News April 23, 2025

కాసేపట్లో కేంద్ర హోంశాఖ ప్రెస్ మీట్

image

పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర క్యాబినేట్ భేటీ ముగిసింది. PM మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. దాదాపు 2గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాదుల ఏరివేత, తదితరాలపై చర్చించారు. మరోవైపు, కేంద్ర హోంశాఖ కాసేపట్లో ఈ భేటీపై ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఉగ్రవాదుల సమాచారం తెలిపిన వారికి రూ.20లక్షల నజరానా అందిస్తామని అనంతనాగ్ పోలీసులు తెలిపారు.

News April 23, 2025

RED ALERT: మూడు రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులపాటు తీవ్ర వడగాలులతోపాటు ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

News April 23, 2025

పహల్‌గామ్ దాడి.. కావలి వ్యక్తి బాడీలో 42 బుల్లెట్లు!

image

పహల్‌గామ్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. AK-47తో ఆయనను వెంటాడి వేటాడి చంపినట్లు సమాచారం. కాగా మధు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. హాలిడే ట్రిప్ కోసం తన ఫ్యామిలీతో కలిసి ఆయన కశ్మీర్ పర్యటనకు వెళ్లి ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

News April 23, 2025

ఆ సమయంలో ఫోన్ వాడకండి!

image

వేసవి కావడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు పేలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం వాడే సెల్‌ఫోన్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడికి ఫోన్లు ఓవర్ హీట్ అవుతాయి. ఆ సమయంలో మొబైల్‌కు అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. అప్పుడు ఫోన్ వాడకూడదు. చల్లగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి, బ్యాటరీ కూల్ అయ్యాకే వినియోగించాలి.

News April 23, 2025

SRH 4 వికెట్లు డౌన్

image

MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు హెడ్, కిషన్, అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డి వెంటవెంటనే వెనుదిరిగారు. ఉప్పల్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై ఇలాంటి బ్యాటింగ్ ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 4.1 ఓవర్లకు SRH స్కోర్ 13/4.

News April 23, 2025

IPL: రూ.కోట్లు ఇస్తున్నా కుర్చీకే పరిమితం!

image

IPL మెగా వేలంలో కొన్ని ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి కొందరిని సొంతం చేసుకున్నాయి. కానీ తీరా టోర్నీలో మాత్రం వారిని బెంచ్‌కే పరిమితం చేస్తున్నాయి. వీరిలో నటరాజన్ (రూ.10.75 కోట్లు), జాకబ్ బేతేల్ (రూ.2.6cr), గెరాల్డ్ కొయెట్జీ (రూ.2.4cr), డెవాల్డ్ బ్రెవిస్ (రూ.2.2cr), లామ్రోర్ (రూ.1.7cr), తుషారా (రూ.1.6cr), మపాకా (రూ.1.5cr), పావెల్ (రూ.1.5cr), హర్దీ (రూ.1.25cr) ఎంగిడి రూ.కోటి) తదితరులు ఉన్నారు.

News April 23, 2025

మద్యం కుంభకోణంలో మరో నిందితుడు అరెస్ట్

image

AP: మద్యం కుంభకోణం వ్యవహారంలో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కాగా, తాజాగా A8 చాణక్యను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, రాజ్ కసిరెడ్డి విచారణలో పూర్తి వివరాలు వెల్లడించలేదని సిట్ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News April 23, 2025

కుల్గాంలో భీకర ఎన్‌కౌంటర్.. TRF కమాండర్ ట్రాప్

image

జమ్మూ కశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కుల్గాంలోని టంగ్‌మార్గ్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పహల్‌గామ్ దాడికి కారణమైన TRF ఉగ్రవాదుల కమాండర్‌ అసిఫ్ ఫౌజీని ట్రాప్ చేశారు. టెర్రరిస్టులు తలదాచుకున్న ప్రాంతాన్ని అన్నివైపుల నుంచి బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఈ దాడుల్లో అసిఫ్ ఫౌజీ నేరుగా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

News April 23, 2025

పహల్‌గామ్‌@మినీ స్విట్జర్లాండ్.. తెలుగు సినిమాల షూటింగ్

image

ఉగ్రవాదుల నరమేధంతో పహల్‌గామ్ పేరు దేశవ్యాప్తంగా విన్పిస్తోంది. ఇక్కడి ప్రకృతి అందాల వల్ల దీనికి మినీ స్విట్జర్లాండ్ అని పేరు వచ్చింది. కాగా, పహల్‌గామ్ అద్భుతమైన లొకేషన్లలో అల్లుఅర్జున్ ‘నా పేరు సూర్య’, నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ‘పెళ్లి సందD’, విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ సినిమాల షూటింగ్ జరిగింది. స్విట్జర్లాండ్‌ను తలపించే అందాలు, బడ్జెట్ కారణాల రీత్యా నిర్మాతలు ఇక్కడ షూటింగ్‌కు మొగ్గు చూపుతుంటారు.

News April 23, 2025

మోదీ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభం

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.