News June 27, 2024

BREAKING: ఫైనల్‌కు సౌతాఫ్రికా

image

T20WC: అఫ్గానిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి. సెమీఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సౌతాఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది. అఫ్గాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. డికాక్ (5) ప్రారంభంలోనే ఔట్ అయినా కెప్టెన్ మార్క్రమ్ (23*), హెండ్రిక్స్ (29*) తమ జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటర్ల ఘోర వైఫల్యంతో అఫ్గాన్ 56 పరుగులకే ఆలౌట్ అయింది.

News June 27, 2024

ఇంజినీర్లు చెప్పినా కేసీఆర్ వినలేదు: కోదండరాం

image

TG: మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడం మంచిది కాదని ఇంజినీరింగ్ కమిటీ చెప్పినా అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని TJS అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టడం, డిజైన్ ప్రకారం నిర్మించకపోవడం, నిర్వహణ లోపంతో మేడిగడ్డ కుంగిందని డ్యాం సేఫ్టీ అధికారులు కూడా తేల్చారని తెలిపారు. ఇప్పటికైనా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించే అంశాన్ని సర్కార్ పున:పరిశీలించాలని కోదండరాం కోరారు.

News June 27, 2024

చేతిరాత బిల్లులకు చెల్లు.. ఇక ఆన్‌లైన్ పర్మిట్లే

image

AP: గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అంటోంది. దీంతో గత టీడీపీ హయాంలో ఉన్న ఆన్‌లైన్ విధానాన్నే తీసుకురానున్నారు. ఈ మేరకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇటు సీవరేజి వసూళ్ల కాంట్రాక్టర్లూ ఆన్‌లైన్ పర్మిట్లే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

News June 27, 2024

హెల్మెట్ లేకుంటే ఉపేక్షించొద్దు: హైకోర్టు సీరియస్

image

AP: వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాల దృష్ట్యా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలంది. ట్రాఫిక్ పోలీసులు బాడీవోర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరముందని పేర్కొంది. వాహన చట్ట నిబంధనలను అమలు చేసేందుకు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈ అంశంపై పిటిషన్ వేసిన వ్యక్తిని అభినందించింది.

News June 27, 2024

నేడు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం

image

కొత్తగా కొలువుదీరిన లోక్‌సభతో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే ముర్ముకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ స్వాగతం పలుకుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87ప్రకారం లోక్‌సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది.

News June 27, 2024

విద్యుత్ వినియోగదారుల కోసం కొత్త సదుపాయం

image

TG: కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానాలున్న వినియోగదారుల కోసం దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ ఓ సదుపాయాన్ని తీసుకొచ్చింది. <>వెబ్‌సైట్‌లో<<>> విద్యుత్ ఛార్జీలను తెలుసుకునేందుకు వీలుగా ‘ఎనర్జీ ఛార్జెస్ కాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్’ అనే సర్వీసును ప్రారంభించింది. దీని కోసం రీడింగ్ తేదీలు, యూనిట్ల వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉత్తర డిస్కం వినియోగదారులూ దీనిని వినియోగించుకోవచ్చు.

News June 27, 2024

నితీశ్‌కు గాయమా? ఇంకేదైనా కారణమా?

image

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో ఆ సిరీస్ నుంచి తప్పుకున్నారు. కానీ నితీశ్ గాయంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతను నిజంగా గాయపడ్డారా? లేక వేరే కారణంతో తప్పించారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నితీశ్ ఏ టోర్నీలోనూ ఆడటం లేదని, అలాంటప్పుడు గాయం ఎలా అయిందని అడుగుతున్నారు. ఇటీవలే యోయో టెస్ట్ కూడా పాసయ్యారని, పూర్తి ఫిట్‌గా ఉన్నారనేది ఫ్యాన్స్ వాదన.

News June 27, 2024

పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

image

AP: పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న ఉ.6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది.

News June 27, 2024

ట్రిపుల్ ఐటీలకు 53వేల దరఖాస్తులు.. 11న జాబితా విడుదల

image

AP: IIITల్లో 2024-25 అడ్మిషన్లకు సంబంధించి 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. వీరికి జులై 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల పరిశీలన చేసి అడ్మిషన్లు ఇస్తారు. స్పెషల్ కేటగిరీ వారికి జులై 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు.

News June 27, 2024

IND vs ENG: ఫైనల్ చేరేదెవరో?

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరగనుంది. గయానాలోని డారెన్ సామి స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. T20WC-2022 సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు బట్లర్ సేన అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండి టీమ్ ఇండియాకు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది.