News June 30, 2024

బ్రిటన్‌లో ‘హిందూ’ రాజకీయం

image

బ్రిటన్‌లో జులై 4న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు అక్కడ ఉన్న 10 లక్షల మంది హిందూ ఓటర్లపై దృష్టిసారించాయి. లండన్‌లోని శ్రీస్వామినారాయణ్ ఆలయాన్ని PM, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ సందర్శించారు. హిందువులు గర్వించే విధానాలను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ కూడా కింగ్స్‌బరీలోని స్వామినారాయణ్ టెంపుల్‌కు వెళ్లారు. హిందువులపై దాడులను అడ్డుకుంటామన్నారు.

News June 30, 2024

ఒక్క మ్యాచ్ ఓడకుండా ప్రపంచకప్.. తొలి టీమ్‌గా భారత్ రికార్డు

image

T20WC టోర్నీ మొత్తం ఒక్క మ్యాచ్ ఓడకుండా ప్రపంచకప్ సాధించిన తొలి టీమ్‌గా భారత్ చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాక్, USA, సూపర్-8లో అఫ్గాన్, బంగ్లా, ఆసీస్, సెమీస్‌లో ఇంగ్లండ్‌, ఫైనల్‌లో సౌతాఫ్రికాను IND ఓడించింది. T20WC ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసి రెండు సార్లు(2007, 2024) కప్ సాధించిన ఏకైక జట్టుగానూ భారత్ నిలిచింది. మిగతా 6 సందర్భాల్లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే విజేతలు.

News June 30, 2024

మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్

image

మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్ IAS సుజాతా సౌనిక్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర 64 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఈమె హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో CSగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

News June 30, 2024

T20WC విజయం తర్వాత రోహిత్ తొలి పోస్ట్

image

T20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం తర్వాత రోహిత్ శర్మ సోషల్ మీడియాలో తొలి పోస్ట్ చేశారు. తాను పడుకున్న బెడ్ పక్కనే ట్రోఫీ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ గుడ్ మార్నింగ్ చెప్పారు. ప్రస్తుతం భారత జట్టు బార్బడోస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ భారత్‌కు రెండో టీ20WCను అందించారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో T20Iలకు వీడ్కోలు పలికారు.

News June 30, 2024

రోజూ మల్టీవిటమన్లతో మరణ ముప్పు పెరుగుతుంది

image

రోజూ మల్టీవిటమిన్‌ సప్లిమెంట్లు తీసుకోవడంతో మనుషుల ఆయుష్షు పెరగదని US నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధనలో తేలింది. 1990-2010 మధ్య దాదాపు 4లక్షల మందిపై సైంటిస్టులు అధ్యయనం చేశారు. మల్టీవిటమిన్లతో ఆరోగ్యానికి ప్రమాదమని, త్వరగా మరణించే ముప్పు 4% పెరిగిందని గుర్తించారు. సప్లిమెంట్ల కంటే కూరగాయలు, తృణధాన్యాలు లాంటి ఆహారం తీసుకోవడం మంచిదని, మద్యం, మాంసం తగ్గించాలని సూచించారు.

News June 30, 2024

APలో పెరిగిన పెన్షన్లు.. ఎవరికి ఎంతంటే?

image

☞ వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.4వేలు
☞ దివ్యాంగులు, కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి రూ.6వేలకు పెంపు
☞ తీవ్ర అనారోగ్యం(కిడ్నీ, లివర్, గుండె మార్పిడి)తో బాధపడేవారికి రూ.10వేలు
☞ పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15వేలు
☞ ☞ పెంచిన పెన్షన్‌లో గత మూడు నెలల బకాయిలతో కలిపి రేపు <<13437252>>పెన్షన్<<>> అందిస్తారు.

News June 30, 2024

రేపు పెనుమాకలో చంద్రబాబు పర్యటన

image

AP: గుంటూరు జిల్లా పెనుమాకలో CM చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. ఉ.5.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి 6 గంటలకు పెనుమాక చేరుకుంటారు. NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ST కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం పెనుమాక మసీదు సెంటర్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటించనున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

News June 30, 2024

భారత జట్టుకు భారీ నజరానా

image

టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని ట్వీట్ చేశారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

News June 30, 2024

BREAKING: రేపు టెట్ నోటిఫికేషన్

image

AP: జులై 1న టెట్ <<13539471>>నోటిఫికేషన్<<>> విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ వెల్లడించారు. జులై 2 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తితో మరోసారి టెట్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. https://cse.ap.gov.in/ వెబ్‌సైటులో టెట్ పరీక్ష వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు.

News June 30, 2024

టీ20 ఫైనల్స్‌లో ఒక్కసారీ ఓడని కెప్టెన్ రోహిత్!

image

రోహిత్ శర్మ టీ20 కెప్టెన్‌గా ఫైనల్‌కు చేరిన ప్రతీసారి విజయం సాధించారు. భారత కెప్టెన్‌గా 2024 WCతో పాటు 2018 నిదహాస్ ట్రోఫీ గెలిచిన ఆయన, IPLలో ముంబై ఇండియన్స్ సారథిగా (2013, 2015, 2017, 2019, 2020) 5 సార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపారు. 2013 CLT20 ఫైనల్‌లోనూ గెలుపొందారు. దీంతో టీ20ల్లో ఆయనొక లెజెండరీ కెప్టెన్ అని క్రికెట్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.