News July 1, 2024

25 వేల పోస్టులైనా ఇస్తారనుకున్నాం: బొత్స

image

AP: మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు. పార్టీ ఆఫీసులను కూల్చేయడం, బెదిరించడం తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. యూనివర్సిటీ వీసీలను రాజీనామాలు చేయాలని బెదిరించడం సమంజసం కాదన్నారు. మెగా డీఎస్సీలో 25 వేల పోస్టులు అయినా ఇస్తారనుకున్నామని.. 16వేల పోస్టులకే ఎందుకు పరిమితమయ్యారో తెలియడం లేదని ఆక్షేపించారు.

News July 1, 2024

పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం

image

AP: NTR భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఉదయం 6గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందించనున్నారు. పెరిగిన పింఛను, బకాయిలు కలిపి రూ.7వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, తీవ్ర వ్యాధులు కలిగిన వారికి రూ.15వేలను కూటమి ప్రభుత్వం అందించనుంది. మొత్తం 65.31 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కాగా పెనుమాకలో CM చంద్రబాబు, గొల్లపల్లిలో పవన్ కళ్యాణ్ స్వయంగా పింఛన్లు అందిస్తారు.

News July 1, 2024

మణిపుర్ సమస్యను కేంద్రం పట్టించుకోవడం లేదు: జైరాం

image

మణిపూర్ ప్రజలు సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ‘అనేక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రధాని మోదీకి.. మణిపుర్‌ను సందర్శించేందుకు సమయం దొరకడం లేదు. కనీసం అక్కడి ప్రజాప్రతిధులతోనూ చర్చించేందుకు సిద్ధంగా లేరు’ అని ఫైర్ అయ్యారు. గతేడాది మే నెలలో ఆ రాష్ట్రంలో కుకీ, మైతేయి తెగల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 225 మంది చనిపోయారు.

News July 1, 2024

బైడెన్ స్థానంలో యువ అభ్యర్థి: నిక్కీ హేలీ

image

US అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్‌ను డెమొక్రాటిక్ పార్టీ తప్పించనుందనే వార్తలొస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ స్థానంలో ఓ యువ అభ్యర్థిని తెచ్చే యోచనలో డెమొక్రాటిక్ పార్టీ ఉందన్నారు. అందుకు రిపబ్లికన్లు సిద్ధంగా ఉండాలన్నారు. కాగా బైడెన్ ఆరోగ్యంపై అనుమానాలు, సభల్లో తడబాటుకి గురికావడంతో ఆయనపై సొంత పార్టీలో వ్యతిరేకత వస్తోంది.

News July 1, 2024

మహిళల కోసం సుభద్ర యోజన పథకం: ఒడిశా సీఎం

image

PM మోదీ(SEP 17) పుట్టిన రోజున ఒడిశాలో సుభద్ర యోజన పథకాన్ని ప్రారంభిస్తామని CM మోహన్ చరణ్ తెలిపారు. మహిళలకు రూ.50 వేల చొప్పున గిఫ్ట్ ఓచర్ల పంపిణీకి ఈ పథకం తీసుకురానున్నట్లు ఓ కార్యక్రమంలో చెప్పారు. త్వరలోనే పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరుస్తామని చెప్పారు. స్వామివారి విలువైన వస్తువుల జాబితా తయారు చేసి.. ఏమైనా అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News July 1, 2024

జులై 1: చరిత్రలో ఈరోజు

image

1912: ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి జననం
1949: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జననం
1950: తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఎ.కోదండరామిరెడ్డి జననం
1966: ప్రసిద్ధ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ మరణం
1992: దర్శకుడు తాతినేని ప్రకాశరావు మరణం
జాతీయ వైద్యుల దినోత్సవం
అంతర్జాతీయ జోక్ డే

News July 1, 2024

ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం భారత్‌లో ఏర్పాటు: కేంద్రమంత్రి

image

ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంను వచ్చే ఏడాది భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఇది ఫ్రాన్స్‌లోని లౌవ్రె మ్యూజియం కన్నా రెండింతలు పెద్దగా ఉంటుందని చెప్పారు. ఇదే విషయమై ఫ్రాన్స్‌తో ఒప్పందం జరిగిందని జోధ్‌పుర్‌లో మీడియాతో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్టులో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

News July 1, 2024

తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడాలి: పొన్నం

image

విభజన హామీల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు కలిసి పని చేయాల్సి అవసరం ఉందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకి ఆలయానికి విచ్చేయగా TG ప్రభుత్వం తరఫున ఆహ్వానం పలికామని చెప్పారు. తిరుమలలో TG భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, గతంలో మాదిరిగా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించాలని కోరారు.

News July 1, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 01, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:24 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:46 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 1, 2024

T20 WC ఫైనల్.. హాట్‌స్టార్ వ్యూయర్‌షిప్ ఎంతంటే?

image

భారత్, SA మధ్య జరిగిన టీ20 ఫైనల్ మ్యాచ్‌‌ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో 5.3 కోట్ల మంది వీక్షించినట్లు ఆ సంస్థ పేర్కొంది. కాగా గతేడాది IND, AUS మధ్య జరిగిన వన్డే WC ఫైనల్‌ను రికార్డు స్థాయిలో 5.9 కోట్ల మంది వీక్షించారు. మరోవైపు ఈ T20 ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. టీవీల్లో ఎంతమంది వీక్షించారనే గణాంకాలను BARC వారం రోజుల తర్వాత వెల్లడిస్తుంది.