News July 1, 2024

నేటి నుంచి కొత్త రూల్స్

image

SBI, ICICI క్రెడిట్ కార్డులకు చెందిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. SBI కార్డు ద్వారా జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్స్ రావు. క్రెడిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీలను ICICI రూ.100 నుంచి రూ.200కు పెంచింది. అయితే చెక్/క్యాష్ పికప్, ఛార్జ్ స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్, డూప్లికేట్ స్టేట్‌మెంట్ రిక్వెస్ట్‌కు ఛార్జీలను తొలగించింది.

News July 1, 2024

గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై రేవంత్ చర్చిస్తారని సమాచారం. మరోవైపు నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరాయి.

News July 1, 2024

ప్రత్యేక హోదాపై CBN ఎందుకు నోరు విప్పడం లేదు: షర్మిల

image

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సీఎం చంద్రబాబుని APCC చీఫ్ షర్మిల కోరారు. ‘బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీశ్ తీర్మానం చేసి మోదీ ముందట డిమాండ్ పెడితే ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదు. కేంద్రంలో కింగ్ మేకర్‌గా ఉన్నా హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గం’ అని ట్వీట్ చేశారు.

News July 1, 2024

అందుబాటులోకి ‘టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్’

image

ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంతువులను రక్షించి వాటికి పునరావాసం కల్పించేందుకు నిర్మించిన ‘టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్’ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటివరకూ ఇందులో ట్రయల్స్ మాత్రమే నిర్వహించగా ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో జంతువుల పరిరక్షణకు అందుబాటులోకి తెచ్చినట్లు రతన్ టాటా తెలిపారు. అపాయింట్‌మెంట్, అత్యవసర సహాయం కోసం <>వెబ్‌సైట్‌<<>> సంప్రదించాలని సూచించారు.

News July 1, 2024

ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు.
✒ ఈ నెల 4 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
✒ 8 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
✒ 13న ఆప్షన్ల మార్పునకు అవకాశం
✒ 16న సీట్ల కేటాయింపు
✒ 17 నుంచి 22 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్
✒ 19 నుంచి తరగతులు ప్రారంభం

News July 1, 2024

హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను CBI అరెస్టు చేయడం, రిమాండ్‌కు పంపడాన్ని సవాల్ చేస్తూ CM కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను CBI అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా తొలుత 3రోజుల రిమాండ్ విధించింది. విచారణకు మరో 14 రోజులు కావాలని CBI కోరడంతో జుడీషియల్ కస్టడీని జులై 12 వరకు కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

News July 1, 2024

ఆరోగ్య మౌళిక సదుపాయాలకు కట్టుబడి ఉన్నాం: మోదీ

image

ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఆరోగ్య మౌళిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. మన ఆరోగ్యాన్ని రక్షించే హీరోల అంకితభావాన్ని గౌరవించుకునేందుకు వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తామని ట్వీట్ చేశారు. సవాళ్లతో కూడిన సంక్లిష్టతలను తమ అసాధారణ నైపుణ్యంతో వారు పరిష్కరిస్తారని చెప్పారు. తమ ప్రభుత్వంలో వైద్యులు తగిన గౌరవం పొందేలా భరోసా ఇస్తామన్నారు.

News July 1, 2024

ఇవాళ భారతీయుడు-2 నుంచి లిరికల్ వీడియో

image

భారతీయుడు-2 సినిమా నుంచి ఇవాళ సా.6 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ స్పెషల్ సాంగ్‌లో మిస్ యూనివర్స్-2017 డెమి లీ నెల్ పీటర్స్ నర్తించినట్లు తెలిపారు. వేడిని పెంచే ఈ పాట కోసం సిద్ధంగా ఉండాలంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా శంకర్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

News July 1, 2024

ఆ చిరునవ్వు నా జీవితాంతం గుర్తుంటుంది: లోకేశ్

image

AP: ఈ రోజు పెన్షన్లు అందుకున్న అవ్వాతాతల చిరునవ్వు తన జీవితాంతం గుర్తుంటుందని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి మధ్య తేడా ఈరోజు ప్రజలకు అర్థమైందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు పెద్ద కొడుకుగా పెన్షన్ రూ.4వేలు చేశారని గుర్తు చేశారు. అరియర్స్‌తో కలిపి రూ.7 వేల పెన్షన్ ఇంటి వద్దనే అందజేశారని ట్వీట్ చేశారు.

News July 1, 2024

T20WC: ICC టీమ్‌లో ఆరుగురు ఇండియన్స్

image

T20WCలో రాణించిన ఆటగాళ్లతో ICC టీమ్‌ను ప్రకటించింది. జట్టులో రోహిత్‌శర్మ(257రన్స్, IND), గుర్బాజ్(281, AFG), పూరన్(228, WI), సూర్య(199, IND), స్టోయినిస్(169 రన్స్, 10వికెట్లు AUS), పాండ్య(144రన్స్, 11వికెట్లు IND), అక్షర్(92 రన్స్, 9వికెట్లు IND), రషీద్‌ఖాన్(14వికెట్లు, AFG), బుమ్రా(15వికెట్లు, IND), అర్ష్‌దీప్(17వికెట్లు, IND), ఫరూకీ(17వికెట్లు, AFG) ఉన్నారు. 12వ ఆటగాడు: నోకియా(15 వికెట్లు, SA).