News June 28, 2024

ఈజిప్టులో వెలుగుచూసిన 1400 మమ్మీలు!

image

సుమారు 1400 మమ్మీలున్న 36 సమాధుల్ని పరిశోధకులు ఈజిప్టులో తాజాగా గుర్తించారు. ఇవి లభ్యమైన ప్రాంతాన్ని ‘అస్వాన్’గా పిలుస్తున్నారు. నైలు నదికి తూర్పు తీరంలో 2.70 లక్షల అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం కనీసం 4500 ఏళ్ల క్రితం నాటిదని, అంటురోగాలు సోకిన వారిని ఇలా సామూహికంగా ఖననం చేసి ఉంటారని భావిస్తున్నారు. వీటిని గుర్తించేందుకు ఐదేళ్ల పాటు శ్రమించినట్లు ఆర్కియాలజిస్టులు తెలిపారు.

News June 28, 2024

JP మోర్గాన్ ఇండెక్స్‌లో గవర్నమెంట్ బాండ్స్.. భారత మార్కెట్‌కు ప్లస్!

image

దిగ్గజ ఫైనాన్స్ కంపెనీ జేపీ మోర్గాన్ నేడు ప్రభుత్వ బాండ్లను ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌‌లో చేర్చింది. దీంతో భారతీయ బాండ్లకు డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సూచీలో స్థానం కల్పించడంపై 2023 SEPలో జేపీ మోర్గాన్ తొలిసారిగా ప్రకటన చేసింది. అప్పటి నుంచి విదేశాలు మన బాండ్లపై దాదాపు $11బిలియన్లు వెచ్చించాయి. మరో 10నెలల్లో $25B వరకు భారత్‌కు రావొచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది.

News June 28, 2024

BREAKING: ఎన్నికల విధుల్లో పాల్గొన్నవారికి గుడ్‌న్యూస్

image

AP: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు గౌరవ వేతనం లభించనుంది. ఒక నెల గరిష్ఠ వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News June 28, 2024

శారదా పీఠం ఆక్రమణలు కూల్చేయాలి: శ్రీనివాసానంద

image

AP: తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఇక్కడ ఒక్కరికి కూడా అన్నం పెట్టడం లేదన్నారు. ‘నాలుగు అంతస్తులకు అనుమతిస్తే, 6 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. గదులకు భక్తుల నుంచి అధిక మొత్తంలో అద్దె వసూలు చేస్తున్నారు. తిరుమలలో ఈ శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం’ అని ఆయన హెచ్చరించారు.

News June 28, 2024

ట్రైన్‌లో ఒకరి అజాగ్రత్త వల్ల నిండు ప్రాణం బలి!

image

ట్రైన్‌లో ఓ వ్యక్తి అజాగ్రత్తగా ఉండటం వల్ల తోటి ప్రయాణికుడు మరణించాడు. ఎర్నాకులం-హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లో కేరళకు చెందిన అలీఖాన్ స్నేహితుడితో కలిసి ఆగ్రాకు వెళ్తున్నాడు. ఆయన దిగువ బెర్త్‌లో పడుకోగా మిడిల్ బెర్త్‌లో ఉన్న వ్యక్తి సీటు చైన్లు సరిగా బిగించలేదు. దీంతో పై బెర్త్ ఆయనపై పడిపోయింది. తీవ్ర గాయాలైన అలీఖాన్‌ HYDలోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

News June 28, 2024

నాకు బ్రెస్ట్ క్యాన్సర్: నటి

image

నటి హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. క్యాన్సర్‌తో చేసే పోరాటంలో అండగా ఉండాలని, తనకోసం ప్రార్థించాలని అభిమానులను కోరారు. అందరి సపోర్ట్‌తో వ్యాధిని జయిస్తానని రాసుకొచ్చారు. ప్రస్తుతం హీనా స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా పలు టీవీ సీరియల్స్‌తో పాటు బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన హీనాకు ఇన్‌స్టాలో 19 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

News June 28, 2024

వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకోం: సోము వీర్రాజు

image

AP: వైసీపీ MPలను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి పార్టీలో చేరుతారన్న ప్రతిపాదన గాని, ఆలోచన కానీ లేదన్నారు. EVMలపై అనుమానాలున్నాయని YCP నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్పారు.

News June 28, 2024

ఫైనల్‌లో కోహ్లీ రాణించాలి: ఫ్యాన్స్

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఈ T20 WCలో రాణించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మెగా టోర్నీల్లో బౌలర్లపై విరుచుకుపడే కోహ్లీ ఇప్పుడు 2 సార్లు డకౌట్ అయ్యారు. 2012 టోర్నీలో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన అతను 2014& 2016లో POT అవార్డ్ అందుకున్నారు. 2022లో అత్యధిక రన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో 75 పరుగులే చేయగలిగారు. దీంతో ఫైనల్‌లో అయినా కోహ్లీ రాణించాలని అంతా కోరుకుంటున్నారు.

News June 28, 2024

భారత ఓపెనర్లు సెంచరీలు

image

సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సెంచరీలతో కదం తొక్కారు. షఫాలీ వర్మ(117*), మంధాన(111*) సఫారీ బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. దీంతో 45 ఓవర్లకు భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 230 రన్స్ చేసింది. వన్డే సిరీస్‌లోనూ మంధాన రెండు సెంచరీలతో పాటు మూడో వన్డేలో 90 రన్స్ బాదిన విషయం తెలిసిందే.

News June 28, 2024

రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు వెళ్లనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇలవేల్పుగా భావించే పవన్.. ఎన్నికల్లో విజయం సాధించడంతో ఇక్కడ మొక్కులు చెల్లించుకోనున్నారు. గతంలో వారాహి యాత్రకు ముందు ఆ వాహనానికి ఇక్కడే పూజలు చేయించారు. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్తారు.