News October 1, 2024

SBI సర్వర్లు డౌన్.. కస్టమర్ల ఇబ్బందులు

image

ఎస్‌బీఐ బ్యాంక్ సర్వర్లు డౌన్‌ అవ్వడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు మొదటి తారీఖున జీతాలు వేయలేకపోతున్నాయి. నిన్న కూడా సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తాయి. డబ్బులు కట్ అయినా పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇతర బ్యాంకుల్లోనూ ఈ సమస్యలు ఉన్నట్లు పలువురు వాపోతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?

News October 1, 2024

అందుకే ‘లులు’ కంపెనీని వద్దన్నాం: బొత్స

image

AP: ‘లులు’ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చే స్థలం విలువ రూ.1,300 కోట్లు ఉందని, కానీ ఆ సంస్థ రూ.600 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడుతుందని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే గతంలో లులు కంపెనీ పెట్టుబడులు వద్దని చెప్పామన్నారు. ‘రూ.99కే మద్యం ఇవ్వడం కాదు. నిత్యావసరాల రేట్లు తగ్గించాలి. 2.50 లక్షల మంది వాలంటీర్లను తప్పించారు. మద్యం షాపుల్లో పనిచేసే 15 వేల మంది సిబ్బందిని తీసేశారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News October 1, 2024

630 లీటర్ల రక్తదానం చేసిన ఫ్యామిలీ

image

గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం ఇప్పటివరకు 630 లీటర్ల రక్తాన్ని దానంగా ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని మణేక్‌బాగ్ ప్రాంతానికి చెందిన పటేల్ కుటుంబంలో 27 మంది ఉన్నారు. వీరిలో కొందరు 100సార్లకుపైగా రక్తదానం చేశారు. మొత్తంగా 1,400 యూనిట్ల బ్లడ్ డొనేషన్ చేసి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. మరోవైపు ఇదే ప్రాంతానికి చెందిన మవలంకర్ ఫ్యామిలీ కూడా 356 లీటర్ల రక్తదానం చేసింది.

News October 1, 2024

షకీబ్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు తన బ్యాటును గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా యంగ్ క్రికెటర్లకు కోహ్లీ తన బ్యాట్లను గిఫ్ట్‌గా ఇస్తుంటారు. రింకూ సింగ్, ఆకాశ్ దీప్, గుర్బాజ్ తదితరులకు బ్యాట్ ఇచ్చారు. మరోవైపు విరాట్ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆకాశ్ దీప్ నిన్న బంగ్లాపై రెండు సిక్సర్లు బాదడం విశేషం.

News October 1, 2024

కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అభ్యర్థులకు BIG ALERT

image

APలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ‘5 నెలల్లో PMT, PET పరీక్షలను పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. రెండో దశ అప్లికేషన్ ఫాం నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను <>వెబ్‌సైటులో <<>>పొందుపరుస్తాం. 2వ దశలో ఉత్తీర్ణులైన వారికి 3వ దశ ప్రధాన పరీక్ష జరుగుతుంది’ అని ఆమె ప్రకటించారు.

News October 1, 2024

మ్యాచ్‌లో రోహిత్ ఇచ్చిన సందేశం ఏంటంటే..: KL రాహుల్

image

బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజుల ఆట వర్షార్పణమైనప్పటికీ టీమ్ ఇండియా అద్భుత ఆటతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే దీనిక్కారణమని కేఎల్ రాహుల్ తెలిపారు. ‘ఎంత వీలైతే అంత ట్రై చేసి గెలవడానికే చూడాలని 4వ రోజు ఆట మొదలయ్యే సమయానికి రోహిత్ క్లియర్‌గా చెప్పారు. దీంతో దూకుడుగా ఆడేందుకు ఆటగాళ్లకు స్వేచ్ఛ లభించింది. వికెట్లు పడుతున్నా ఆ దూకుడును కొనసాగించి విజయం సాధించాం’ అని వెల్లడించారు.

News October 1, 2024

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్

image

AP: రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది. వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్‌లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News October 1, 2024

రజినీ ఆరోగ్యంపై డాక్టర్ల హెల్త్ బులెటిన్

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని చెప్పారు. కాగా రజినీ తీవ్రమైన అనారోగ్యంతో నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

News October 1, 2024

వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం: CBN

image

AP: దీపావళికి 3ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామని CM చంద్రబాబు పునరుద్ఘాటించారు. వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎలా ఇవ్వచ్చో చేసి చూపించామన్నారు. వాలంటీర్లను ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ను తీసుకొస్తామని చెప్పారు. నూతన ఇసుక పాలసీతో ప్రజలకు దగ్గరలో ఉన్న ఇసుకను ఫ్రీగా తీసుకెళ్లొచ్చని అన్నారు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు.

News October 1, 2024

కేటీఆర్, హరీశ్‌కు మానవత్వం ఉందా?: కోమటిరెడ్డి

image

TG: మీకు గోదావరి నీళ్లు.. మాకు మూసీ నీళ్లా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులను ప్రశ్నించారు. వారికి అసలు మానవత్వం ఉందా అని ఆయన నిలదీశారు. ‘మిమ్మల్ని ఓడించినందుకు నల్గొండ ప్రజలపై కక్ష గట్టారు. నల్గొండ అంటే ఎందుకంత కోపం? మూసీ ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డుపడితే ప్రత్యక్ష ఉద్యమం చేపడతాం’ అని ఆయన హెచ్చరించారు.