News July 1, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 01, సోమవారం
జ్యేష్ఠము
బ.దశమి: ఉదయం 10:26 గంటలకు
అశ్విని: ఉదయం 06:26 గంటలకు దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:37- 01:29, గంటల వరకు
మధ్యాహ్నం 3:12- 04:04 గంటల వరకు
వర్జ్యం: అర్ధరాత్రి 02:37 – 04:09 గంటల వరకు
మధ్యాహ్నం: 03:38- 05:10 గంటల వరకు

News July 1, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, జడేజా
* అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి: ప్రధాని మోదీ
* రేపు ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల
* రైతులకు అన్యాయం జరిగితే సహించం: పెమ్మసాని
* మోదీజీ.. కుదిరితే కప్పు కాఫీ: CBN
* TG: సీనియర్ నేత డీఎస్ అంత్యక్రియలు పూర్తి
* టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ

News June 30, 2024

అరకు కాఫీపై మోదీ, చంద్రబాబు ముచ్చట్లు.. మధ్యలో జైరాం రమేశ్

image

అరకు కాఫీపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు Xలో ముచ్చట్లు <<13539131>>చెప్పుకోగా<<>>, ఈ అంశంలో INC నేత జైరాం రమేశ్ ఎంట్రీ ఇచ్చారు. ‘అరకు కాఫీ బ్రాండ్‌ను తానే కనిపెట్టినట్లుగా మోదీ ఎప్పటిలాగే అతిశయోక్తితో మాట్లాడారు. నిజానికి అరకులో కాఫీ సాగుకు నాంది వేసింది UPA ప్రభుత్వం. వాణిజ్య మంత్రిగా 2007 DEC 21న నేనే ప్రారంభించా. ఐదేళ్ల తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను అక్కడ మళ్లీ పర్యటించా’ అని గుర్తు చేసుకున్నారు.

News June 30, 2024

పడి లేచిన కెరటం హార్దిక్ ❤️ ట్రూ వారియర్!

image

నవ్విన నాప చేనే పండిందనే సామెతకు హార్దిక్ కచ్చితంగా సరిపోతారు. IPLలో GT నుంచి MIకి మారడం, రోహిత్‌ను కాదని అతనికి సారథ్యం ఇవ్వడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా విఫలమవడంతో గేలి చేశారు. భార్యతో విడిపోయారనే వదంతులూ పాండ్యను కుంగదీశాయి. క్రికెట్ చరిత్రలో ఎవరూ ఎదుర్కోని అవమానాలు పడ్డారు. పడిలేచిన కెరటంలా T20WCలో సత్తాచాటి వారియర్‌గా నిలిచారు. దేశ ప్రజల మనసు గెలుచుకున్నారు.

News June 30, 2024

T20Iలకు జడ్డూ గుడ్ బై.. ప్రధాని ట్వీట్

image

ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా భారత జట్టుకు అద్భుతమైన ప్రదర్శన చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. టీ20Iల్లో ఏళ్లుగా అద్భుత ప్రదర్శన చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్పిన్ బౌలింగ్, స్టైలిష్ స్ట్రోక్ ప్లే, ఫీల్డింగ్‌తో క్రికెట్ ప్రేక్షకుల మన్ననలు పొందారని ట్వీట్ చేశారు. భవిష్యత్తు కార్యాచరణకు బెస్ట్ విషెస్ తెలిపారు. తాజాగా జడేజా టీ20Iలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

News June 30, 2024

వసీం అక్రమ్ కంటే బుమ్రా వెరీ స్పెషల్: మైఖేల్ వాన్

image

నిత్యం టీమ్ ఇండియాపై విమర్శలు చేసే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. తొలిసారి బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న భారత్ T20WCను గెలిచిన తర్వాత మాట్లాడుతూ.. ‘పాక్ దిగ్గజం వసీం అక్రమ్ ప్రత్యేకమైన బౌలరే. కానీ అతడి కంటే బుమ్రా వెరీ స్పెషల్. ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. తెలివిగా బౌలింగ్ చేస్తున్నారు. అతడి స్లో డెలివరీ బాల్ నిజంగా సూపర్’ అని పేర్కొన్నారు.

News June 30, 2024

రాహుల్ జీ.. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎక్కడ?: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ ఏమైందని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మీరు యువతను వ్యక్తిగతంగా కలిసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వార్తాపత్రికల్లో యాడ్‌లు ఇచ్చారు. 7 నెలలు దాటినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఎలా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారు? ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోనందున మీరైనా స్పందించండి’ అని Xలో డిమాండ్ చేశారు.

News June 30, 2024

బార్బడోస్‌లోనే నిలిచిపోయిన భారత జట్టు!

image

బార్బడోస్‌కు బెరిల్ హరికేన్(తుఫాన్) ముప్పు పొంచి ఉంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం కల్లా తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హరికేన్ ప్రభావంతో విమానాలను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో టీ20WC విజేతగా నిలిచిన భారత జట్టు అక్కడే నిలిచిపోయిందని జాతీయ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. తిరిగి విమాన సేవలు ప్రారంభమయ్యే వరకు ఆటగాళ్లు అక్కడే ఉండిపోతారన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 30, 2024

రేపటి నుంచి ‘స్టాప్ డయేరియా’ డ్రైవ్

image

AP: కేంద్రం ఆదేశాలతో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమాన్ని వైద్యశాఖ చేపట్టనుంది. చిన్నారుల్లో డయేరియా మరణాల నిర్మూలనే లక్ష్యంగా రెండు నెలల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఐదేళ్లలోపు చిన్నారుల వివరాల సేకరణ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్ల పంపిణీతో పాటు పారిశుద్ధ్య డ్రైవ్‌లు చేపట్టనున్నారు. స్కూళ్లు, అంగన్‌వాడీల్లో పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు.

News June 30, 2024

జగన్‌ను నేనెప్పుడూ కలవలేదు.. ఆ ఫొటో ఫేక్: డీకే శివకుమార్

image

ఏపీ మాజీ CM జగన్‌ను తాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ Xలో ఖండించారు. ‘జగన్‌తో భేటీ అయినట్లు కొందరు నీచులు ఫేక్ ఫొటోలు సృష్టించారు. ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దు. నేనెప్పుడూ జగన్‌ను కలవలేదు’ అని పోస్టు చేశారు. కాగా కాంగ్రెస్‌లో YCPని విలీనం చేసేందుకు DK ద్వారా జగన్ రాయబారం చేసినట్లుగా ఓ పేపర్ క్లిప్‌ను TDP-JSP శ్రేణులు వైరల్ చేసిన విషయం తెలిసిందే.