News July 1, 2024

అయోధ్యలో చిరు వ్యాపారులను రోడ్డుపైకి నెట్టారు: రాహుల్

image

అయోధ్య ప్రారంభానికి కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానం అందిందని విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మండిపడ్డారు. ‘అయోధ్యలో చిరు వ్యాపారుల దుకాణాలు, భవనాలు తొలగించి వారిని రోడ్డుపైకి నెట్టారు. భూములు లాక్కుని విమానాశ్రయం నిర్మించారు. మందిరం ప్రారంభ సమయంలో బాధితులు దు:ఖంలో ఉన్నారు. వారిని కనీసం ఆలయ పరిసరాల్లోకి కూడా రానివ్వలేదు’ అని తీవ్ర విమర్శలు చేశారు.

News July 1, 2024

RECORD: 10 వికెట్లు పడగొట్టిన స్నేహ్ రానా

image

ఎంఏ చిదంబరం స్టేడియంలో SAతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా ప్లేయర్ స్నేహ్ రానా సంచలనం సృష్టించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 8, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశారు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన తొలి భారత మహిళా స్పిన్నర్‌గా స్నేహ్ నిలిచారు. ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి తర్వాత 10 వికెట్లు తీసిన 2వ భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు.

News July 1, 2024

‘దండన’ కాదు ‘న్యాయం’ ముఖ్యం: అమిత్ షా

image

దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన 77ఏళ్ల తర్వాత ‘స్వదేశీ’ చట్టాలు అమలులోకి వచ్చాయన్నారు. తమకు ‘దండన’ కంటే ‘న్యాయం’ ముఖ్యమని అన్నారు. గతంలో పోలీసుల హక్కులకు మాత్రమే రక్షణ ఉండేదని, ఇప్పుడు బాధితులు, ఫిర్యాదుదారుల హక్కులకూ రక్షణ ఏర్పడిందని పేర్కొన్నారు.

News July 1, 2024

టారిఫ్ పెంచినా టార్గెట్ మారలేదు!

image

ఓవైపు రీఛార్జ్ ధరలు పెంచినా Vi యూజర్లను తమవైపు తిప్పుకోవాలనే లక్ష్యాన్ని జియో, ఎయిర్‌టెల్ సంస్థలు మార్చుకోలేదంటున్నారు విశ్లేషకులు. ‘టారిఫ్ పెంచిన తీరే ఇందుకు నిదర్శనం. 2జీ యూజర్లను ఆకర్షించేందుకు జియో 4జీ ఫీచర్ ఫోన్ టారిఫ్ (₹91/28 రోజులు) మార్చలేదు. ఎయిర్‌టెల్ 2జీ ప్లాన్స్‌లో పెంపును 11%కు (₹199/28 రోజులు) పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో సబ్‌స్క్రిప్షన్స్ పెరుగుతాయని ఇరు సంస్థలు ఆశిస్తున్నాయి.

News July 1, 2024

కల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లు

image

కల్కి 2898AD మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. 4 రోజుల్లో ₹555 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో ₹115 కోట్లు సాధించినట్లు చెప్పారు. US, కెనడాలో $11 మిలియన్లు(₹91.81 కోట్లు) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. UKలో ₹9.38 కోట్లు, ఆస్ట్రేలియాలో ₹9 కోట్లు, జర్మనీలో ₹1.30 కోట్లు, న్యూజిలాండ్‌లో ₹93 లక్షలు వసూలు చేసినట్లు తెలిపాయి.

News July 1, 2024

అశ్వనీదత్, స్వప్న దత్ ఓ బావి తవ్వాలి: RGV

image

హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ రిలీజైన 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘నాగ్ అశ్విన్‌పై ఎంతో విశ్వాసం ఉంచినందుకు అశ్వనీదత్, స్వప్నదత్‌లకు నా కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా వస్తోన్న డబ్బును నిల్వ చేయడానికి తండ్రీకూతుళ్లు ఓ లోతైన బావిని తవ్వాల్సి వస్తుంది’ అని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో RGV కూడా నటించారు.

News July 1, 2024

EPS విత్‌డ్రా రూల్స్ మారాయ్

image

EPS1995లో కేంద్రం మార్పులు చేసింది. ఉద్యోగంలో చేరిన 6నెలల్లోనే ఉద్యోగులు EPS నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు ‘టేబుల్ D’ని సవరించింది. ఈ మార్పులతో 23లక్షల మందికిపైగా ప్రయోజనం పొందనున్నారు. 10ఏళ్ల సర్వీస్ ప్రాతిపదికన లెక్కించే బెనిఫిట్స్‌ను ఇకపై పని చేసిన నెలల ఆధారంగా లెక్కిస్తారు. కానీ ఈ స్కీమ్‌లో 10ఏళ్లకు ముందే విత్‌డ్రా చేసుకుంటే బెనిఫిట్స్ అందవు.

News July 1, 2024

లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 400కుపైగా పాయింట్లు లాభపడి 79,450 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 24,136 వద్ద కొనసాగుతోంది. ఐటీ స్టాక్స్ లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది. నిఫ్టీలో విప్రో, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టీసీఎస్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి.

News July 1, 2024

భారత్ విజయంపై ఆస్ట్రేలియా మీడియా కడుపుమంట

image

T20 వరల్డ్ కప్‌ను భారత్ సొంతం చేసుకోవడంపై ఆస్ట్రేలియా మీడియా మినహా అన్ని దేశాలు రోహిత్ సేన ఘనతను కొనియాడాయి. ‘టీమ్ ఇండియాకు T20WCలో అన్నీ అనుకూలించాయి. దక్షిణాఫ్రికా కుప్పకూలడం, అంపైర్ల నిర్ణయాలతో ఎట్టకేలకు కప్పు గెలిచింది’ అన్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ రాసుకొచ్చింది. సూపర్-8లో ఆసీస్‌పై భారత్ గెలవడాన్ని జీర్ణించుకోలేక ఇలా అక్కసు వెళ్లగక్కిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News July 1, 2024

ఎలక్టోరల్ బాండ్లు రద్దు.. చిక్కుల్లో 1300 కంపెనీలు!

image

ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఒకప్పుడు వీటిని కొనుగోలు చేసిన 1300 కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. పలు కంపెనీలకు ఇప్పటికే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చినట్లు సమాచారం. రాజకీయ పార్టీలకు డొనేట్ చేసిన మొత్తానికి సంబంధించి సంస్థలను ప్రశ్నించాయట. కాగా దీనిపై పలు సంస్థలు ఆర్థిక శాఖను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన ఖర్చుపై మినహాయింపు ఇవ్వాలని కోరాయట.