News October 1, 2024

హైడ్రాను రద్దు చేయాలని పిటిషన్.. విచారణ వాయిదా

image

TG: హైడ్రాను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. జీవో నం 99పై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరగా, ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కాగా నిన్న హైడ్రా కూల్చివేతల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

News October 1, 2024

సర్పంచ్ పదవికి వేలంపాటలో రూ.2 కోట్లు

image

పంజాబ్ గురుదాస్‌పూర్ జిల్లాలోని హర్దోల్‌వాల్ కలన్ గ్రామ సర్పంచ్ ఎన్నిక సంచలనంగా మారింది. అక్కడ పోలింగ్ లేకుండా పదవి కోసం గ్రామస్థులు రూ.50లక్షలతో వేలంపాట నిర్వహించారు. బీజేపీ నేత ఆత్మా సింగ్ రూ.2 కోట్లకు పదవిని సొంతం చేసుకున్నారు. 30ఏళ్లుగా అక్కడ ఏకగ్రీవ ఎన్నిక కొనసాగుతోంది. వేలంపాట నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను పలువురు విమర్శిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు.

News October 1, 2024

నాలుగో పెళ్లికి సిద్ధమైన నటి

image

తమిళ నటి వనిత విజయకుమార్ నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారు. కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ను ఈ నెల 5వ తేదీన వివాహం చేసుకోనున్నారు. చంద్రలేఖ(1995) సినిమా ద్వారా ఈమె వెండితెరకు పరిచయమయ్యారు. 2000లో నటుడు ఆకాశ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2005లో విడాకులు తీసుకున్నారు. 2007లో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోగా.. 2012లో విడాకులు తీసుకున్నారు. 2020లో ఓ ఫొటోగ్రాఫర్‌ను పెళ్లాడగా నాలుగు నెలల్లోనే ఈ బంధానికి స్వస్తి పలికారు.

News October 1, 2024

రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం విడుదల.. AP, TGకి ఎంతంటే?

image

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు గాను రూ.5,858 కోట్లను రిలీజ్ చేసింది. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్లు, TGకు రూ.416.80 కోట్లు కేటాయించింది. MHకు రూ.1,492 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బిహార్‌కు 655 కోట్లు, గుజరాత్‌‌కు రూ.600 కోట్లు, బెంగాల్‌కు రూ.468 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189 కోట్లు, కేరళకు రూ.145 కోట్లు, మణిపుర్‌కు రూ.50 కోట్లు కేటాయించింది.

News October 1, 2024

భారత క్రికెట్‌కు వారిద్దరూ భవిష్యత్ స్టార్లు: అశ్విన్

image

టీమ్ ఇండియాకు గిల్, జైస్వాల్ భవిష్యత్ స్టార్లుగా నిలుస్తారని భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ జోస్యం చెప్పారు. ‘జైస్వాల్‌, గిల్‌కు స్పెషల్ టాలెంట్ ఉంది. ఇద్దరూ స్వేచ్ఛగా ఆడతారు. ప్రస్తుతం కెరీర్ ఆరంభ దశలోనే ఉన్నారు కానీ మున్ముందు వారు మూలస్తంభాలుగా మారతారు. వారికి మా అనుభవాలను కూడా చెబుతాం. ఇద్దరూ నాణ్యమైన ఆటగాళ్లే. మరింత అనుభవంతో ఇంకా రాటుదేలతారు’ అని ధీమా వ్యక్తం చేశారు.

News October 1, 2024

గతంలో కంటే ఘనంగా తిరుమల బ్రహ్మోత్సవాలు: EO

image

AP: తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. గతంలో కంటే ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 4న శ్రీవారికి CM చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో VIP, సిఫార్సు దర్శనాలు రద్దు చేశామన్నారు. ఉత్సవాల సమయంలో రోజుకు 24 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని, గరుడ సేవ రోజు 3.50 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు.

News October 1, 2024

మోదీకి గిఫ్ట్‌గా 24 ఏళ్ల నాటి ఫొటో

image

PM మోదీకి భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ జమైకా PM ఆండ్రూ హోల్నెస్ ప్ర‌త్యేక జ్ఞాపిక‌ను బహూక‌రించారు. 2000 సంవ‌త్స‌రంలో మోదీ జమైకాలోని మాంటెగో బే పర్యటనలో అక్క‌డి ప్ర‌వాస భార‌తీయుల‌తో ముచ్చ‌టిస్తున్న‌ ఫొటోను అందించారు. ఈ ఫొటోను చూస్తూ మోదీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అలాగే ఆండ్రూకు భార‌త క్రికెటర్లు సంత‌కాలు చేసిన బ్యాట్‌ను మోదీ అందజేశారు. అండ్రూ కూడా క్రిస్‌ గేల్ సంత‌కం చేసిన బ్యాట్ బ‌హూక‌రించారు.

News October 1, 2024

నా మిత్రుడు రజినీకాంత్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

image

AP: తన మిత్రుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ఆయన వర్ధిల్లాలని కోరుకున్నారు. మరోవైపు మంత్రి లోకేశ్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా రజినీకాంత్ అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. హృదయ నాళాలకు సంబంధించి వైద్యులు చికిత్స చేశారు.

News October 1, 2024

సొత్తు తిరిగిస్తే దొంగ‌త‌నం క్ష‌మార్హ‌మా?: బీజేపీ

image

ముడా కేసులో భూముల‌ను తిరిగి అప్ప‌గించేస్తాన‌ని సీఎం సిద్ద రామ‌య్య స‌తీమ‌ణి చేసిన ప్రకటనపై బీజేపీ సెటైర్లు వేసింది. చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చేస్తే దొంగ అమాయకుడు అయిపోతాడా? అంటూ సీఎంను ప్రశ్నించింది. భూములను తిరిగిచ్చేయడం ద్వారా కొన్ని తప్పులు జరిగాయన్న విషయాన్ని సీఎం అంగీకరిస్తున్నారని ప్రతిపక్ష నేత ఆర్.అశోక దుయ్యబట్టారు. సొత్తు తిరిగిచ్చేస్తే చోరీ క్షమార్హం అవుతుందా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు.

News October 1, 2024

ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేయండి: మంత్రి అనగాని

image

AP: ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. CCLA ఆఫీసులో జిల్లా కలెక్టర్లతో మంత్రి ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ‘గ్రీవెన్స్ ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలి. ప్రజలను వారి సమస్యల పరిష్కారం కోసం 10 సార్లు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నెలాఖరులోగా పూర్తి చేయాలి’ అని ఆదేశించారు.