India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
CSK ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్‌కు గత సీజన్‌లో జాక్ పాట్ తగిలినట్లు ఆ జట్టు స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపారు. 2025 సీజన్ కోసం బ్రెవిస్‌కు CSK భారీ పారితోషికం ఇచ్చినట్లు చెప్పారు. గత సీజన్‌లో బ్రెవిస్ బేస్ ప్రైజ్ రూ.75 లక్షలు కాగా సీఎస్కే అతడికి రూ.2.2 కోట్లు ముట్టజెప్పిందని వెల్లడించారు. ఇతర జట్లు కూడా అతడిని కొనేందుకు పోటీ పడడంతో ధర పెంచినట్లు పేర్కొన్నారు.
AP: మాజీ సీఎం జగన్‌ది నీతిమాలిన చరిత్ర అని పీసీసీ స్టేట్ చీఫ్ షర్మిల విమర్శించారు. తెర వెనుక పొత్తులకు ఆయన ఓ పెద్ద బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. ‘మోదీకి జగన్ వంగి వంగి దండాలు పెట్టారు. పార్లమెంట్‌లో ఆ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చారు. మోదీ, అమిత్ షాతో హాట్ లైన్ టచ్‌లో ఉన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే విమర్శలు చేస్తారా? మీదో పార్టీ.. మీరొక నాయకుడు’ అని ఆమె ఫైర్ అయ్యారు.
AP: మూడు దశాబ్దాల తర్వాత పులివెందులలో ఓటర్లు తమకు నచ్చిన వారికి ఓటేశారని Dy.CM పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో గెలిచినవారికి అభినందనలు తెలిపారు. ‘గతంలో అక్కడ నామినేషన్లు కూడా వేయనీయలేదు. వేద్దామనుకున్నవారిపై దాడులకు తెగబడ్డారు. ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి’ అని పేర్కొన్నారు.
TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 1-2 గంటల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వాన పడుతుందని అంచనా వేసింది. అలాగే రాబోయే 2 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
AP: నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న ఉ.10గంటలకు విడుదల చేయనున్నట్లు TTD తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఈ నెల 21న ఉ.10గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 23న ఉ.10గంటలకు అంగప్రదక్షిణ, 11గంటలకు శ్రీవాణి ట్రస్టు టోకెన్ల కోటా, 25న ఉ.10గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
AP: స్పోర్ట్స్ కోటా కింద ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా 421 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 5,326 అప్లికేషన్స్ రాగా, 1200 మంది 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ క్రమంలో శాప్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామంటూ అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నారని జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. శాప్ నుంచి అలా ఎవరూ కాల్ చేసి డబ్బులు అడగలేదని స్పష్టం చేశారు. ఆశపడి డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు.
జమ్మూ కశ్మీర్‌లో <<17404381>>క్లౌడ్ బరస్ట్<<>> వల్ల ఇప్పటివరకు 30కి పైగా మరణాలు సంభవించాయి. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ విషాదం కారణంగా రేపు సాయంత్రం జరగాల్సిన ‘ఎట్ హోమ్’ టీ పార్టీని రద్దు చేసినట్లు CM ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రేపు జరగాల్సిన కల్చరల్ ప్రోగ్రామ్‌లనూ నిలిపివేయనున్నట్లు తెలిపారు. స్పీచ్, మార్చ్ ఫాస్ట్ వంటి అధికారిక కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయన్నారు.
AP: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పోలీసులు MP అవినాశ్‌ను అరెస్ట్ చేసి మంత్రి మండిపల్లిని ఎలా తిరగనిచ్చారని ప్రశ్నించారు. ‘ఈవీఎంలైతే ట్యాంపరింగ్, బ్యాలెట్‌లు అయితే రిగ్గింగ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పులివెందులలో DIG దౌర్జన్యానికి పాల్పడ్డారు. DIG తీరుపై పోలీసు సంఘం స్పందించదా?’ అని ఆయన నిలదీశారు.
యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ విడుదలై 20 రోజులైనా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.236.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.15కోట్లు, భారత్‌లో రూ.221.25 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఇవాళ రెండు పెద్ద సినిమాలు(వార్-2, కూలీ) విడుదలైనా బుక్ మై షోలో ఈ మూవీకి గంటకు 6.56k+ టికెట్లు బుక్ అవుతుండటం గమనార్హం.
సైబర్ నేరాలను అరికట్టేందుకు NPCI అక్టోబర్ 1 నుంచి UPI సేవల్లో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలను నిలిపేయనుంది. సాధారణంగా నగదు పంపేందుకు UPI పిన్ ఎంటర్ చేయాలి. అయితే కేటుగాళ్లు ఖాతాలో నగదు జమ చేస్తామని పిన్ ఎంటర్ చేయించి నగదు దోచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఫోన్ పే, గూగుల్ పే, తదితర యూపీఐ యాప్స్ ద్వారా ఫ్రెండ్స్, సన్నిహితులకు డబ్బు చెల్లించమనే రిక్వెస్ట్ పంపడం కుదరదు.
Sorry, no posts matched your criteria.