News October 1, 2024

అర్ధరాత్రి నుంచి OTTలోకి ’35 చిన్న కథ కాదు’

image

గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్న ’35 చిన్న కథ కాదు మూవీ’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ అర్ధరాత్రి నుంచి చిత్రం ‘ఆహా’లో అందుబాటులో ఉండనుంది. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.

News October 1, 2024

JK చివరి విడత ఎన్నికల్లో 65.48% పోలింగ్

image

జ‌మ్మూక‌శ్మీర్ చివ‌రి విడ‌త ఎన్నిక‌ల్లో ఓటింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 65.48% పోలింగ్ న‌మోదైంది. జమ్మూలోని 24, కశ్మీర్‌లోని 16 స్థానాలు కలిపి మొత్తం 40 స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అత్య‌ధికంగా ఉధంపూర్ జిల్లాలో 72.91%, అత్య‌ల్పంగా బారాముల్లాలో 55.73% పోలింగ్ జ‌రిగింది. మొద‌టి ద‌శ‌లో 61.38%, రెండో ద‌శ‌లో 57.31% పోలింగ్ నమోదైన విష‌యం తెలిసిందే. అక్టోబ‌ర్ 8న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

News October 1, 2024

ఆ ఇద్ద‌రి విడుద‌ల వెనుక BJP ఉంది: రాబ‌ర్ట్ వాద్రా

image

ఢిల్లీ EX CM అరవింద్ కేజ్రీవాల్‌, డేరా చీఫ్ గుర్మీత్ జైలు నుంచి విడుద‌ల వెనుక BJP హ‌స్తం వుంద‌ని రాబ‌ర్ట్ వాద్రా ఆరోపించారు. హ‌రియాణా ఎన్నిక‌ల్లో BJPకి అనుకూలంగా ప్ర‌చారం చేయ‌డానికే గుర్మీత్‌ను 20 రోజులు పెరోల్‌పై విడుద‌ల చేశార‌ని, ఎన్నికల ప్రచారానికి వీలు కల్పించేలా కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కేలా చేశారని దుయ్య‌బ‌ట్టారు. తద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీయవ‌చ్చ‌ని BJP భావిస్తోంద‌న్నారు.

News October 1, 2024

టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ట్రాక్ రికార్డు

image

* శ్రీలంకపై 2-0తో గెలుపు
* ఆస్ట్రేలియాపై 2-1తో విజయం
* వెస్టిండీస్‌పై 1-0తో గెలుపు
* సౌతాఫ్రికాతో 1-1తో సిరీస్ డ్రా
* ఇంగ్లండ్‌పై 4-1తో విజయం
* బంగ్లాదేశ్‌పై 2-0తో సిరీస్ విజయం

News October 1, 2024

Paytm షేరు ధ‌ర పెర‌గ‌డానికి కార‌ణం ఇదే!

image

Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేరు ధ‌ర‌ సోమవారం సెష‌న్‌లో 6.25% పెరిగి రూ.731కి చేరింది. డోలాట్ క్యాపిటల్ సంస్థ‌ Paytmకు Buy రేటింగ్ ఇవ్వ‌డంతో ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు ఎగ‌బ‌డ్డారు. ప్ర‌స్తుత స్టాక్ ధ‌ర‌ను 30% పెంచి రూ.920 టార్గెట్ ప్రైస్‌గా నిర్ణ‌యించింది. Paytm హ్యాండిల్ మైగ్రేష‌న్ పూర్తి స‌హా పేమెంట్ అగ్రిగేట‌ర్ లైసెన్స్‌కు ఎఫ్‌డీఐ అనుమతి వంటివి సానుకూల కార‌ణాలుగా చూపింది.

News October 1, 2024

గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్

image

AP: బెంగళూరు నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్, సతీమణి భారతి రెడ్డిలకు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి వారు నేరుగా తాడేపల్లికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

News October 1, 2024

RECORD: 80 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలకు..

image

సౌత్ కొరియాకు చెందిన మోడల్ చోయ్ సూన్ హ్వా(80) చరిత్ర సృష్టించారు. మిస్ యూనివర్స్ పోటీల్లో కొరియా తరఫున పాల్గొననున్న ఓల్డెస్ట్ మహిళగా నిలిచారు. నవంబర్‌లో మెక్సికో వేదికగా జరిగే ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన 31 మందితో ఆమె పోటీ పడనున్నారు. ‘80 ఏళ్ల మహిళ శరీరాన్ని ఎలా కాపాడుకుంది? ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంది? తినే ఆహారమేంటి? అనే అంశాలపై నేను ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకుంటున్నా’ అని ఆమె చెప్పారు.

News October 1, 2024

WTC: భారత్ టాప్ స్పాట్ మరింత పదిలం

image

బంగ్లాతో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా WTC పాయింట్ల పట్టికలో తన అగ్ర స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 98 పాయింట్లతో టాప్ స్పాట్‌లో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా (90 పాయింట్లు) నిలిచింది. ఈ ఏడాది భారత్ ఆడబోయే 8 టెస్టుల్లో మూడింట్లో గెలిస్తే WTC ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. భారత్ ఈ ఏడాది మొత్తం 11 టెస్టులు ఆడి ఎనిమిదింట్లో గెలిచి, రెండింట్లో ఓడి, ఒకటి డ్రా చేసుకుంది.

News October 1, 2024

జోగి రమేశ్‌కు నోటీసులు.. నందిగం బెయిల్‌పై వాదనలు పూర్తి

image

AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు మంగళగిరి పోలీసులు నోటీసులిచ్చారు. రేపు ఉదయం డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

News October 1, 2024

రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార అందజేత

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ కొనసాగుతోంది. తెనాలి నియోజకవర్గంలో రేషన్ పంపిణీలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ నెల నుంచి బియ్యంతో పాటు రాయితీపై ఇస్తున్న కందిపప్పు, పంచదారను ఆయన లబ్ధిదారులకు అందించారు. కాగా కేజీ కందిపప్పు సబ్సిడీపై రూ.67కి, అరకేజీ పంచదార రూ.17కి ప్రభుత్వం అందిస్తోంది.