News June 27, 2024

డీఎస్సీకి రెండు నోటిఫికేషన్లు?

image

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రెండు రకాలుగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి ఓ నోటిఫికేషన్, ఇప్పటికే టెట్‌లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చూస్తోందట. ఈ నెల 30న నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 10 నాటికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు వచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

News June 27, 2024

ఐఎస్ఎస్‌ను డీకమిషన్ చేసేందుకు స్పేస్ఎక్స్‌కు భారీ కాంట్రాక్ట్

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూ కక్ష్యలోకి తీసుకొచ్చి ధ్వంసం చేసేందుకు నాసా స్పేస్ఎక్స్‌తో $843 మిలియన్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 2030లో ఈ డీకమిషనింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పని రష్యా చేయాల్సి ఉన్నా పలు కారణాలతో నాసా దానిని తప్పించింది. ఇక కాంట్రాక్ట్‌లో భాగంగా స్పేస్ఎక్స్ ‘US డీఆర్బిట్ వెహికల్’ను నిర్మించనుంది. ISS శకలాలు జనసంచార ప్రాంతాల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోనుంది.

News June 27, 2024

శ్రీలంక హెడ్ కోచ్ రాజీనామా

image

శ్రీలంక క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్ పదవికి క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2022లో ఆయన బాధ్యతలు చేపట్టాక ఆ ఏడాది లంక ఆసియా కప్ గెలిచింది. అయితే ఆ జట్టు కన్సల్టింగ్ కోచ్ బాధ్యతల నుంచి జయవర్దనే నిష్క్రమించిన కొద్ది గంటల్లోనే సిల్వర్‌వుడ్ రాజీనామా చేయడం గమనార్హం. T20WCలో లంక జట్టు పేలవ ప్రదర్శన చేయడంతోనే ఆయన తప్పుకున్నట్లు బోర్డు తెలిపింది.

News June 27, 2024

రేవంత్‌ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని విరమించుకోవడం విచారకరం: KTR

image

2014-2023 మధ్య తాము ప్రతి ఏడాది జూన్ 2న IT, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల వార్షిక నివేదికలను విడుదల చేశామని KTR గుర్తుచేశారు. ‘ఈ నివేదికలు రాష్ట్రం సాధించిన విజయాలను గర్వంగా ప్రదర్శించాయి. ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేయడమే దీని ఉద్దేశం. కానీ రేవంత్‌ సర్కార్ ఈ సంప్రదాయాన్ని విరమించుకుంది. 2023-24 వార్షిక నివేదికలను విడుదల చేయకపోవడం విచారకరం’ అని ట్వీట్ చేశారు.

News June 27, 2024

రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా తీర్పిచ్చారు: రాష్ట్రపతి

image

కొత్తగా ఎన్నికైన ఎంపీలకు రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలిపారు. ‘ఎన్నికలు నిర్వహించిన ఈసీకి అభినందనలు. దేశ ప్రజలు మూడోసారి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా తీర్పిచ్చారు. పదేళ్ల పాలనలో గ్రామీణ వ్యవస్థ పరిపుష్టమైంది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరాయంగా పని చేస్తోంది’ అని పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు.

News June 27, 2024

మా ప్రభుత్వం ₹12,922 కోట్ల అప్పు తీర్చింది: టీ కాంగ్రెస్

image

CMగా KCR పదేళ్ల కాలంలో ₹7లక్షల కోట్ల అప్పులు చేశారని T కాంగ్రెస్ ట్వీట్ చేసింది. వాటిపై వడ్డీలు కట్టడానికే ప్రస్తుత ప్రభుత్వం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ‘2014లో అప్పు ₹62వేల కోట్లు. KCR దిగిపోయే నాటికి ₹7లక్షల కోట్లకు చేరింది. 2023 DEC 7 నుంచి 2024 JUNE 17 వరకు మా ప్రభుత్వం ₹25,118cr అప్పు తెచ్చింది. ₹38,040cr అప్పు తిరిగి కట్టింది. అంటే ₹12,922cr అప్పు తీర్చింది’ అని తెలిపింది.

News June 27, 2024

బుల్ జోరు.. సెన్సెక్స్@79000

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త రికార్డులను సృష్టించాయి. సెన్సెక్స్ 79వేల మార్క్ తాకి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. మరోవైపు నిఫ్టీ సైతం 23,974 చేరి సరికొత్త గరిష్ఠాలను తాకింది. అయితే కోల్ ఇండియా, LT, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్ వంటి బడా షేర్లు నష్టాలను నమోదు చేయడంతో మార్కెట్లు ఒడుదొడుకులకు గురవుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 73 పాయింట్ల లాభంతో 78,751 వద్ద ట్రేడవుతోంది.

News June 27, 2024

కస్టడీలోనూ నటి మేకప్.. మహిళా SIకి నోటీసులు

image

రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు, కన్నడ నటి పవిత్ర గౌడ పోలీస్ కస్టడీలోనూ మేకప్ వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. విచారణలో భాగంగా ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పవిత్రను ఒకరోజు బెంగళూరులోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆ గ్యాప్‌లో లిప్‌స్టిక్, మేకప్ వేసుకున్న ఆమె నవ్వుతూ ఇంటి నుంచి బయటికి వచ్చారు. దీంతో మేకప్‌కు అనుమతించిన మహిళా ఎస్సైకి కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు.

News June 27, 2024

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు

image

T20WC 2వ సెమీఫైనల్‌లో ఈ రోజు ఇంగ్లండ్‌ను భారత్ ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో గత T20WCలో ఇండియాVSఇంగ్లండ్‌ మ్యాచ్‌ పలువుర్ని కలవరపెడుతోంది. అందులో ఇంగ్లండ్ ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేదించారు. అయితే టీమ్ఇండియాలో అప్పటికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు బుమ్రా, జడేజా, కుల్దీప్ చేరికతో బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్‌లో స్టోక్స్, వోక్స్, హేల్స్ వంటి అనుభవజ్ఞులు లేరు.

News June 27, 2024

శ్రీనివాసుడి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,332 మంది దర్శించుకోగా 30,540 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు లభించింది.