News June 27, 2024

సూర్య ‘కంగువా’ రిలీజ్ డేట్ ఇదే..

image

సూర్య నటిస్తున్న ‘కంగువా’ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు రిలీజ్ డేట్‌తో కూడిన కొత్త పోస్టర్‌ను ట్వీట్ చేశారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

News June 27, 2024

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

image

AP: లాసెట్‌, పీజీ ఎల్‌ సెట్‌ పరీక్షల ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల LLB, రెండేళ్ల LLM కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్‌ 9న ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రిజల్ట్స్, ర్యాంక్ కార్డు కోసం <>https://cets.apsche.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.

News June 27, 2024

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

image

AP: వెలగపూడిలోని సచివాలయ ఉద్యోగులు, హెచ్‌వోడీలకు వారానికి ఐదు రోజుల పనిదినాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు విధులు నిర్వహించాలని ఆదేశించారు. నేటి నుంచే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు వెలువడ్డాయి.

News June 27, 2024

గుడ్‌న్యూస్.. వర్షం తగ్గింది

image

భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. గయానా స్టేడియం వద్ద వర్షం తగ్గింది. దీంతో 8.45 గంటలకు అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించి, టాస్ టైమ్‌ను ప్రకటించనున్నారు. మరోవైపు వర్షం తగ్గడంతో భారత ప్లేయర్లు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.

News June 27, 2024

భేష్.. నాగ్ అశ్విన్: చిరంజీవి

image

‘కల్కి 2898ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోందని ట్వీట్ చేశారు. ‘ఈ తరహా సై-ఫై సినిమా తీసిన నాగ్ అశ్విన్‌కు అభినందనలు. నాకు ఇష్టమైన నిర్మాత అశ్వినీదత్‌, ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక, మొత్తం మూవీ టీమ్‌కు కంగ్రాట్స్. ఇలాగే కలలు కని భారత జెండాను మరింతపైకి ఎగురవేయండి’ అని పోస్ట్ చేశారు.

News June 27, 2024

SBI క్లర్క్ ఫలితాలు విడుదల

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన క్లర్క్ ఉద్యోగాల పరీక్ష తుది ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. మొత్తం 8,773 పోస్టులకు ఫిబ్రవరి 25, మార్చి 4, జూన్ 9న మెయిన్స్ పరీక్ష జరిగింది.

News June 27, 2024

సీఎం గాలి మాటలు మాట్లాడటం సరికాదు: హరీశ్

image

TG: MP ఎన్నికల్లో BRS, BJP కుమ్మక్కయ్యాయని <<13518607>>ఆరోపించిన<<>> CM రేవంత్‌పై హరీశ్ రావు మండిపడ్డారు. సీఎం గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. ‘రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో BJPకి మెజారిటీ వచ్చింది. కొడంగల్‌లో ఆయన 32వేల మెజారిటీతో గెలిచారు. MP ఎన్నికల్లో అక్కడ INCకి 21వేల మెజారిటీనే వచ్చింది. మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌లో BJP ఎలా గెలిచింది? రేవంతే ఓట్లు వేయించారా?’ అని Xలో నిలదీశారు.

News June 27, 2024

భారత్ vs ఇంగ్లండ్ మ్యాచ్ టాస్ ఆలస్యం

image

T20 WCలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ టాస్ ఆలస్యంగా వేయనున్నారు. వర్షం తగ్గినప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత గ్రౌండ్‌ను పరిశీలించి టాస్, మ్యాచ్ ప్రారంభ సమయాన్ని ప్రకటించనున్నారు.

News June 27, 2024

మనం వెళ్లిపోయాక కూడా కల్కి గుర్తుంటుంది: విజయ్ దేవరకొండ

image

‘కల్కి 2898ఏడీ’పై నటుడు విజయ్ దేవరకొండ ట్విటర్‌లో ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘నాగీ, ప్రభాస్ అన్నా, వైజయంతీ ఫిల్మ్.. ఈ ప్రేమ, విజయానికి మీరు అర్హులు. మీ అందరి పట్ల చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యు. అమితాబ్, దీపిక, కమల్ వంటివారు లేకపోతే కల్కి ఇలా ఉండేది కాదు. మనమందరం వెళ్లిపోయాక కూడా ఈ సినిమా చాలాకాలం గుర్తుంటుంది’ అని పేర్కొన్నారు. మూవీలో విజయ్ కీలక పాత్ర పోషించడం గమనార్హం.

News June 27, 2024

ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల

image

AP: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీసెట్-2024 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు ఏయూ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా 17 విశ్వవిద్యాలయాలు, అనుబంధ పీజీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఫలితాలు, ర్యాంకు కార్డుల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.