News July 1, 2024

BIG BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

image

చమురు సంస్థలు వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.31 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1646కు చేరింది. ఇదే సమయంలో 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.

News July 1, 2024

ప్రధాని మోదీకి రోహిత్ శర్మ ధన్యవాదాలు

image

T20WC గెలిచిన టీమ్ ఇండియాకు, తనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు <<13536828>>తెలిపిన<<>> ప్రధాని మోదీకి కెప్టెన్ రోహిత్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రపంచకప్‌ను మన దేశానికి తెస్తున్నందుకు టీమ్ సభ్యులు, నేను చాలా గర్వపడుతున్నాం. ప్రతి ఇంటికీ సంతోషాన్ని తీసుకువచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News July 1, 2024

గ్యాంగ్ రేప్‌ చేస్తే మరణశిక్ష?

image

కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు నేటి నుంచి అమలు కానున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కొన్ని కేసుల్లో శిక్షలు కఠినం అవుతాయి. చిన్నారులపై సామూహిక అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి.

News July 1, 2024

రాష్ట్రపతి ప్రసంగంపై నేడు ధన్యవాద తీర్మానం

image

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చకు లోక్‌సభ‌లో కేంద్రం 16 గంటల సమయాన్ని కేటాయించింది. మరోవైపు ఇదే సమయంలో నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.

News July 1, 2024

రూ.500 కోట్లు దాటేసిన ‘కల్కి’

image

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి’ మూవీ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినట్లు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. శనివారం వరకు ఈ చిత్రం రూ.415 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అమితాబ్, కమల్, దీపిక వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు.

News July 1, 2024

NEET UG: ప్రైవేటు స్కూల్ ఓనర్ అరెస్ట్

image

NEET UG క్వశ్చన్ పేపర్ లీక్ <<13461942>>కేసు<<>>లో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని గోధ్రాలో ఉన్న జయ్ జలరామ్ స్కూల్ ఓనర్ దీక్షిత్ పటేల్ ఒక్కో విద్యార్థి నుంచి రూ.10లక్షలు డిమాండ్ చేసి 27 మందికి పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ స్కూల్లోనూ NEET UG పరీక్ష జరిగింది. కాగా ఈ కేసులో గుజరాత్ పోలీసులు చేసిన ఆరో అరెస్ట్ ఇది.

News July 1, 2024

ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని ఓడిన ఎంపీలకు కేంద్రం ఆదేశం

image

సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలు ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఈ నెల 11లోపు ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ నోటీసులిచ్చింది. విజయం సాధించిన సిట్టింగ్ ఎంపీలు గతంలో కేటాయించిన నివాసాల్లో అలాగే కొనసాగుతారు. బంగ్లాలను ఖాళీ చేయాల్సిన వారిలో స్మృతీ ఇరానీ, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్, మురళీధరన్, భారతీ పవార్ తదితర ప్రముఖులు కూడా ఉన్నారు.

News July 1, 2024

పార్టీ మార్పు వార్తలు అవాస్తవం: సబితా ఇంద్రారెడ్డి

image

TG: తాను పార్టీ మారుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు KCR సముచిత స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్‌లోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు.

News July 1, 2024

విదేశీ మ్యూజిక్ విన్నాడని పబ్లిక్‌లో ఉరి?

image

దేశంలో నిషేధిత సౌత్ కొరియన్ సాంగ్స్ విన్నాడని 22ఏళ్ల యువకుడిని నార్త్ కొరియా ప్రభుత్వం పబ్లిక్‌లో ఊరి తీసిందట. దేశం విడిచి వెళ్లిన 649మంది సాక్ష్యాలతో నా.కొరియా మానవ హక్కుల సంఘం ఓ నివేదిక విడుదల చేసింది. 60 సౌత్ కొరియన్ సాంగ్స్ వినటంతో పాటు 3సినిమాలు చూశాడని హ్వాంగ్హే ప్రావిన్స్‌లోని వ్యక్తిని 2022లో పబ్లిక్‌గా ఉరి తీసినట్లు నివేదిక వెల్లడించింది. ఉరి వార్తలను నా.కొరియా కొట్టిపారేసింది.

News July 1, 2024

ఇది ప్రజా ప్రభుత్వం.. కష్టపడి పనిచేస్తాం: చంద్రబాబు

image

AP: CMగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మూడో సంతకం పెట్టినట్లు చంద్రబాబు పెనుమాక సభలో వెల్లడించారు. ‘వీటిల్లో రూ.5కే భోజనం చేయవచ్చు. త్వరలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన కోసం శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది. నిరంతరం కష్టపడి పనిచేస్తాం. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించాలి’ అని కోరారు.