగస్వాములను కులపతి భర్తలుగా పేర్కొనడం ఇబ్బందిరకంగా మారింది’ అని సీఎం పేర్కొన్నారు.

News July 2, 2024

జగన్ ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు

image

AP: తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లను అధికారులు తొలగించారు. ఇంటికి వెళ్లే దారిలోని హైడ్రాలిక్ బొలార్డ్స్, టైర్ కిల్లర్స్‌, చెక్‌పోస్టును సైతం తీసేశారు. కాగా ఇప్పటికే జగన్ నివాసం వద్ద మూసివేసిన రహదారిని ప్రజల రాకపోకల కోసం ప్రభుత్వం తెరిపించిన సంగతి తెలిసిందే.

News July 2, 2024

బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట: మంత్రి పొంగులేటి

image

TG: బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. హౌసింగ్‌పై సమీక్షలో మాట్లాడుతూ వచ్చే 5ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 22.50లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలి దశలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.16లక్షల ఇళ్లు, రిజర్వ్ కోటా కింద 33,500 ఇళ్లను నిర్మిస్తామన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News July 2, 2024

రైళ్ల టైమ్ టేబుల్‌లో నో ఛేంజ్

image

రైళ్ల రాకపోకలకు సంబంధించి టైమ్ టేబుల్ వివరాల్లో ఎలాంటి మార్పు లేదని రైల్వే శాఖ వెల్లడించింది. డిసెంబర్ 31, 2024 వరకు ప్రస్తుతమున్న టైమ్ టేబులే కొనసాగుతుందని పేర్కొంది. కొత్త కాలపట్టికను మరింత సౌలభ్యంగా రూపొందించడం కోసం గడువును పొడిగించినట్లు పేర్కొంది. కాగా ఏటా రైళ్ల రాకపోకల సమయాలను తెలియజేస్తూ ఆ శాఖ ఓ టైమ్ టేబుల్ రిలీజ్ చేస్తుంది. అది జులై 1 నుంచి వచ్చే జులై 31 వరకు అమల్లో ఉంటుంది.

News July 2, 2024

జులై 2: చరిత్రలో ఈరోజు

image

1945: దర్శకుడు ఎస్.ఏ చంద్రశేఖర్ జననం
1952: నటుడు భానుచందర్ జననం
1965: తెలుగు చలనచిత్ర హాస్యనటుడు కృష్ణ భగవాన్ జననం
1968: నటి గౌతమి జననం
1566: ప్రముఖ జ్యోతిష్యుడు, వైద్యుడు నోస్ట్రడామస్ మరణం
1995: సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు గడ్డం రాంరెడ్డి మరణం
1843: హోమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు శామ్యూల్ హనెమాన్ మరణం

News July 2, 2024

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అదనపు బాధ్యతలు

image

AP: ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్‌కు రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎఫ్ఎస్ఎస్ సీఈవో సునీల్ కుమార్ రెడ్డిని బదిలీ చేసింది. ఆయనను అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సీఎఫ్ఎస్ఎస్ బాధ్యతలను ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్‌కు అప్పగించింది.

News July 2, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 02, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:24 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:46 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 2, 2024

మరో 6 నెలల్లో భారతీయుడు-3: శంకర్

image

భారతీయుడు-3 సినిమాని మరో 6 నెలల్లో విడుదల చేస్తామని దర్శకుడు శంకర్ తెలిపారు. పార్ట్-3లోనే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందన్నారు. ‘భారతీయుడు మూవీకి సీక్వెల్ అవసరమా? అనే సందేహంలోనే ఏళ్లు గడిచిపోయాయి. కానీ అవినీతి ఇంకా అలానే ఉందని పత్రికలు, టీవీలు గుర్తుచేశాయి. అందుకే <<13513577>>భారతీయుడు2 <<>>తీయాలనుకున్నా. ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ చిత్రాలకు సమయం వచ్చినప్పుడు పార్ట్2 తెరకెక్కిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.