News June 28, 2024

భారత్‌లో ఎప్పుడూ రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోలేదు: CJI

image

24 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేదని సుప్రీం కోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘భారత్‌లో జడ్జిలు ప్రభుత్వ రాజకీయ ప్రభావం నుంచి దూరంగా ఉంటారు. అయితే, తమ నిర్ణయాలు రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో న్యాయమూర్తులకు అవగాహన ఉండాలి. పాలనాపరమైన కేసుల విచారణ సందర్భంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు.

News June 28, 2024

నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు

image

TG: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరిగాయి. వీటికి దాదాపు 51, 237 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను WAY2NEWSలో వేగంగా, సులభంగా తెలుసుకోవచ్చు.

News June 28, 2024

పాపికొండల విహారయాత్రకు బ్రేక్

image

AP: వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 4 రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామన్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వతశ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి. గోదావరిపై లాంచీ ప్రయాణం, జలపాతాలు, గ్రామీణ వాతావరణం పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి.

News June 28, 2024

చరిత్రకు మరో అడుగు దూరం!

image

టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లపై ప్రతీకారం తీర్చుకుని మరీ పదేళ్ల తర్వాత ఫైనల్లో అడుగు పెట్టింది. వన్డే వరల్డ్ కప్ చేజారడంతో పొట్టి ప్రపంచకప్ సాధించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ చేజిక్కించుకోవాలని యోచిస్తోంది.

News June 28, 2024

18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు

image

TG: రాష్ట్రంలోని 18,942 మంది టీచర్ల ప్రమోషన్ల కల నెరవేరింది. చట్టపరమైన వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రమోషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మల్టీజోన్‌1లో 10,083 మంది SGTలు స్కూల్‌ అసిస్టెంట్లుగా, 1,094 మంది స్కూల్‌ అసిస్టెంట్లు HMలుగా ప్రమోషన్ పొందారు. మల్టీజోన్‌2లో SGT నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌లుగా 6,989 మంది, 776 మంది స్కూల్‌ అసిస్టెంట్లు HMలు అయ్యారు.

News June 28, 2024

తిరుమల శ్రీవారి దర్శనం.. కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కంపార్టుమెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,782 మంది దర్శించుకోగా, 30,100 మంది తలనీలాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 3.53 కోట్లు లభించినట్లు పేర్కొన్నారు.

News June 28, 2024

సెప్టెంబర్ 21 నాటికి అన్న క్యాంటీన్లు: మంత్రి

image

AP: సెప్టెంబర్ 21 నాటికి రాష్ట్రంలో ప్రతిపాదిత 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలన్నారు. ఇప్పటికే క్యాంటీన్ల పునరుద్ధరణకై తక్షణం రూ.189.22 కోట్లు అవసరమని అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఆమోదం రాగానే సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

News June 28, 2024

ఒక్క రోజులోనే పెన్షన్ పంపిణీ పూర్తి: మంత్రి ఆనం

image

AP: వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండా సచివాలయ ఉద్యోగులతో ఇంటి వద్దే పెన్షన్లను పంపిణీ చేస్తామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. జులై 1న ఉ.6 గంటల నుంచి సా.6 గంటలలోపు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. అటు, సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే పంపిణీ చేయాలని, ఇంకా ఎవరైనా మిగిలిపోతే రెండో రోజు అందించాలని సీఎస్ నీరభ్ కలెక్టర్లను ఆదేశించారు. కాగా, వృద్ధులు, వితంతువులకు రూ.7వేల పెన్షన్ అందనుంది.

News June 28, 2024

FINAL: దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ

image

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో టీమ్ ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ నెల 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లు టోర్నీలో ఓటమే లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో తుది సమరం రసవత్తరంగా జరగనుంది.

News June 28, 2024

TDP పోటీ చేస్తే ఎలా ఉండేదో?: సీఎం రేవంత్

image

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో TDP పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. టీడీపీ 10% ఓట్లు దక్కించుకునేదని, అప్పుడు కచ్చితంగా తమ పార్టీ గెలుపోటములపై ప్రభావం పడేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ అహంకారం, అతి తెలివితేటల వల్ల దెబ్బతిన్నారని చెప్పారు. తాను సీఎం కావడం, BRS ఓటమి, KCRను గద్దెదించడమనే తన మూడు రాజకీయ లక్ష్యాలూ నెరవేరాయన్నారు.