News July 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 2, 2024

ఆ ప్రాంతం ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హుకుం

image

గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌లోకి మళ్లీ ఇజ్రాయెల్ దళాలు అడుగుపెట్టే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఇక్కడ నక్కారనే సమాచారంతో దాడులకు రెడీ అవుతున్నట్లు సమాచారం. నగరంలోని తూర్పు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఖాన్ యూనిస్‌లో హమాస్ ఉగ్రవాదుల కోసం ఇజ్రాయెల్ జల్లెడ పట్టింది. దాడులతో ఈ నగరం నామరూపాల్లేకుండా పోయింది.

News July 2, 2024

విపత్తు నిర్వహణ విభాగం పరిధిని విస్తరించాలి: సీఎం

image

TG: హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని ORR వరకు పెంచాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. GHMC, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీల వరకు సేవల్ని విస్తరించాలన్నారు. ఈ విభాగానికి హైడ్రాగా(HYD డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) పేరు పెట్టాలని నిర్ణయించారు. డీఐజీ, SP స్థాయి అధికారులు హైడ్రా పర్యవేక్షణ బాధ్యతలు చూడాలన్నారు.

News July 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 2, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 02, మంగళవారం
జ్యేష్ఠము
బ.ఏకాదశి: ఉదయం 08:42 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:18- 09:10, గంటల వరకు
రాత్రి 11:05- 11:49 గంటల వరకు
వర్జ్యం: సాయంత్రం 05:03 – 06:36 గంటల వరకు

News July 2, 2024

TODAY HEADLINES

image

* AP: టెట్ నోటిఫికేషన్ విడుదల
* AP: తొలిరోజు 95% పెన్షన్ల పంపిణీ
* విభజన హామీలపై చర్చకు ఆహ్వానిస్తూ రేవంత్‌కు CBN లేఖ
* వైసీపీ వాళ్లు నాకు శత్రువులు కాదు: పవన్ కళ్యాణ్
* కాంగ్రెస్‌లో చేరిన MLAలతో రాజీనామా చేయించాలి: KTR
* సీతక్కకు హోంమంత్రి పదవి?: మంత్రి రాజనర్సింహ
* భారత్‌లో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు
* పార్లమెంటులో రాహుల్ ‘హిందూ’ వ్యాఖ్యలపై వివాదం

News July 1, 2024

చంద్రబాబు లేఖపై రేవంత్ సానుకూల స్పందన!

image

ఏపీ సీఎం చంద్రబాబు <<13547318>>లేఖపై<<>> తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రేపు CBNకు ఆయన లేఖ రాయనున్నట్లు సమాచారం. ఈనెల 6న వీరిద్దరూ ప్రజాభవన్‌లో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. విభజన అంశాలు, అపరిష్కృత సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News July 1, 2024

‘కల్కి’ బద్దలు కొట్టిన రికార్డులివే!

image

భారత్‌లో ఒక వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన జవాన్(₹520CR) రికార్డును ‘కల్కి'(₹555cr+) బద్దలు కొట్టింది. అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా హను-మాన్(₹350cr) రికార్డును అధిగమించింది. 2024లో తొలి రోజు హైయెస్ట్ కలెక్షన్స్(₹191.5cr)తో పాటు మలేషియా, కెనడా, జర్మనీలో రికార్డు కలెక్షన్స్ సాధించింది. నార్త్ USలో తొలి వీకెండ్‌లో $11M రాబట్టిన తొలి ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది.

News July 1, 2024

టెట్ పరీక్షలు, ఫలితాలు ఎప్పుడంటే?

image

AP: జులై 4 నుంచి 16 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జులై 25న హాల్ టికెట్లు విడుదల చేస్తామని, ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆగస్టు 25న టెట్ ఫైనల్ కీ, 30న ఫలితాలు రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.

News July 1, 2024

మేధాపాట్కర్‌కు 5 నెలల జైలుశిక్ష

image

24 ఏళ్ల క్రితం నాటి పరువునష్టం కేసులో ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌కు ఢిల్లీ కోర్టు 5నెలల జైలుశిక్ష విధించింది. నర్మదా బచావో ఆందోళన సమయంలో ఆమె తనను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 2002లో పరువునష్టం దావా వేశారు. తాజాగా కోర్టు మేధాపాట్కర్‌కు 5నెలలు జైలుశిక్ష విధించింది. అలాగే సక్సేనాకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆమెకు సూచించింది.