News July 1, 2024

రాహుల్ స్పీచ్.. ట్రైలర్ మాత్రమే: కాంగ్రెస్

image

ఇవాళ లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత హోదాలో పరిణితితో, బాధ్యతాయుతంగా, హుందాగా తమ నాయకుడు మాట్లాడారని ప్రశంసిస్తున్నాయి. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు చూపిస్తారని హస్తం నేతలు పేర్కొంటున్నారు. అటు రాహుల్‌కు ఏమీ తెలియదనే వారు నేటి నిర్మాణాత్మక విమర్శలు చూస్తే ఆలోచన మార్చుకుంటారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

News July 1, 2024

సచివాలయాల సిబ్బందికి CM చంద్రబాబు ప్రశంసలు

image

AP: ఒక్క రోజులోనే 95%కి పైగా పెన్షన్లు పంపిణీ చేయడంపై సీఎం చంద్రబాబు సచివాలయాల సిబ్బందిని అభినందించారు. ‘గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరగలేదు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేయగలరు అనేది మరోసారి రుజువైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరం’ అని CM అన్నారు.

News July 1, 2024

పల్లెల్లో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు: మంత్రి పొన్నం

image

TG: పల్లెల్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు కింద టీజీఎస్ ఆర్టీసీకి 450 బస్సులు మంజూరు అయినట్లు తెలిపారు. వారం రోజుల్లో తొలి దశ బస్సులను ప్రారంభిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

News July 1, 2024

ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది: రాజ్‌దీప్

image

అమల్లోకి వచ్చిన ఓ క్రిమినల్ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని జర్నలిస్టు రాజ్‌దీప్ సర్‌దేశాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఉద్యోగం/ వివాహం వంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు 10 ఏళ్లు జైలు శిక్ష ఎదుర్కోవాలి. ఏకాభిప్రాయంతో సంబంధాలు పెట్టుకున్నప్పటికీ ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. సరైన చర్చ లేకుండా ఇలాంటి చట్టాలను ఎలా ఆమోదిస్తారు?’ అని ప్రశ్నించారు.

News July 1, 2024

TET నోటిఫికేషన్ విడుదల

image

AP: ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉండనుంది. ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. టెట్ పూర్తి వివరాలను రేపటి నుంచి https://aptet.apcfss.inలో అప్‌డేట్ చేయనున్నారు.

News July 1, 2024

అప్పటికీ.. ఇప్పటికీ తేడా ఇదే!

image

టీమ్ ఇండియా గతేడాదే వన్డే ప్రపంచకప్ నెగ్గేది. ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని భారత్.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచకప్ అందుకోవాలన్న భారతీయుల కల నెరవేరలేదు. ఈసారి టీ20 WCలోనూ భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. కానీ అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏంటంటే ఫైనల్. తుదిపోరులో సౌతాఫ్రికాపై అద్భుతంగా పుంజుకుని విశ్వవిజేతగా నిలిచింది రోహిత్ సేన.

News July 1, 2024

అంతరిక్షానికి ప్రధాని మోదీ.. ఇస్రో ఛైర్మన్ ఏమన్నారంటే?

image

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మొదటి మానవ మిషన్ ‘గగన్‌యాన్’ కోసం సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో ప్రధానిని అంతరిక్షంలోకి పంపిస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సమాధానమిచ్చారు. ‘గగన్‌యాన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ కూడా అంతరిక్షంలోకి వెళ్లొచ్చు. అయితే దేశాధినేతను అంతరిక్షానికి పంపగల సామర్థ్యానికి మనం చేరుకుంటే అది మనకెంతో గర్వకారణం’ అని చెప్పారు.

News July 1, 2024

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

image

ఏపీలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలను 15,058 మంది రాయగా, 9,531 మంది పాసైనట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 27,279 మంది హాజరుకాగా, 18,842 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 1, 2024

UPSC CSE ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. సైట్: https://upsc.gov.in./ జూన్ 16న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు.

News July 1, 2024

రాహుల్ ‘హిందూ’ కామెంట్స్.. రేపు సభలో మాట్లాడనున్న మోదీ

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘హిందూ’ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు రాహుల్ కామెంట్స్‌ను ఖండిస్తూ ‘హిందూ’ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇవాళ సభలో దీనిపై ప్రధాని మోదీ పెద్దగా స్పందించలేదు. రేపు ఆయన ప్రసంగిస్తారని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దీంతో రాహుల్‌పై మోదీ విరుచుకుపడే అవకాశం ఉంది.