News June 29, 2024

భారత్‌కు షాక్.. 2 వికెట్లు డౌన్

image

T20WC ఫైనల్‌లో రెండో ఓవర్‌లోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకు ఔట్ కాగా, రిషభ్ పంత్ డకౌట్ అయ్యారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ ఈ రెండు వికెట్లూ తీశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోరు 23/2.

News June 29, 2024

2040 నాటికి చంద్రుడిపైకి మనుషులు: సోమ్‌నాథ్

image

చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు వీలుగా NGLV(నెక్స్ట్ జనరేషన్ లాంఛ్ వెహికల్) అనే భారీ రాకెట్‌ను నిర్మిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వెల్లడించారు. దీన్ని ‘సూర్య’ అని పిలుస్తున్నట్లు తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్, మీథేన్ ఆధారంగా ఇంజిన్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని LEO పేలోడ్ కెపాసిటీ 40టన్నులకు పైగా ఉంటుందని చెప్పారు. 2040 నాటికి చంద్రుని ఉపరితలంపైకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

News June 29, 2024

BREAKING: టాస్ గెలిచిన భారత్

image

T20WC ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నారు. టీమ్ ఇండియా మార్పుల్లేకుండా బరిలో దిగింది.
IND: రోహిత్, కోహ్లీ, పంత్, సూర్య, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్‌దీప్, బుమ్రా
SA: డికాక్, హెండ్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, రబడ, నోర్ట్జే, షంసీ.

News June 29, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక: సీఎం చంద్రబాబు

image

AP: మంగళగిరి TDP ఆఫీసులో ప్రజలు, కార్యకర్తల నుంచి CM చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. కొందరు వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించి ఆయనను సాయం కోరారు. ‘ప్రజల వినతులు చూస్తుంటే ఐదేళ్లలో ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తుంది. గత ప్రభుత్వం సరిగా పనిచేయకపోవడం వల్లే ఇన్ని సమస్యలు. ప్రజల ఇబ్బందులు చూస్తుంటే బాధగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తా’ అని బాబు వెల్లడించారు.

News June 29, 2024

‘కల్కి’ టీమ్‌కు మోహన్ బాబు, రష్మిక అభినందనలు

image

‘కల్కి’ సినిమాపై ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘మా బావ ప్రభాస్, మూవీ యూనిట్‌కు నా అభినందనలు’ అని సీనియర్ నటుడు మోహన్ బాబు Xలో ట్వీట్ చేశారు. టాలీవుడ్, భారతదేశం గర్వించదగ్గ సినిమా తీయడం సంతోషంగా ఉందన్నారు. సినిమా చూసిన హీరోయిన్ రష్మిక తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. దర్శకుడు నాగ్ అశ్విన్‌ను జీనియస్ అని ప్రశంసిస్తూ, పురాణాల్లోని పాత్రలను ఆవిష్కరించిన తీరు బాగా నచ్చిందని పేర్కొన్నారు.

News June 29, 2024

ALERT.. జులై 1 నుంచి కొత్త రూల్స్

image

☞ ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలపై SBI క్రెడిట్ కార్డులో రివార్డు పాయింట్లు రావు
☞ ICICI క్రెడిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీలు ₹200కు పెంపు
☞ చెక్/క్యాష్ పిక్ ఫీజు, స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్, డూప్లికేట్ స్టేట్‌మెంట్‌లపై ICICI ఛార్జీలు తొలగించింది.
☞ థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్స్ నుంచి చేసే రెంట్ పేమెంట్స్‌పై HDFC క్రెడిట్ కార్డులపై 1% ఛార్జీ వసూలు, ఆగస్టు 1 నుంచి అమలు

News June 29, 2024

రేపటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3

image

AP: విశాఖ YSR ACA స్టేడియంలో రేపటి నుంచి జులై 13 వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 జరగనుంది. స్థానిక క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో రాయలసీమ కింగ్స్, కోస్టల్‌ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్‌ వారియర్స్‌ జట్లు పోటీలో ఉన్నాయి. స్టేడియంలో ఉచితంగా చూడొచ్చు. స్టార్‌ స్పోర్ట్స్ తెలుగు, స్టార్‌ స్పోర్ట్స్‌ ఫస్ట్‌లో లైవ్ చూడవచ్చు.

News June 29, 2024

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 4 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: రాష్ట్రంలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి జులై 4 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు TGPSC వెల్లడించింది. హైదరాబాద్‌లోని కార్యాలయంలో ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని తెలిపింది. గత ఏడాది జులైలో నిర్వహించిన రాత పరీక్షకు 913 మంది హాజరయ్యారు. ఈ ఏడాది మార్చిలో ఫలితాలు వెల్లడయ్యాయి.
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/

News June 29, 2024

₹12వేల కోట్ల సమీకరణకు NTPCకి గ్రీన్ సిగ్నల్

image

బాండ్లు, NCDల ద్వారా ₹12వేల కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు NTPC వెల్లడించింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ కింద విడతల వారీగా బాండ్లను విక్రయించనున్నట్లు సెబీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ బాండ్ల టెన్యూర్, లిస్టింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. FY24లో ₹1,81,166కోట్ల ఆదాయం ఆర్జించిన NTPC షేర్ ధర BSEలో ప్రస్తుతం ₹379.50గా ఉంది.

News June 29, 2024

ఏపీలో పరిస్థితులను గవర్నర్‌కు వివరించాం: సుబ్బారెడ్డి

image

AP: YCP కార్యాలయాల్లోకి TDP నేతల అక్రమ చొరబాటు, దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేసినట్లు YCP సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘టీడీపీ నేతల దాడులు పెరిగిపోతున్నాయి. అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఈ అంశాలపై వెంటనే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరాం’ అని సుబ్బారెడ్డి తెలిపారు.