News July 1, 2024

వైద్యుల రక్షణ గురించి కేబినెట్‌లో చర్చిస్తా: పవన్ కళ్యాణ్

image

AP: నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్‌కు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మానవాళిపై కరోనా విరుచుకుపడినప్పుడు డాక్టర్లు అందించిన సేవలు విస్మరించలేం. కరోనాతో దేశంలో 1600 మంది వైద్యులు చనిపోయారు. దురదృష్టవశాత్తూ ఇటీవల వైద్యులు, ఆస్పత్రులపైనా దాడులు జరుగుతున్నాయి. వైద్యులకు రక్షణ కల్పించే అంశాన్ని కేబినెట్ ముందుకు తీసుకెళ్తా’ అని పవన్ హామీ ఇచ్చారు.

News July 1, 2024

లోక్‌సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్

image

లోక్‌సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై చర్చకు పట్టుపట్టగా, స్పీకర్ అంగీకరించకపోవడంతో సభ నుంచి బయటకు వచ్చారు. అంతకుముందు టీ20 వరల్డ్‌కప్ సాధించిన భారత జట్టుకు లోక్‌సభ అభినందనలు తెలిపింది.

News July 1, 2024

మేడిన్ ఇండియా.. టీఎన్‌టీ కంటే రెండు రెట్లు పవర్‌ఫుల్

image

ట్రైనైట్రోటాల్యునీ (TNT) కంటే రెండు రెట్లు శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని ఎకనామిక్ ఎక్స్‌ప్లోసివ్స్ అనే భారతీయ సంస్థ రూపొందించింది. సెబెక్స్2గా పిలిచే ఈ పేలుడు పదార్థాన్ని నేవీ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ స్కీమ్‌లో భాగంగా దీనిని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సెబెక్స్2తో బాంబులు, ఆర్టిలరీ షెల్స్, వార్ హెడ్స్ వంటి ఆయుధాల సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.

News July 1, 2024

DOCTORS DAY: వైద్యో నారాయణో హరి!

image

వైద్యులు దేవుళ్లతో సమానమని చెబుతుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ఎంతటి వ్యాధినైనా నయం చేస్తోన్న వైద్యుల దినోత్సవం నేడు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోట్లాది మందిని కాపాడారు. వారి సేవలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటికే ప్రాథమిక వైద్య సదుపాయాన్ని అందిస్తోన్న వైద్యులకు సెల్యూట్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.

News July 1, 2024

నేషనల్ డాక్టర్స్ డే.. ఈరోజే ఎందుకంటే?

image

పశ్చిమ బెంగాల్‌ రెండో సీఎం బిధాన్ చంద్ర రాయ్ ఒక ప్రముఖ వైద్యుడు. డాక్టర్‌గా, సీఎంగా వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా బిధాన్ పుట్టిన రోజైన జులై 1ని భారత ప్రభుత్వం జాతీయ వైద్యుల దినోత్సవంగా 1991లో ప్రకటించింది. అప్పటి నుంచి మన దేశంలో ప్రతి ఏడాది జులై 1న నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ, అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటుంటారు.

News July 1, 2024

మరో 24 గంటలు బార్బడోస్‌లోనే భారత జట్టు!

image

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్‌ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు. వర్షం మొదలైందని, ఎయిర్ పోర్టు మూసివేయడంతో భారత జట్టు ఆటగాళ్లు హోటల్స్‌కే పరిమితమయ్యారని పేర్కొన్నారు. దీంతో మరో 24 గంటల వరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది.

News July 1, 2024

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 0-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకరు, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ముగ్గురు, 61కి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు గతంలో మాదిరిగానే టీచర్లను కేటాయించనుంది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కేటాయింపు చేపట్టనుంది.

News July 1, 2024

BREAKING: హైకోర్టులో కేసీఆర్‌కు చుక్కెదురు

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్‌‌ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

News July 1, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో చరిత్ర సృష్టించిన కోహ్లీ

image

టీ20 వరల్డ్ కప్‌ను టీమ్ఇండియా గెలుపొందడంపై విరాట్ కోహ్లీ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌ రికార్డు సృష్టించింది. కప్‌తో, టీమ్‌తో ఉన్న ఫొటోలతో ‘ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 18 మిలియన్ల లైక్స్‌తో పాటు 6.6 లక్షల కామెంట్స్ వచ్చాయి. గతంలో కియారా, సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేసింది. WC ఫైనల్‌లో కోహ్లీ 76 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

News July 1, 2024

పాకిస్థాన్‌ను గడగడలాడించిన అబ్దుల్ హమీద్‌కు షా నివాళులు

image

‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీత వీర్ అబ్దుల్ హమీద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా 1965 భారత్ -పాక్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఘటనను హోం మంత్రి గుర్తుచేసుకున్నారు. ఈ యుద్ధంలో శత్రువులకు చెందిన 7 యుద్ధ ట్యాంకులను హమీద్ ఒంటిచేత్తో ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆయన ధైర్యసాహసాలు దేశప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని ట్వీట్ చేశారు.