News June 29, 2024

TODAY HEADLINES

image

* పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన AP CM చంద్రబాబు
* రాజకీయాలకు నటుడు అలీ గుడ్‌బై
* పోలవరానికి చంద్రబాబు అజ్ఞానమే శాపం: YCP
* పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు అక్కర్లేదు: సీఎం రేవంత్
* పార్టీని వీడే వాళ్ల గురించి నాకు బాధలేదు: KCR
* ఎయిర్‌టెల్, వొడాఫోన్ రీఛార్జ్ ధరలు పెంపు
* టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన షఫాలీ వర్మ

News June 28, 2024

ఫైనల్‌లో కోహ్లీ సెంచరీ చేస్తారు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

image

రేపు జరిగే టీ20 WC ఫైనల్‌లో భారత జట్టు గెలుస్తుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అంచనా వేశారు. అలాగే ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ రేపటి మ్యాచులో సెంచరీ చేస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టైటిల్ బరిలో నుంచి తమ జట్టు తప్పుకోవడంతో టీమ్‌ఇండియాకు తాను మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ టోర్నీలో విరాట్ ఇప్పటివరకు 75 రన్స్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.

News June 28, 2024

ALERT.. రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, KKD, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, SKLM, VZM, VSP, అనకాపల్లి, కృష్ణా, NTR, పల్నాడు, ప్రకాశం, NLR, నంద్యాల, YSR, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, చెట్లు, పోల్స్, టవర్స్ కింద ఉండొద్దని సూచించింది.

News June 28, 2024

‘కల్కి’ సెకండ్ పార్ట్‌లో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది: కమల్

image

భారతీయ సినిమా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోందని కమల్ హాసన్ అన్నారు. కల్కి సినిమా రెండవ భాగంలో తన పాత్ర ఎక్కువ సేపు ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని మేకర్స్ తనకు ముందే చెప్పారన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు ఓపిక ఎక్కువ అని, పురాణాలను సైన్స్‌కు ముడిపెట్టి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. ఇందులో ఆయన ‘సుప్రీం యాస్కిన్’ అనే నెగటివ్ రోల్‌లో నటించిన సంగతి తెలిసిందే.

News June 28, 2024

తెలంగాణ DSC: ఏ రోజున ఏ పరీక్ష అంటే?

image

✒ జులై 18-మొదటి షిఫ్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్
✒ సెకండ్ షిఫ్ట్‌లో స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
✒ 19-సెకండరీ గ్రేడ్ టీచర్
✒ 20-SGT, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్
✒ 22-స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్
✒ 24- స్కూల్ అసిస్టెంట్-జీవశాస్త్రం
✒ 26-తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్
✒ 30-స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్.
పూర్తి షెడ్యూల్ కోసం పైన ఫొటోల్లో చూడగలరు.

News June 28, 2024

BIG BREAKING: డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

TG: డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు CBRT విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు జరగనున్నాయి. కాగా మొత్తం 11,062 పోస్టులకు 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. పరీక్షల షెడ్యూల్ కోసం కింది ఆర్టికల్ చూడగలరు.

News June 28, 2024

పెన్షన్‌దారులకు సీఎం చంద్రబాబు లేఖ

image

AP: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ CM చంద్రబాబు పెన్షన్‌దారులకు లేఖ రాశారు. దీన్ని పెన్షన్లతోపాటు జులై 1న ఉద్యోగులు పంపిణీ చేయనున్నారు. ‘మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 65,18,496 మందికి పెంచిన పింఛన్లు అందిస్తున్నాం. దీనివల్ల నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా మీ శ్రేయస్సు కోసం అమల్లోకి తెచ్చాం. రూ.7వేలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.

News June 28, 2024

రేపు వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపటి వరంగల్ టూర్ షెడ్యూల్ విడుదలైంది. మ.12.40 గంటలకు HYD నుంచి బయల్దేరి 1.30 గంటలకు వరంగల్ చేరుకుంటారు. టెక్స్‌టైల్ పార్క్, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను పరిశీలిస్తారు. అనంతరం మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించనున్న ఆయన ఆ తర్వాత గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సమీక్షిస్తారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించి తిరిగి HYD బయల్దేరుతారు.

News June 28, 2024

రేపు ఎవరి కల నెరవేరుతుందో?

image

సౌతాఫ్రికా గత 26 ఏళ్లలో, ఇండియా గత 11 ఏళ్లలో ఒక్క ICC ట్రోఫీ కూడా గెలవలేదు. SA చివరగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగా, IND 2013లో (CT) టైటిల్ సాధించింది. ఇక SA ఇప్పటివరకు ఒక్క ODI WC, T20 WC కూడా గెలవలేదు. దీంతో ఈసారైనా WC కలను నిజం చేసుకోవాలని ఆ జట్టు ఆశతో ఉంది. భారత్ కూడా మరో WCని తన ఖాతాలో వేసుకోవాలనే అపేక్షతో ఉంది. దీంతో రేపు ఎవరి కల నెరవేరుతుందోనని క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు.

News June 28, 2024

పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్: లోకేశ్

image

AP: ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్ అప్‌గ్రేడ్ చేయాలి. నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదివినా విద్యార్థికి రాని స్కిల్స్.. అమీర్‌పేటలో 4 నెలల శిక్షణ పొందితేనే ఎలా వస్తున్నాయి? కాలేజీల్లోనే అలాంటి శిక్షణ ఇచ్చేలా చూడాలి’ అని అధికారులను ఆదేశించారు.