News June 30, 2024

ఆ భయంతో నేను మ్యాచ్ చూడలేదు: అమితాబ్

image

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంతో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడలేదన్నారు. తాను చూస్తే ఇండియా ఓడిపోతుందనే భయంతోనే మ్యాచ్ సాగినంతసేపు తాను టీవీ ఆన్ చేయలేదని చెప్పుకొచ్చారు. భారత్ గెలిచిందని తెలిశాక కళ్లలో నీళ్లు వచ్చాయని బ్లాగ్‌లో రాశారు. రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన భారత్‌కు పలువురు సినీ తారలు విషెస్ తెలిపారు.

News June 30, 2024

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు

image

AP: అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలించారు. వారు 4 రోజులు పాటు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తారు. ఒక్కోరోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను బట్టే పనులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News June 30, 2024

17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

image

భారత్‌తో ఏకైక టెస్టులో సౌతాఫ్రికా కేవలం 17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 236/4తో 3వ రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టు 249 దగ్గర 5వ వికెట్ కోల్పోగా 266 రన్స్‌కే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. 2వ ఇన్నింగ్స్‌లో 16/1గా ఉన్న ఆ జట్టు ఇంకా 321 రన్స్ వెనకబడి ఉంది. భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 8/77తో సఫారీల నడ్డి విరిచారు. అద్భుతం జరిగితే తప్ప భారత్‌ గెలుపును సౌతాఫ్రికా అడ్డుకోలేదు.

News June 30, 2024

టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్

image

టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్ శర్మను, గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా ప్రశంసించారు. చివరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యను, అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్యకుమార్‌ను అభినందించారు. రాహుల్ ద్రవిడ్‌‌ కోచింగ్‌ను మోదీ కొనియాడారు.

News June 30, 2024

ఇకపై దిగ్గజాలు లేని మ్యాచ్‌లు

image

భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇకపై రోహిత్, కోహ్లీ లేని టీ20 మ్యాచ్‌లు చూడాలి. ఈ WCలో రోహిత్, కోహ్లీ అనూహ్యంగా ఓపెనర్లుగా దిగారు. ఒకరు ఔటైనా మరొకరు జట్టును ముందుకు నడిపించి, విజయాల్లో కీలకపాత్ర పోషించారు. కప్ గెలిచిన తర్వాత ఈ దిగ్గజాలిద్దరూ కొత్త ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ పొట్టి ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇకమీదట టీ20ల్లో రోహిత్, కోహ్లీ వారసులుగా ఎవరు ఎదుగుతారనేది వేచిచూడాలి.

News June 30, 2024

ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి

image

నైజీరియాలో ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్‌లు మారణహోమం సృష్టిస్తున్నాయి. పెళ్లి వేడుకలు, అంత్యక్రియలు, ఆసుపత్రులు.. ఇలా జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా మహిళా సూసైడ్ బాంబర్లను ప్రయోగిస్తున్నాయి. తాజాగా బోర్నో రాష్ట్రంలోని గ్వోజాలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 18మంది మరణించారు. వీరిలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నారు. కాగా బోర్నో రాష్ట్రం బోకోహారం మిలిటెంట్ గ్రూప్‌కు కంచుకోటగా మారింది.

News June 30, 2024

రోహిత్‌ లేకుండా ఐసీసీ ఫాంటసీ బెస్ట్ టీమ్

image

T20 WC2024 ముగియడంతో ICC బెస్ట్ ఫాంటసీ టీమ్‌ను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా అందులో టైటిల్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్‌శర్మకు చోటు దక్కలేదు. భారత్, అఫ్గాన్ జట్ల నుంచి ముగ్గురి చొప్పున ఎంపికవగా విచిత్రంగా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన AUS నుంచీ ముగ్గురు చోటు దక్కించుకున్నారు.
జట్టు: రషీద్‌ ఖాన్‌(C), గుర్బాజ్‌, హెడ్, వార్నర్, స్టబ్స్, హార్దిక్ పాండ్య, స్టోయినిస్, ఫరూఖీ, బుమ్రా, అర్ష్‌దీప్, రిషద్.

News June 30, 2024

సౌతాఫ్రికా ఓటమికి కారణమిదే..!

image

తొలిసారి వరల్డ్ ‌కప్‌ను ముద్దాడాలనే సౌతాఫ్రికా ఆశలపై ‘ఒత్తిడి’ నీళ్లు చల్లింది. 24 బంతుల్లో కొట్టాల్సినవి 26 రన్స్. బంతికో సింగిల్ కొట్టి, వీలైనప్పుడు ఒక్క ఫోర్ కొట్టినా చాలు. కానీ క్లాసెన్‌(52) ఔట్‌తో ‘ఒత్తిడి’ సడన్ ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది సఫారీ బ్యాటర్లు నిస్సహాయులయ్యారు. బౌండరీల మాట దేవుడెరుగు కనీసం బంతికి బ్యాటు తాకించలేని దీన స్థితిలోకి చేరారు. ఫలితంగా మరోసారి ఓటమి వారిని వెక్కిరించింది.

News June 30, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

image

APలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ. గో, ఏలూరు, కృష్ణా, NTR, GNR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, నంద్యాల, SSS, పార్వతీపురం, YSR, అన్నమయ్య, చిత్తూరు, TRPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు TGలో నేడు, రేపు మోస్తరు వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News June 30, 2024

నేడు ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’

image

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉ.11గంటలకు ‘మన్‌ కీ బాత్‌’లో పాల్గొని మాట్లాడనున్నారు. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎన్నికల కోడ్ వల్ల కొన్నాళ్లు తాత్కాలిక బ్రేక్ పడింది. ఫిబ్రవరి 25న చివరిసారిగా మన్ కీ బాత్‌లో మాట్లాడిన మోదీ ఇప్పుడు మళ్లీ ప్రజలతో మమేకం కానున్నారు.