News July 1, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

image

రాజస్థాన్‌లోని కరౌలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండాపూర్ వద్ద బొలెరో, డీసీఎం ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రోడ్డు మలుపు దగ్గర బొలెరో అదుపు తప్పి డీసీఎంను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

News July 1, 2024

వైసీపీ వాళ్లు నాకు శత్రువులు కాదు: పవన్ కళ్యాణ్

image

AP: తనకు తిట్టడానికి టైమ్ లేదని, బోలెడంత పని ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘YCP వాళ్లు నాకు శత్రువులు కాదు. నేను వ్యక్తిగత కక్షలకు దిగను. ప్రకృతి వారికి 151 సీట్లు ఇచ్చి పరీక్షించింది. కానీ వారు దాన్ని నిలుపుకోలేదు’ అని గొల్లప్రోలు సభలో వ్యాఖ్యానించారు. తాను మాట్లాడుతుండగా కొందరు కార్యకర్తలు అడ్డుపడడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రేమగా మాట్లాడుతుంటే అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించారు.

News July 1, 2024

కాంగ్రెస్ చేసిందంతా విష ప్రచారమని తేలిపోయింది: KTR

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుబట్టిన వారంతా ముక్కు నేలకు రాయాలని KTR అన్నారు. ‘మేడిగడ్డ రిపేర్లు పూర్తి, ప్రాణహితలో మొదలైన వరద’ అనే న్యూస్ ఆర్టికల్‌ను Xలో షేర్ చేశారు. ‘నిన్నటిదాకా మేడిగడ్డ మేడిపండులా మారింది. అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు. మరమ్మతులు చేసినా ఇక పనికి రాదన్నారు. నేడు మరమ్మతులు పూర్తి అంటున్నారు. అంటే ఇంతకాలం కాంగ్రెస్ చేసింది విష ప్రచారమని తేలిపోయింది’ అని పేర్కొన్నారు.

News July 1, 2024

కోహ్లీని బౌలర్లే కాపాడారు: సంజయ్ మంజ్రేకర్

image

టీ20 WC ఫైనల్‌లో POTM అవార్డు కోహ్లీకి బదులుగా బౌలర్లకు ఇవ్వాల్సిందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు ఆడిన విరాట్ 128SRతో మాత్రమే బ్యాటింగ్ చేశారని, దీని వల్ల హార్దిక్ లాంటి హిట్టర్‌కు 2 బాల్స్ మాత్రమే ఆడే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. మ్యాచ్ ఓడిపోతే కోహ్లీపై విమర్శలు వచ్చేవని, కానీ బౌలర్లు అద్భుతంగా రాణించి అతడిని కాపాడారని చెప్పుకొచ్చారు.

News July 1, 2024

వారి అండ లేకుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

image

AP: సమాజానికి ఏదోకటి చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘నేను కేవలం ఎమ్మెల్యేనే కాదు. NDAకు అండగా నిలబడ్డ వ్యక్తిని. నాకు భయం తెలియదు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. పిఠాపురం నేతలు అండగా లేకుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవి. నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలనే విధంగా అభివృద్ధి చేస్తా’ అని గొల్లప్రోలులో జరిగిన ఆత్మీయ సమావేశంలో వ్యాఖ్యానించారు.

News July 1, 2024

58 లక్షల మందికి పెన్షన్: ప్రభుత్వం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 89% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 58 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని పేర్కొంది. అత్యధికంగా శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో 94%, అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 80% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని తెలిపింది.

News July 1, 2024

జూన్‌లో తగ్గిన యూపీఐ చెల్లింపులు!

image

మే నెలలో రికార్డ్ స్థాయిలో నమోదైన UPI చెల్లింపుల జోరు జూన్‌లో నెమ్మదించింది. లావాదేవీల్లో 1శాతం, వాల్యూలో 2శాతం తగ్గింపు నమోదైంది. మేలో 14.04 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరగగా జూన్‌లో ఆ మొత్తం 13.89 బిలియన్లుగా రికార్డ్ అయింది. లావాదేవీల విలువ ₹20.45 లక్షల కోట్ల నుంచి ₹20.07 లక్షల కోట్లకు తగ్గింది. మరోవైపు మే నెలతో పోలిస్తే IMPS లావాదేవీలు 5%, ఫాస్టాగ్ లావాదేవీలు 4% తగ్గాయి.

News July 1, 2024

ఇకపై 420 కాదు 318!

image

చీటింగ్ కేసుకు పాత చట్టంలో ఉన్న సెక్షన్ 420ని కేంద్రం భారతీయ న్యాయ సంహితలో తొలగించింది. ఇకపై ఆ నేరం సెక్షన్ 318 పరిధిలోకి వస్తుంది. దేశద్రోహాన్ని సెక్షన్ 124A నుంచి 152కి, పరువునష్టాన్ని సెక్షన్ 499 నుంచి 356కి, అత్యాచార నేరాన్ని సెక్షన్ 375 నుంచి 63కి, సెక్షన్ 376Dని తొలగించి గ్యాంగ్ రేప్‌ నేరాన్ని సెక్షన్ 70(1) పరిధిలోకి తీసుకొచ్చింది. సెక్షన్ 302ను (హత్యా నేరం) SEC 103 పరిధిలోకి తెచ్చింది.

News July 1, 2024

కేబినెట్‌లోకి రాజగోపాల్, దానం: దామోదర

image

TG: త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు కూడా ఉండొచ్చని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌, నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్‌లో చోటు ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు TPCC చీఫ్ ఎంపికపైనా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అతిత్వరలో చీఫ్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

News July 1, 2024

‘కల్కి’ ఎఫెక్ట్.. పీవీఆర్ ఐనాక్స్ స్టాక్స్‌కు జోష్!

image

ఈ ఏడాది ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న PVR ఐనాక్స్‌ మార్కెట్‌కు ‘కల్కి 2898’ మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ రోజు సెషన్‌లో పీవీఆర్ షేర్ విలువ 6శాతం పెరిగి ₹1,512కు చేరింది. ‘కల్కి’కి పాజిటివ్ టాక్ రావడం ఇందుకు కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో డెడ్‌పూల్ & వోల్వరిన్, ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ వంటి బడా హాలీవుడ్ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉండటం కూడా కలిసొచ్చిందని పేర్కొన్నారు.