News July 1, 2024

కొత్త చట్టాలపై ఆ వార్తలు తప్పు: PIB

image

ఈరోజు అమలులోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల్లో పోలీస్ రిమాండ్‌ను 40-75రోజులకు పెంచారన్న ప్రచారంలో నిజం లేదని PIB స్పష్టం చేసింది. ‘పోలీసు రిమాండ్ ఇప్పటికీ 15 రోజులే ఉంది. గతంలో పోలీసులకు నిందితుడిని అరెస్ట్ చేసిన తొలి 15రోజుల్లోనే కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండేది. కొత్త చట్టాల ప్రకారం డిటెన్షన్ పీరియడ్ (60-90 రోజులు)లోని తొలి 40-60 రోజుల్లో ఎప్పుడైనా పోలీస్ కస్టడీ విధించొచ్చు’ అని పేర్కొంది.

News July 1, 2024

అమల్లోకి BNS.. తెలంగాణలో తొలి FIR నమోదు

image

ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(BNS) చట్టంలో భాగంగా తెలంగాణలో తొలి కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని చార్మినార్‌ పీఎస్ పరిధిలో నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న బైకర్‌పై సెక్షన్ 281 BNS, ఎంవీ యాక్ట్ కింద కేసు పెట్టారు. కొత్త చట్టం ప్రకారం డిజిటల్ FIR నమోదు చేసినట్లు DGP ఆఫీస్ ట్వీట్ చేసింది. కాగా IPC స్థానంలో కేంద్రం BNS తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

News July 1, 2024

తెలంగాణలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

image

* హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్
* కొత్తగూడెం OSDగా పరితోష్ పంకజ్
* భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్
* ములుగు OSDగా మహేశ్ బాబాసాహెబ్
* గవర్నర్ OSDగా సిరిశెట్టి సంకీర్త్
* భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్
* ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ
* వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి

News July 1, 2024

NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు: రాహుల్

image

పేద విద్యార్థులు NEETపై నమ్మకం కోల్పోయారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్ కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. నీట్ పేద విద్యార్థుల కోసం కాదు ఉన్నత వర్గాల కోసం అనే విధంగా మార్చారు. నీట్ పరీక్ష విధానంలో అనేక లోపాలు ఉన్నాయి’ అని ధ్వజమెత్తారు.

News July 1, 2024

వీరి మధ్య నిలబడటం గర్వంగా ఉంది: నాగ్

image

‘కల్కీ’ హిట్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘‘పదేళ్ల క్రితం స్వప్న దత్, ప్రియాంక దత్‌, నేను కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రారంభించాం. ఆ చిత్రం రిస్క్‌తో కూడుకుంది. అదనపు ఖర్చు ఆందోళనకు గురిచేసింది. కానీ పదేళ్ల తర్వాత చూస్తే మేము చేసిన ప్రతి సినిమా విజయం పొందడంతో పాటు మైలురాయిగా నిలిచాయి. వీరి మధ్య నిలబడటం గర్వంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నా’’ అని తెలిపారు.

News July 1, 2024

ఫస్ట్‌హాఫ్‌లో భారీగా వాటాల విక్రయం!

image

ఈ ఏడాది తొలి అర్ధభాగంలో సంస్థల ప్రమోటర్లు (వ్యవస్థాపకులు/యాజమాన్యం) భారీగా తమ షేర్లు విక్రయించినట్లు కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది. NSEలోని 37 కంపెనీల ప్రమోటర్లు ఆరు నెలల్లో $10.5 బిలియన్ల విలువైన షేర్లు అమ్మినట్లు తెలిపింది. వ్యాపార విస్తరణకు, రుణభారం తగ్గించుకునేందుకు వీరు తమ షేర్లు విక్రయిస్తున్నారు. కాగా 2023లో ప్రమోటర్లు $12.4 బిలియన్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.

News July 1, 2024

నోట్ల రద్దుతో తీవ్ర నష్టం: రాహుల్

image

నోట్ల రద్దుతో దేశం తీవ్రంగా నష్టపోయిందని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ప్రజలకు కలిగిన లాభం ఏంటి? జీఎస్టీ వల్ల ప్రజలు, వ్యాపారులు ఎన్నో బాధలు పడ్డారు. నోట్ల రద్దుతో యువత ఉపాధి కోల్పోయారు. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా మోదీ చెప్పారు. నోట్ల రద్దు చేయాలని కూడా దేవుడే చెప్పాడా? అదానీ లాంటి పెద్దల కోసమే మోదీ నిర్ణయాలు తీసుకుంటారు’ అని మండిపడ్డారు.

News July 1, 2024

ALERT: ఫోన్ పే, గూగుల్‌ పేలో కరెంట్ బిల్ కడుతున్నారా?

image

విద్యుత్ వినియోగదారులకు TGSPDCL కీలక సూచన చేసింది. RBI ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈక్రమంలో నేటి నుంచి TGSPDCL వెబ్‌సైట్/ మొబైల్ యాప్ ద్వారానే నెలవారీ కరెంట్ బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది.
>>SHARE IT<<

News July 1, 2024

అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ కెప్టెన్ శర్మనే!

image

టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. 2024 T20 WCలో ఆయన 257 పరుగులు చేసి ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాగా మహేంద్ర సింగ్ ధోనీ 2007లో 154 రన్స్‌ (ట్రోఫీ), 2009లో 86 రన్స్, 2010లో 85, 2012లో 65, 2014లో 50, 2016లో 89 రన్స్ చేశారు. 2021లో అప్పటి కెప్టెన్‌ కోహ్లీ 68 రన్స్ చేయగా 2022లో రోహిత్ 116 పరుగులు సాధించారు.

News July 1, 2024

వారంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం: మంత్రి కోమటిరెడ్డి

image

TG: కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వారం రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రూ.2లక్షలను ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.32వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. కాగా నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.