News June 30, 2024

YELLOW ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 30-40కి.మీ వేగంతో కూడిన బలమైన ఉపరితల గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

News June 30, 2024

మాజీ మంత్రి డీఎస్ అంత్యక్రియలు పూర్తి

image

TG: సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామాబాద్ బైపాస్ రోడ్ సమీపంలోని ఫామ్‌హౌజ్‌లో పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. కాగా నిన్న తెల్లవారుజామున డీఎస్ అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.

News June 30, 2024

రైతులకు అన్యాయం జరిగితే సహించం: పెమ్మసాని

image

AP: ఖరీఫ్‌లో పంటల సాగుకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలో మాట్లాడుతూ.. కృత్రిమంగా కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే వారిపై నిఘా పెట్టాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.

News June 30, 2024

జులై 6 నుంచి దుర్గమ్మకు ఆషాఢ సారె మహోత్సవాలు: ఈవో

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలిసారి జులై 6 నుంచి 15 వరకు వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు EO రామారావు వెల్లడించారు. జులై 6 నుంచి నెల రోజులపాటు ఆషాఢ మాస సారె మహోత్సవాలు జరుపుతున్నామన్నారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. జులై 19 నుంచి 21 వరకు శాకాంబరీ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు సమర్పిస్తుందని పేర్కొన్నారు.

News June 30, 2024

పాత డీఎస్సీ రద్దు చేస్తూ జీవో విడుదల

image

AP: ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన DSC నోటిఫికేషన్‌‌ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. ఈ మేరకు జీవో 256 రిలీజ్ చేసింది. ఇవాళ లేదా రేపు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం డీఎస్సీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

News June 30, 2024

అమ్మ పేరుతో మొక్క నాటండి: ప్రధాని మోదీ

image

మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ కొత్త ప్రచారానికి తెరలేపారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’(అమ్మ పేరుతో ఒక మొక్క) నాటండి అని అన్నారు. ‘మా అమ్మ పేరుతో నేను మొక్క నాటాను. ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించేలా ఒక మొక్కను నాటండి’ అని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

News June 30, 2024

అలా జరిగితే ఉచిత విద్యుత్ ఉండదు: జగదీశ్ రెడ్డి

image

TG: విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీకి CM రేవంత్ అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ రంగం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే పేదవారికి, రైతులకు ఉచిత విద్యుత్, సబ్సిడీ ఉండవన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గలేదన్నారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.

News June 30, 2024

నన్ను ఎన్నో మాటలన్నారు: హార్దిక్

image

ఈ టీ20 వరల్డ్ కప్ ముఖ్యంగా తనకెంతో ప్రత్యేకమని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అన్నారు. ‘వ్యక్తిగతంగా నా గురించి ఒక్కశాతం కూడా తెలియని వారు నా గురించి ఏవేవో మాట్లాడారు. నా జీవితం గత 6నెలలుగా ఎలా ఉందో మీకు తెలుసు. నేనొక్క మాట మాట్లాడకున్నా నాకు చాలా అన్యాయం జరిగింది. వాటికి మాటలతో స్పందించాలనుకోలేదు. పరిస్థితులే సమాధానం చెబుతాయి’ అని ట్రోలర్స్‌ను ఉద్దేశిస్తూ పాండ్య అన్నారు.

News June 30, 2024

అందుకే ఆ సినిమాలు వదులుకున్నా: కమల్ హాసన్

image

‘రోబో’ సినిమాలో హీరో పాత్రకు ముందుగా తననే ఎంపిక చేసినట్లు హీరో కమల్ హాసన్ చెప్పారు. లుక్ టెస్ట్ కూడా పూర్తైందని, అప్పటి(90ల్లో) మార్కెట్‌ దృష్ట్యా ఆ సినిమా చేయకపోవడమే మేలని వదులుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శంకర్ మాత్రం సరైన సమయంలో రోబో చిత్రాన్ని తెరకెక్కించి ఘనవిజయాన్ని అందుకున్నాడన్నారు. ‘రోబో 2.o’లో తనకు విలన్‌గా అవకాశం వచ్చినా తిరస్కరించినట్లు తెలిపారు.

News June 30, 2024

త్వరలో వారికి రూ.15వేల పెన్షన్: మంత్రి

image

AP: విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచిన పెన్షన్ మొత్తం అందిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం విడతల్లో పెన్షన్లు పెంచడంతో దివ్యాంగులు, పేదలు నష్టపోయారని ఆరోపించారు. మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్న వారికి త్వరలోనే రూ.15వేల పెన్షన్ అందించే ఆలోచన ఉందని ఆయన ప్రకటించారు. రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు అందించడం ప్రారంభిస్తామని చెప్పారు.