News June 30, 2024

ఇక మీ వండర్స్ చూడలేము: ఫ్యాన్స్

image

క్రికెట్‌లో WC గెలవడం కన్నా మించింది ఏముంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాకారమైన వేళ ముగ్గురు భారత క్రికెటర్లు గుడ్ బై చెప్పారు. నిన్న రోహిత్, కోహ్లీ టీ20Iలకు వీడ్కోలు పలకగా తాజాగా ఆల్‌రౌండర్ జడేజా ఆ జాబితాలో చేరారు. వరల్డ్ కప్ గెలిచిన ఆనందం ఓ వైపు, అభిమాన ఆటగాళ్లు దూరమవుతున్నారని బాధలో మరో వైపు ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. టీ20ల్లో మీ వండర్స్ ఇక చూడలేమని కామెంట్లు చేస్తున్నారు.

News June 30, 2024

సీఎం రేవంత్ విజ్ఞప్తి.. అంగీకరించిన కేంద్రం

image

TG: స్మార్ట్ సిటీ మిషన్ గడువును 2025 మార్చి వరకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. గతంలో విధించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరుతో గడువు ముగియాల్సి ఉంది. వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ సిటీ పథకం పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ ఈ పథకం గడువు పొడిగించాలని కోరడంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

News June 30, 2024

మేమంతా కలిసే బరిలో దిగుతాం: శరద్ పవార్

image

మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ(శరద్) కలిసి బరిలోకి దిగుతాయని శరద్ పవార్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో BJP, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) కూటమిని గద్దె దించడమే లక్ష్యమని మీడియాతో చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి 17 సీట్లు రాగా శరద్ మిత్రపక్షాలకు 31 సీట్లు వచ్చాయి.

News June 30, 2024

రేపు నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ షూటింగ్ ప్రారంభం

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్’ మూవీ షూటింగ్ రేపు ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తెలిపారు. శివుని ఆశీస్సులతో హంపిలోని విరూపాక్ష టెంపుల్‌లో పూజా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ చిత్రానికి రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ సినిమాను నిర్మిస్తున్నారు.

News June 30, 2024

BIG BREAKING: T20 క్రికెట్‌కు జడేజా వీడ్కోలు

image

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలోనే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ T20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఇన్నేళ్లూ గర్వంతో దూసుకెళ్లే గుర్రంలా నా దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చా. ఇకపై ఇతర ఫార్మాట్లలో నా జర్నీ కొనసాగిస్తా. T20WC గెలవడమనే నా కల నిజమైంది. ఇది నా కెరీర్‌లో అత్యున్నత ఘనత’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

News June 30, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంలో వారిద్దరికే ఉద్యోగాలు వచ్చాయి: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్నకు ఉద్యోగాలు వచ్చాయని, గ్రూప్స్ అభ్యర్థులకు మాత్రం రాలేదని BRS MLA హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్‌ను ఆయన పరామర్శించారు. దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిరుద్యోగులను మోసగిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల కోసం వారిని వాడుకుందని విమర్శించారు.

News June 30, 2024

చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా

image

AP: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా IAS కార్తికేయ మిశ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను ఏపీ సర్వీసుకు పంపాలని కేంద్రానికి సీఎం ఇటీవల లేఖ రాశారు. చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన DOPT, కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది.

News June 30, 2024

14 ఏళ్లలో ఒక్కరోజైనా ఇంటి వద్దకే చంద్రబాబు పింఛను పంపించారా?: వైసీపీ

image

AP: ప్రతి నెలా 1, 2 తేదీల్లో పెన్షన్ తీసుకోకుంటే అనర్హులవుతారని YCP దుష్ప్రచారం చేస్తోందన్న TDP <<13537125>>విమర్శలకు<<>> ఆ పార్టీ కౌంటరిచ్చింది. ‘అవ్వాతాతలను ఏడిపించింది ఎవరో అందరికీ తెలుసు. జగనన్న హయాంలో పండుటాకులకు కష్టం కలగకుండా గడప వద్దే పింఛను అందించాం. 14ఏళ్లలో ఒక్కరోజైనా ఇంటి వద్దకే CBN పింఛను పంపించారా? పింఛనుదారులకు డబ్బు ఎగ్గొట్టడానికేగా ఈ డప్పు ప్రచారం!’ అని Xలో మండిపడింది.

News June 30, 2024

ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా బాల్య స్నేహితులు

image

దేశ రక్షణ దళాల చరిత్రలో తొలిసారి ఇద్దరు బాల్య స్నేహితులు ఆర్మీ, నేవీ అధిపతులయ్యారు. నౌకాదళ చీఫ్‌గా అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఇవాళ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్‌గా విధుల్లో చేరారు. వీరిద్దరూ 1970లో మధ్యప్రదేశ్‌ రేవా సైనిక్ స్కూల్‌లో ఐదో తరగతిలో చేరి, 12Th క్లాస్ వరకు కలిసి చదువుకున్నారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నేడు అత్యున్నత విభాగాలకు నేతృత్వం వహిస్తున్నారు.

News June 30, 2024

చల్లా శ్రీనివాసులకు జనసేనాని అభినందనలు

image

SBI ఛైర్మన్‌గా నియమితులైన తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టికి జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ఆయన నేతృత్వంలో ఎస్బీఐ మరెన్నో మైలురాళ్లు దాటాలన్నారు. తెలుగు వారైన చల్లా తెలంగాణలోని ప్రస్తుత జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. విద్యాభ్యాసం తెలంగాణలోనే సాగింది. 1988లో SBIలో పీవోగా చేరారు. బ్యాంకింగ్ రంగంలో 35 ఏళ్ల అనుభవం ఆయన సొంతం.