News June 27, 2024

ISSను ఎందుకు డీకమిషన్ చేస్తున్నారంటే?

image

1998లో లాంచ్ అయిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ జీవితకాలం చివరిదశకు చేరడంతో నాసా దీనిని <<13518250>>డీకమిషన్<<>> చేయాలని నిర్ణయించింది. నిర్వహణ భారం, ప్రైవేట్ సంస్థలకు కొత్త స్పేస్ స్టేషన్ నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనే ప్లాన్ ఉండటం ఇతర కారణాలు. ISS నిర్వహణలో USకు రష్యా, ఐరోపా సహకరిస్తూ వచ్చాయి. 2022లో నాసా డీకమిషన్ ప్లాన్ ప్రతిపాదించింది. కాగా సొంతంగా స్పేస్ స్టేషన్ లాంచ్ చేస్తామని అదే ఏడాది రష్యా ప్రకటించింది.

News June 27, 2024

HYD- విజయవాడ హైవే విస్తరణకు మోక్షం

image

హైదరాబాద్- VJA హైవే విస్తరణకు అడ్డంకులు తొలగనున్నాయి. 2010లో టెండర్ దక్కించుకున్న GMR 4లైన్ల హైవే నిర్మించింది. 2024 వరకు 6 లైన్లు చేయాలనే ఒప్పందముంది. అయితే AP, TG విభజన కారణంగా నష్టం వస్తోందని GMR కోర్టుకెళ్లగా విస్తరణ పనులు ఆగిపోయాయి. తాజాగా GMR, NHAI మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. ఆ సంస్థకు నష్ట పరిహారం ఇచ్చేందుకు NHAI ఒప్పుకోగా.. గడువుకి ముందే టోల్ వసూలు బాధ్యతల నుంచి GMR తప్పుకోనుంది.

News June 27, 2024

డిగ్రీ అర్హతతో 9,995 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

దేశవ్యాప్తంగా ఉన్న 43 రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 9,995 ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్), వివిధ కేటగిరీల్లో ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఏపీలో 450 పోస్టులు, తెలంగాణలో 700 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టులో, మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్‌లో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://www.ibps.in/

News June 27, 2024

రుషికొండ నిర్మాణాలు కూల్చేయాలంటూ విశ్రాంత IAS లేఖ

image

AP: విశాఖ రుషికొండ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కోరారు. ఆ నిర్మాణాలు కూల్చేయాలంటూ లేఖ రాశారు. పరిహారాన్ని అధికారుల ఖాతాల నుంచి రాబట్టాలని పేర్కొన్నారు. కేరళలో నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చినట్లు లేఖలో ప్రస్తావించారు. సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇప్పటికే విచారణ కమిటీ తేల్చిందని చెప్పారు.

News June 27, 2024

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత KCRకు లేదు: CM రేవంత్

image

TG: కాంగ్రెస్ నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్న విషయం కేసీఆర్‌కు గుర్తులేదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని, విద్యాశాఖ తన పరిధిలోనే ఉందని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి అలక అంశాన్ని విపక్షాలు రాజకీయంగా వాడుకోవాలని చూశాయని మండిపడ్డారు.

News June 27, 2024

జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదాం అన్నారు: మాజీ సీఎస్

image

AP: YS జగన్‌పై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం సంచలన వ్యాఖ్యలు చేశారని TDP ట్వీట్ చేసింది. ‘CMగా ఉన్నప్పుడు జగన్ భయంకరమైన ఆలోచనలు చేసేవారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదాం అన్నారు. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను’ అంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ టీవీ డిబేట్‌లో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. కాగా సీఎస్‌గా ఉన్న సమయంలోనే సుబ్రహ్మణ్యంను YCP ప్రభుత్వం బదిలీ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.

News June 27, 2024

అఫ్గానిస్థాన్ పేరిట చెత్త రికార్డు

image

టీ20 WC చరిత్రలో సెమీ ఫైనల్ మ్యాచుల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా అఫ్గానిస్థాన్ నిలిచింది. ఇవాళ సౌతాఫ్రికాతో మ్యాచులో ఆ జట్టు 56 రన్స్‌కే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2009 టీ20 WC SFలో శ్రీలంకతో మ్యాచులో ఆ జట్టు 101 రన్స్ మాత్రమే చేసింది. ఇక మూడో స్థానంలో PAK (123-7vsSL, 2012) ఉంది.

News June 27, 2024

జీవన్ రెడ్డికి హైకమాండ్ హామీ ఇచ్చింది: CM

image

TG: జగిత్యాల అభివృద్ధి కోసమే BRS MLA సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన చేరికతో MLC జీవన్ రెడ్డి కొంత మనస్తాపానికి గురయ్యారని పేర్కొన్నారు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని పార్టీ హైకమాండ్ ఆయనకు హామీ ఇచ్చిందని తెలిపారు. రుణమాఫీ, రైతుభరోసా విషయంలో జీవన్ రెడ్డి సలహాలు తీసుకుంటామని ప్రెస్‌మీట్‌లో రేవంత్ చెప్పారు.

News June 27, 2024

బీజేపీకి BRS ఓట్లు వేయించింది: CM రేవంత్

image

MP ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి BRS ఓట్లు వేయించిందని CM రేవంత్ ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లలో బీజేపీకి ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. BRSను బతికించేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఎంపీ ఎన్నికల్లో ఓడించినా KCRకు బుద్ధి రాలేదని రేవంత్ ఫైరయ్యారు.

News June 27, 2024

నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తాం: రాష్ట్రపతి

image

నీట్ పరీక్షలో అవకతవకలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహిస్తామని ఉభయ సభలనుద్దేశించి ముర్ము ప్రసంగించారు.