News July 1, 2024

ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు అసాధ్యం: CBSE

image

ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి 2సార్లు బోర్డు ఎగ్జామ్స్ అసాధ్యమని CBSE తెలిపింది. ఏడాదికి 2సార్లు పరీక్షలు పెట్టి, ఉత్తమ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా విద్యాశాఖ AUGలో సిఫార్సు చేసింది. ఈ మేరకు CBSE ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. దీంతో పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో చర్చించిన CBSE ప్రస్తుతం ఈ విధానం అసాధ్యమని తెలిపింది.

News July 1, 2024

హోంమంత్రి ఇలాకాలో కీచకపర్వం: YCP

image

AP: హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో కీచకపర్వం అంటూ ఇద్దరు మహిళలపై కొందరు దాడికి పాల్పడిన వీడియోను YCP పోస్ట్ చేసింది. నడిరోడ్డుపై మహిళల దుస్తులు చించి, వారిపై అమానుషంగా దాడి చేసినట్లు పేర్కొంది. ఇదేనా ఆడబిడ్డలకి మీరు కల్పిస్తానన్న రక్షణ అంటూ హోంమంత్రిని YCP ప్రశ్నించింది.

News July 1, 2024

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులు పెంపు

image

రాష్ట్రాలు, UTలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్(WMA) పరిమితులను RBI పెంచింది. గతంలో వాటి లిమిట్ ₹47,010 కోట్లు ఉండగా, ఇవాళ్టి నుంచి ఆ మొత్తాన్ని ₹60,118 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ ప్రభుత్వ పరిమితి ₹2,252 కోట్ల నుంచి ₹2,921 కోట్లకు పెరిగింది. అత్యవసర ఖర్చులకు నిధుల లభ్యత లేనప్పుడు తాత్కాలిక రుణ సౌకర్యం కల్పించడాన్ని WMA అంటారు. 3 నెలలలోపు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

News July 1, 2024

మిషన్ పూర్తైంది: బీసీసీఐ

image

వరల్డ్ కప్ సాధించాలనే మిషన్ పూర్తయినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘బిలియన్ల మంది అభిమానుల భావోద్వేగాలు, చిరునవ్వులు, కలలతో కూడుకున్న T20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నాం. ప్రపంచ విజేతలుగా నిలిచాం. కెప్టెన్.. మీరు సాధించారు’ అంటూ టీ20 WC ట్రోఫీతో రోహిత్ దిగిన ఫొటోలను పంచుకుంది.

News July 1, 2024

అమల్లోకి కొత్త చట్టాలు.. తొలి FIR నమోదు

image

నేడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రాగా భారతీయ న్యాయ సంహిత, 2023 కింద మొదటి FIR నమోదైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆక్రమించి విక్రయాలు జరిపిన చిరు వ్యాపారిపై కమ్లా మార్కెట్ పోలీసులు FIR ఫైల్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని u/s 285 ప్రకారం ఆ వ్యాపారిపై కేసు నమోదు చేశారు.

News July 1, 2024

ఆసుపత్రిలో చేరిన శతృఘ్న సిన్హా

image

బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా వైరల్ ఫీవర్‌తో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఇవాళ డిశ్చార్జ్ అవుతారని సమాచారం. పని ఒత్తిడితో ఆయన అనారోగ్యానికి గురవ్వగా కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవలె శత్రుఘ్న కూతురు సోనాక్షి ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కార్యక్రమాలతో జూన్ నెలంతా ఆయన బిజీబిజీగా గడిపారు.

News July 1, 2024

రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

image

T20Iలకు రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో మిగిలిన ఫార్మాట్లలోనూ వారు ఎక్కువ రోజులు కొనసాగరేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో BCCI సెక్రటరీ జైషా ఓ గుడ్‌‌న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సీనియర్ ఆటగాళ్లు జట్టులోనే ఉంటారని రోహిత్, కోహ్లీ ప్రాతినిధ్యం గురించి హింట్ ఇచ్చారు. ఈ రెండు టైటిల్స్ కూడా గెలవాలని జైషా ఆకాంక్షించారు.

News July 1, 2024

మద్యం నిల్వ కేసులో మురుగుడు లావణ్య తండ్రి అరెస్ట్

image

AP: అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో మంగళగిరి YCP అభ్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య తండ్రి కాండ్రు శివనాగేంద్రం అరెస్టయ్యారు. ఓ ఇంట్లో నిల్వ చేసిన 6,528 మద్యం సీసాలను ఇటీవల సెబ్ అధికారులను సీజ్ చేశారు. ఈ కేసులో శివనాగేంద్రంను అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించింది. కాగా లావణ్యపై మంత్రి నారా లోకేశ్ 90వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.

News July 1, 2024

రేపు తాడేపల్లికి వైఎస్ జగన్?

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బెంగళూరు నుంచి తాడేపల్లిలోని నివాసానికి రానున్నట్లు సమాచారం. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. గత నెల 22న పులివెందులకు వెళ్లిన జగన్ 3 రోజులు ప్రజాదర్బార్ నిర్వహించారు. 24న సతీసమేతంగా బెంగళూరుకు వెళ్లిన విషయం తెలిసిందే.

News July 1, 2024

నీట్​ యూజీ రీటెస్ట్​ ఫలితాలు విడుదల

image

నీట్ యూజీ పరీక్షలో అవకతవకల నేపథ్యంలో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు నిర్వహించిన రీటెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. exams.nta.ac.in/NEET/ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. జూన్ 23న జరిగిన ఈ ఎగ్జామ్‌కు 813 మంది మాత్రమే హాజరైన విషయం తెలిసిందే.